16 మండలాలు.. 1075 ల్యాండ్ పార్శిల్స్
తాజా కొలతలతో మ్యాపుల రూపకల్పన
హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం సర్కారు భూములపై రీ సర్వేకు సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జాల కట్టడికి ఉపక్రమించింది. ఇప్పటికే ల్యాండ్ బ్యాంకులో ఉన్న పార్శిల్స్ సైతం ఆక్రమణకు గురవుతుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. సర్వేయర్లను రంగంలోకి దింపి మరోమారు ప్రభుత్వ భూములు రీ సర్వే చేయించాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో పార్శిల్స్ వారిగా భూములను పరిశీలించి సమగ్ర నివేదికలు రూపొందించాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో మండలాల సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు. తాజాగా ప్రభుత్వ భూములన్నింటిని పరిశీలించి సంబంధిత స్థలంలో కొలతలు చేసి వివరంగా మ్యాపులను తయారుచేయాలని ఆదేశించారు.
రంగంలో 17 మంది సర్వేయర్లు
అధికార యంత్రాంగం సర్కారు భూముల రీ సర్వే కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని 16 మండలాల్లో సుమారు 17 మంది సర్వేయర్లు ఉన్నారు. గోల్కొండ మండలానికి మాత్రం ఇద్దరు సర్వేయర్లు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పార్శిల్ వారిగా సర్వే నిర్వహించి ఈ నెల 31 వరకు నివేదిక సమర్పించేలా ఆదేశించారు.
ఇదీ పరిస్థితి
u హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు 16 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 1075 ల్యాండ్ పార్శిల్స్‌లున్నట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
u అందులో 890 ల్యాండ్ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఉంది.
u మిగితా పార్శిల్స్‌లో సుమారు 11,45,334.95 చదరపు గజాల విసీర్ణం గల ఖాళీ స్థలం ఆక్రమణకు గురై ఉన్నట్లు తెలుస్తోంది.
u సుమారు 169 పార్శిల్స్‌లోని దాదాపు 11,93,595.12 చదరపు గజాల విస్తీర్ణ గల ఖాళీ స్ధలంతోపాటు 445098.64 చదరపు గజాలా ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
చదవండి: ‘బిల్డర్ల’ బాధితులకు హైడ్రా అండ
Comments
Please login to add a commentAdd a comment