చర్లపల్లిలో భారీ పేలుడు.. కారణం ఇదే.. | Huge Explosion In Cherlapally Underground Drainage | Sakshi
Sakshi News home page

చర్లపల్లిలో భారీ పేలుడు.. కారణం ఇదే..

Published Wed, Jan 3 2024 10:54 AM | Last Updated on Wed, Jan 3 2024 11:12 AM

Huge Explosion In Cherlapally Underground Drainage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్‌ హోల్‌ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధుసూదన్‌రెడ్డి నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement