
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో కళంకిత సభ్యులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులపై విచారణ రోజువారీ చేపట్టాలని సీబీఐ, ఏసీబీ, ప్రత్యేక కోర్టులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన విధానాన్ని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని, జిల్లాల్లో కోర్టులు ఏర్పాటు చేసి భౌతిక విచారణ కొనసాగించాలని నిర్ణయించింది.
(చదవండి: ‘క్రిమినల్ జస్టిస్’లో ప్రాసిక్యూటర్లే కీలకం)
Comments
Please login to add a commentAdd a comment