
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉండదని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రానికి అందాల్సిన వ్యాక్సిన్ డోసులు చేరకపోవడంతో పంపిణీ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేరిట ప్రకటన విడుదలైంది. మే1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్రంలో 18–44 ఏళ్లలోపు వారికి శనివారం నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యంకాదని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తెలిపింది. తాజాగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ డోసులు నిండుకోవడంతో 45 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం కష్టంగా మారినట్లు కనిపిస్తోంది. కేంద్రం నుంచి విడుదలయ్యే కోటా రాష్ట్రానికి చేరితే తప్ప వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment