నరేందర్‌రావు (ఫైల్) రజనీకాంత్ (ఫైల్)
పాపన్నపేట(మెదక్): తనువులు వేరైనా మనస్సులు ఒక్కటిగా జీవన యానం చే సిన మిత్రులిద్దరు..కలిసే మరణించారు.. కలిసే అంతిమ యాత్రకు తరలి వెళ్లారు. గురువారం రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ఉసురు తీసింది. ఊరందరితో కలసి మెలసి ఉండే ఇద్దరు మిత్రులు ఒకే సారి మృత్యువాత పడటంతో ఆరెపల్లి కన్నీటి సంద్రమైంది. శుక్రవారం నరేందర్‌రావు, రజనీకాంత్‌ల అంత్యక్రియలు ఆత్మీయుల అశ్రునయనాల మధ్య జరిగాయి.
చేతికొచ్చిన కొడుకులు చేజారిపాయే..
పాపన్నపేట మండలం ఆరెపల్లికి చెందిన రాధాబాయి, రాజేశ్వర్‌రావుల ఏకైక కుమారుడు నరేందర్‌రావు (38) ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రేషన్ డీలర్‌గా పనిచేసే ఈయన, సొంతభూమితోపాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. ఒక్కగా నొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు కన్నీరు మున్నీరయ్యారు. అదే గ్రామానికి చెందిన సత్యాబాయి, రామారావుల కుమారుడు రజనీకాంత్, పీజీ వరకు చదువుకున్న ఈయన కొంతకాలం పాటు మెదక్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాడు. అనంతరం భవన నిర్మాణ రంగంలో కొన్నాళ్లు పనిచేశాడు. ప్రస్తుతం పొడిచన్‌పల్లి వద్ద ఒక పెట్రోల్‌బంకులో పని చేస్తు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, భార్యా బిడ్డలకు తీరనిలోటు. అంత్యక్రియలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి హాజరై నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment