
సాక్షి, హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ ,ట్యాంక్ బండ్, నాంపల్లి, అబిడ్స్, బషీర్ బాగ్, ఖైరతాబాద్, మంగళ్‌హట్, ఆఫ్జల్ గంజ్, కర్మన్‌ఘాట్, మీర్‌పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, అంబర్‌పేట్, నల్లకుంట, నాచారం, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీగా వర్షం పడుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మహేశ్వరం, కందుకూరులోనూ వర్షం కురుస్తోంది. అలాగే రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.