నివేదికను ఆవిష్కరిస్తున్న రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 4 మీటర్లకు పైగా పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జలసౌధలో జరిగిన రాష్ట్ర భూగర్భ జలాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ‘భూగర్భ వనరులు–2020’నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భజల మట్టం మీటర్ పెరుగుదల 100 టీఎంసీల నీటితో సమానమన్నా రు. ఐదేళ్లలో 400 టీఎంసీల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 93% మండలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయన్నారు.
50 శాతానికి తగ్గిన భూగర్భ జల వినియోగం
2016–17లో రాష్ట్రంలో 65 శాతం భూగర్భ జలాల వినియోగం ఉండగా, 2019–20 నాటికి 50 శాతానికి తగ్గిందని రజత్‌కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల లభ్యత పెరగడమే ఇందుకు కారణమన్నారు. పెరిగిన భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని అధికారులను కోరారు.
కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఏ కేటగిరీ’, తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయా ల అభివృద్ధి సంస్థకు ‘ఏ కేటగిరీ’గ్రేడింగ్‌ను ఆర్‌ఈసీ కేటాయించిన నేపథ్యంలో.. ఈ సంస్థలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ లభించనుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్, భూగర్భ జల శాఖ డైరెక్టర్ ఎం.పండిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment