
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసుల్లో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును కూడా అధికారులు అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినవి అమలు చేయడం కష్టమైతే ఎందుకు వీలు కాదో చెప్పాలి అని కోర్టు కోరింది. నిన్నటి బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడుగుతామని పేర్కొంది. కరోనా కేసులన్నింటిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment