సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీంగల్ మండలం రహత్ నగర్‌లో టీచర్‌గా పని చేస్తున్న సరస్వతికి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోలో నిబంధనల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బదిలీ అయింది.
దూరప్రాంతానికి బదిలీ కావడంతో మనస్థాపం చెందిన సరస్వతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. భర్త బేతల భూమేష్ ఉపాధి నిమిత్తం ఖతార్‌కు వెళ్ళాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చదవండి: ('మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణం.. వారిని వదలొద్దు')
టీచర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి స్వామి ఆర్మూర్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేశారు. ఉపాధ్యాయురాలు మృతికి మానసిక కారణమా? బదిలీతో మనస్థాపం చెందడమా అన్న కోణం విచారణలో తేలాల్సి ఉంది. బదిలీ కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నేతల హౌస్ అరెస్టు
ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు పలువురు నేతలను వారి ఇంట్లోనే నిర్భందించారు. దీంతో పోలీసులు,కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
చదవండి: (Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి..)
Comments
Please login to add a commentAdd a comment