
హైదరాబాద్: బైక్ కొనివ్వమంటే తల్లిదండ్రులు నిరాకరించారని అలిగి ఓ బాలుడు ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోనీ గౌరీ శంకర్ కాలనీ సరస్వతి స్కూల్ సమీపంలో నివసించే సి.గోవర్ధన్ గత నెల 31వ తేదీన తండ్రి వెంకటయ్యను తనకు బైక్ కొనివ్వాలంటూ అడిగాడు.
అయితే తనకు ఆ స్థోమత లేదని తండ్రి చెప్పాడు. ఇక ఎప్పటికీ బైక్ కొనివ్వలేడని మనస్తాపానికి గురైన గోవర్ధన్ అదే రోజు రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. గత నాలుగు రోజుల పాటు తల్లిదండ్రులు కొడుకు కోసం అన్ని ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తన కొడుకు కనిపించడం లేదంటూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బాలుడికోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment