సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి కుండపోత వర్షం దంచి కొడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో హైదరాబాదీలు హడలిపోతున్నారు. మబ్బులు దట్టంగా అలముకోవడంతో పట్టపగలే చీకటిగా మారింది.
భారీ వర్షంతో రోడ్లు పైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయక చర్యలు కోసం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్: 040-21111111కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment