Underground Drainage
-
చర్లపల్లిలో భారీ పేలుడు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధుసూదన్‌రెడ్డి నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దశలవారీగా తొలుత నగరపాలక సంస్థల్లో, ఆ తర్వాత పురపాలక సంఘాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం శాసనసభలో పద్దులపై చర్చ అనంతరం సమాధానంలో భాగంగా కేటీఆర్ ఈ విషయం ప్రకటించారు. హైదరాబాద్‌లో పోగవుతున్న చెత్త నుంచి 48 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టు కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం భారీ చెత్త డంపింగ్‌ను తమకు అప్పగించి వెళ్లిందన్నారు. రూ. 359 కోట్ల వ్యయంతో దానికి క్యాపింగ్ చేసే పని పూర్తి దశకు చేరుకుందని వివరించారు. తెలంగాణలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతు న్న నేపథ్యంలో మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42.6 శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే ఉంటున్నారని, మరో ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో అది 50 శాతానికి చేరుకుంటుందన్నారు. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలేనని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు.కొత్త మున్సిపల్ చట్టం ద్వారా జవాబుదారీతనం, పారదర్శక పాలన సాధ్యమవుతుందన్నారు. పురపాలక సంఘాల్లో ఇప్పటికే 3.47 లక్షల ఎల్ఈడీ లైట్లు అమర్చడం ద్వారా రూ. 35 కోట్ల విద్యుత్ బిల్లులను ఆదా చేశామని, హైదరాబాద్‌లో 4 లక్షల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో రూ. 35 కోట్ల విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో తమ పనితీరును అభినందించి కేంద్రం జాతీయ పురస్కారాలను ప్రకటించిందన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసుకునేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశామని, వాటిని విస్తరించే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటైన 106 బస్తీ దవాఖానాల సంఖ్య పెంచనున్నట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ రోడ్లకు రూ. 2,819 కోట్లు హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,819 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. గతేడాది ఈ పద్దు కోసం రూ. 1,542 కోట్లు ఖర్చు చేశామని, ఈసారి ఆ మొత్తానికి రూ. 1,300 కోట్ల మేర జత చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య పనులకు గతేడాది రూ. 807 కోట్లు ఖర్చు చేయగా ఈసారి రూ. 892 కోట్లు వ్యయం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి మూసీలోకి 1,800 ఎంఎల్డీ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ 700 ఎంఎల్‌డీని మాత్రమే శుద్ధి చేయగలుగుతుండటంతో మిగతా మురుగునీరు నల్లగొండ జిల్లాలోకి చేరుతోందన్నారు. పీపీపీ పద్ధతిలో కొత్తగా ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మొత్తం మురుగునీటిని శుద్ధి చేసి విడుదల చేస్తామన్నారు. భాగ్యనగర మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కాళేశ్వరం నీటిని తరలిస్తున్నామని, కేశవాపూర్ రిజర్వాయర్‌తో సిటీ ని అనుసంధానిస్తున్నామన్నారు. కృష్ణా నీటి సరఫరాలో ఇబ్బం ది ఉన్నా, రింగ్ మెయిన్ ద్వారా సిటీ అంతటికీ గోదావరి జలాలను సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో నిత్యం 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఎయిర్‌పోర్టుతో మెట్రోను అనుసంధానించబోతున్నామన్నారు. నగరంలో పాడయిన రోడ్లను త్వరలో బాగు చేస్తామని, ఎన్ఆర్సీఎం, గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయంతో జియాగూడ స్లాటర్ హౌస్‌ను వినియోగంలోకి తెస్తామని వెల్లడించారు. డ్రైనేజీలను శుభ్రపరిచే పనిని పూర్తిగా యాంత్రీకరించామని, దీనికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని గుర్తుచేశారు. -
పూర్తయ్యేనా..?
కరీంనగర్ ప్రజలకు ఎనిమిదేళ్లుగా ప్రత్యక్ష నరకం చూపిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) అయోమయంలో పడింది. పనులు కొలిక్కి వస్తున్నాయని అధికారులు చెబుతున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. రూ.76.5 కోట్ల నిధులతో 2008లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. 303 కిలో మీటర్ల పైపులైన్ పనుల్లో 285 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యా యి. ప్రస్తుత లెక్కల ప్రకారం 550 కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉంది. ఇప్పటికి సగం పనులు మాత్రమే పూర్తయినట్లుగా భావిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. – కరీంనగర్‌కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్: 38 ఎంఎల్డీ సామర్థ్యంతో బొమ్మకల్ గోపాల్చెరువు స్థలంలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు పూర్తయినా దాని సామర్థ్యానికి తగ్గట్టుగా ఇళ్ల నుంచి మురుగునీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కొద్దిసేపు నడిపించి బంద్ చేస్తున్నారు. కేవలం 8, 9, 18, 19, 20 డివిజన్ల నుంచి 25 వందల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఎస్టీపీని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బందితో నడిపిస్తున్నారు. 3,500 ఇన్స్పెక్షన్ చాంబర్లు.. ఎస్టీపీకి చేరువలో ఉన్న డివిజన్ల నుంచి యూజీడీకి కనెక్షన్లు ఇచ్చేందుకు నగరంలో 3,500 ఇన్స్పెక్షన్ చాంబర్లు నిర్మించారు. 59 వేల ఇళ్లలోంచి వచ్చే సెప్టిక్ ట్యాంకు పైపులను ఇన్స్పెక్షన్ చాంబర్లకు కలిపితే యూజీడీ పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వస్తుంది. నగరంలో ఇప్పటివరకు 10,600 మ్యాన్‌హోల్స్ నిర్మించారు. మొదటి దశలో 4 వేల ఇళ్లకు కనెక్షన్లు ఇస్తామని చెప్పినా ఆ దిశగా అధికారులు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఎస్టీపీకి నడిచేందుకు సరిపడా కనెక్షన్లు లేకపోవడంతో ఎస్టీపీని నడిపించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ïఎస్టీపీకి అతి చేరువలో ఉన్న హౌజింగ్‌బోర్డు కాలనీలో ప్రధాన పైపులైన్ మూడేళ్లుగా పనులు ముందు కు కదలడం లేదు. అక్కడక్కడ పనులు చేయడం వదిలేయడం కాంట్రా క్టర్ ఇష్టారాజ్యమే అవుతోంది. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో పైపులైన్ పనులకు గ్రహణం పట్టినట్లయింది. ముందుకు కదలని మురుగు.. ఇటీవల కనెక్షన్లు ఇచ్చిన 2500 ఇళ్ల నుంచి ఎస్టీపీకి వెళ్లాల్సిన మురుగు తరచూ పైపులైన్ జామ్ అవుతుండడంతో మురుగు ఇళ్లలోకే వస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీపీ పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నటుŠల్ తెలుస్తోంది. డ్రెయినేజీల్లో నిలుస్తున్న మురుగుతో దోమలు తయారై ప్రాణాంతక విషజ్వరాలు సోకుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. యూజీడీ నిర్వహణపై అధికారులు శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆలస్యంగా నిధులు మంజూరు.. 2014, ఆగస్టు 5న కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ యూజీడీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఖర్చుపెట్టిన రూ.76.5 కోట్లకు అదనంగా మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన రూ.25 కోట్లకు సంబంధించి ఈ నెల 8న మున్సిపల్ కార్యాలయంలో చాంబర్ల నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు. ఇళ్లలోంచి మురుగునీటి కనెక్షన్లు ఇచ్చి యూజీడీని పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే.. ఈ పనులు పూర్తిచేసి యూజీడీని ఉపయోగంలోకి తీసుకువస్తారా.. మళ్లీ మొదటికే వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనులపై అసహనం.. యూజీడీ పనులు అడ్డగోలుగా ఆలస్యం అవుతుండడం, ఇళ్లలోకి కనెక్షన్లు ఇచ్చే ప్రాంతాల్లో రోడ్లను అడ్డదిడ్డంగా పగుల గొడుతుండడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఇటీవలే పలు ప్రాంతాల్లో యూజీడీ పైపులైన్ పూర్తిచేసి సీసీ రోడ్డు వేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇళ్లలోంచి కనెక్షన్లు ఇవ్వాలంటే కొత్త రోడ్లను తవ్వక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న రోడ్లను మళ్లీ తవ్వడమంటే అభివృద్ధిని పదేళ్లు వెనక్కి తీసుకుపోవడమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో రోడ్లు తవ్వడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా ప్యాచ్ వర్క్‌లు.. యూజీడీ కోసం తవ్విన ఆరు నెలలలోపు ప్యాచ్ వర్క్ పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఏడేళ్లు గడిచినా వాటిని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఇదిలా ఉంటే నగర రోడ్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని చెబుతున్న నగరపాలక సంస్థ సైతం ప్యాచ్వర్క్లపై స్పందించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో స్థానికులు పాలకుల తీరుపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. కనెక్షన్ల కోసం టెండర్లు పూర్తిచేశాం.. ఇళ్ల నుంచి కనెక్షన్లు ఇచ్చే క్రమంలో ఇన్స్పెక్షన్ చాంబర్ల నిర్మాణానికి టెండర్లు పూర్తిచేశాం. గతంలో ఇన్స్పెక్షన్ చాంబర్ల నిర్మించిన రాంకీ సంస్థకే పనులు దక్కాయి. రూ.25 కోట్లతో దాదాపుగా పనులు పూర్తవుతాయి. యూజీడీ వినియోగంలోకి వస్తుంది. పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి అప్పగిస్తాం. – ఎం.భద్రయ్య, ఎస్ఈ, ప్రజారోగ్యశాఖ -
తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచి
► మన పథకాలు అక్కడా అమలు: హరీశ్‌రావు ► మూడేళ్లలోనే గణనీయమైన మార్పు తెచ్చామని వెల్లడి సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో రూ.215 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏవీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లలోనే గణనీయమైన మార్పు తెచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని మంత్రి వివరించారు. తాము అమలు చేస్తున్న షీ టీం వ్యవస్థపై బెంగాల్ ప్రభుత్వం అధ్యయనం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రవేశపెట్టిన హెల్త్ స్కీం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం వైపు ప్రజల మొగ్గు ప్రజలు ప్రైవేట్‌ను వదిలి ప్రభుత్వ విద్య, వైద్యం వైపు మళ్లారని, ఇది తమ ప్రభుత్వం ఘనత అని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రుల వైపు ప్రజలు పరుగులు పెట్టే వారనీ, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీన్ రివర్స్ అయిందన్నారు. కార్పొరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, మంచి బోధనతో ప్రైవేట్ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఎదుట సీట్లు భర్తీ అయినవి అనే బోర్డులు దర్శనమిస్తున్నాయని చెప్పారు. అలాగే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, కేసీఆర్ కిట్స్ పంపిణీ, నార్మల్ డెలివరీలు మొదలైన సేవలతో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారని హరీశ్‌రావు వివరించారు. విద్య, వైద్యంతోనే ప్రజల జీవన విధానం ముడిపడి ఉందన్నారు. ఇందుకోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్రం చేతులెత్తేసినా మోడల్ స్కూల్స్ నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు
వేలూరు: కార్పొరేషన్‌లోని ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్‌లోని మొత్తం 24 వార్డుల్లో రూ.40 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ కాలువకు ప్రతి ఇంటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు పూర్తిగా పైప్‌లైన్ ఏర్పాటు చేసి కలపాల్సి ఉంది. వీటిపై కార్పొరేషన్ అధికారుల బృందం ఇళ్ల యజమానులకు అవగాహన కల్పిం చారు. కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ కాలువల్లో లింకు చేసేందుకు అతి తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్ద పరిశీలించి వారందరికీ కాలువల్లో లింకులు ఇచ్చామని తెలిపారు. దీనిపైఆయా వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని భూగర్భ డ్రైనేజీ కాలువలకు అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ పథకంలో లింకు చేసేందుకు ఒక ఇంటికి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఒకే సారి చెల్లించక పోయినా నాలుగు దఫాలుగా కూడా నగదు చెల్లించవచ్చన్నారు. అనంతరం కొసపేటలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికీ వెళ్లిన కార్పొరేషన్ అధికారుల బృందం భూగర్భ డ్రైనే జీ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆ ప్రాంతంలో 450 ఇళ్ల పైపు లైన్లను లింకు చేసేందుకు దరఖాస్తులు అందజేశారు. ఆయనతో పాటు కార్పొరేషన్ ఇంజినీర్ బాలసుబ్రమణియన్, ఆరోగ్యశాఖ అధికారి బాలమురుగన్ ఉన్నారు. -
ప్రాణం.. లెక్క లేదా?
రామంతాపూర్: గ్రేటర్లో మ్యాన్‌హోల్స్‌లో దిగి ఇప్పటి వరకు 25 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు సమాచారం. కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా.... జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్ల తీరు మారడం లేదు. రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలో భూగర్భ డ్రైనేజీని శుభ్రపరచడానికి ఉప్పల్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు సోమవారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ కార్మికుడిని మ్యాన్‌హోల్‌లో దింపి.. పనులు చేయించారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు!
మాస్టర్ ప్లాన్ పనుల్లో ఇష్టారాజ్యం నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్ నాసిరకంగా భూగర్భ డ్రెయినేజి, తాగునీటి పైపులైన్ పనులు ఎక్కడా అడ్డుకోలేని అధికారులు బదిలీలకు ముందు రోజు హడావుడిగా రూ.4.07 కోట్లు మంజూరు సూపర్ చెక్ లేకుండానే బిల్లుల చెల్లింపు మాస్టర్ ప్లాన్.. పేరుకు తగినట్లే పనుల్లోనూ అవినీతి పద్ధతిగా సాగుతోంది. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినా.. గడువులోపు పనులు పూర్తి చేయకపోయినా.. చర్యలు తీసుకోవాల్సింది పోయి బిల్లులు చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా.. ఏ స్థాయిలోనూ ఈ కాంట్రాక్టు సంస్థను ఇదేమని ప్రశ్నించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. నాలుగు రోజుల వ్యవధి.. రూ.4.07 కోట్ల బిల్లు.. ఒకే రోజు ఏఈలు, డీఈ, ఈఈ, ఈఓ సంతకాలు.. అదే రోజు ఆడిట్ కార్యాలయంలోనూ ఆమోద ముద్ర పడటం చూస్తే.. ఈ సంస్థ ఎంత చాకచక్యంగా పనులు చక్కబెడుతుందో తెలుస్తోంది. దేవుని సన్నిధిలో పనులు చేయడమంటే.. అంతో ఇంతో భయం సహజం. శ్రీశైల క్షేత్రంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.137 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి విడత పనులను పరిశీలిస్తే కాంట్రాక్టర్‌కు ఆ భయమనేది లేదనే విషయం ఇట్టే అర్థమవుతుంది. తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజి, పిలిగ్రిమ్ షెడ్లు, పుష్కరిణి తదితర పనుల్లో నాణ్యత మచ్చుకైనా కనిపించదు. అభివృద్ధి మాటున జరుగుతున్న దోపిడీకి ఇక్కడి అధికారులు కూడా వంత పాడుతుండటం గమనార్హం. కొన్ని చోట్ల పనులు పూర్తి కాకుండానే లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక మంచినీటి సరఫరా పైపు లైన్ పనులు అవినీతికి పరాకాష్టగా చెప్పవచ్చు. వాస్తవానికి పైపులైన్ ఏర్పాటుకు తవ్వకం పూర్తయ్యాక ఆ మార్గంలో ఎక్కడా ఎగుడుదిగుడు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కాంక్రీట్‌తో సమాంతరంగా 18 అంగుళాల వెడల్పుతో బెడ్డింగ్ వేయాలి. అనంతరం పైపులను అమర్చి ఇరువైపులా మెత్తటి గ్రావెల్ నింపాలి. శ్రీశైలంలో చేపడుతున్న పనుల్లో ఈ ప్రక్రియకు నీళ్లొదిలారు. పైపులైన్ కింద భూమిని చదును చేయకపోగా.. కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కూడా విస్మరించారు. పైపులను రాళ్లు ఆధారంగా ముందుకు తీసుకెళ్లడం.. వీటి కింద ఫ్లైయాష్(కంకర పొడి) చల్లి చేతులు దులుపుకున్నారు. సూపర్ చెక్ ఎక్కడ? వాస్తవానికి ఈ పనులన్నింటినీ ఇంజినీరింగ్ అధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలి. అలాంటిది పనులను పర్యవేక్షిస్తున్న ఏఈలు కూడా ఎక్కడా అభ్యంతరం చెప్పకపోవడంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కనీసం బిల్లుల చెల్లింపు సమయానికి ముందు పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. ఇంజినీరింగ్ ఉన్నతాధికారి స్వయంగా ఈ పనులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి సూపర్ చెక్ చేయాలి. మ్యాన్ హోల్స్‌లో నీరు పోసి పక్కనే ఉన్న మ్యాన్‌హోల్స్ వరకు సాఫీగా ప్రవాహం ఉందా అన్నది పరిశీలించాలి. కానీ, భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పైపులైను పనుల్లో కళ్లు మూసుకుని బిల్లులు చేయడం గమనార్హం. హడావుడిగా రూ.కోట్ల చెల్లింపులు నాణ్యత లేని పనులకు ఆలయ అధికారులు హడావుడిగా ఎందుకు బిల్లులు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. శివాజీ రాజా గోపురం పనుల్లోనూ చేయని పనులకు ముందస్తుగా సుమారు రూ.60 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలోనూ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో దేవస్థానానికి చెందిన 26 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ జాబితాలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారి, అధికారుల పేర్లు ఉండటంతో.. కాంట్రాక్టర్ తెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అధికారులు కుమ్మక్కవడంతో ఏకంగా నాలుగు రోజుల వ్యవధిలో రూ.4.07 కోట్లకు సంబంధించిన బిల్లు పాసవడం చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. -
వేగవంతంగా భూగర్భ డ్రైనేజీ పనులు
కడప నగరంలో భూగర్భ డ్రైనేజీ పథకాన్ని అమల్లోకి తేవడానికి చర్యలు వేగవంతం చేయాలని నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా సూచించారు. శనివారం ప్రజారోగ్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన పనులను పరిశీలించారు. ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రధాన పైపులైన్లు, మ్యాన్‌హోళ్లను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పైపులకు ఇప్పటికే ప్రజలు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఇన్స్పెక్షన్ ఛాంబర్ల నుంచి మురికి నీరు వెళ్తుండటాన్ని గమనించారు. సంప్ హౌస్‌ను, నానా పల్లి వద్ద మురికినీరు నిల్వ ఉండే ఎస్టీపీని పరిశీలించారు. కొన్ని చోట్ల యూజిడీ పైపులైన్లలో కంకర, ఇసుక, పేరుకు పోయి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయనందున ఈ పథకం ఆగిపోయిందని చాలామంది అనుకొంటున్నారని చెప్పారు. ఈ అపవాదును తొలగించి పథకాన్ని కొనసాగించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఈ మేరకు ప్రస్తుతం మంజూరైన రూ. 36 కోట్లలో రూ. 2.50 కోట్లతో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. ప్రజలు ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇప్పటికిప్పుడు భరించుకోవాలంటే కష్టమవుతున్నందున వాటిని నిర్మించి ఇస్తేనే సబబుగా ఉంటుందని సూచించారు. కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరంలో 80 వేల ఇళ్లు ఉన్నాయని ప్రతి ఇంటికి ఇన్స్పెక్షన్ ఛాంబర్లు అవసరమవుతాయన్నారు. కొత్తగా నిర్మించుకొనే ఇళ్లకు ఇంటిప్లాన్తోపాటు యూజీడీకి రూ. 10వేలు చెల్లించాల్సివుంటుందన్నారు. పంప్ హౌస్ నిర్వహణ, విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీత భత్యాలు కలిపి ఏడాదికి రూ. 2 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. తాము పంపిస్తున్న ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించేందుకు వీలవుతుందని తెలిపారు. తాము పరిశీలించిన విధానాన్ని పాలకవర్గ సభ్యులందరికీ చూపేందుకు త్వరలో మళ్లీ క్షేత్ర పరిశీలన చేస్తామని కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. పథకం నిలిచిపోయిందనే అపవాదును తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ ఈఈ నగేష్, కార్పొరేషన్ డీఈ కేఎం దౌలా, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నల్లగొండ పట్టణాభివృద్ధికి.. రూ.89.78 కోట్లు
నల్లగొండ, న్యూస్‌లైన్ : నల్లగొండ పట్టణంలో డ్రెయినేజీ సమస్య త్వరలో తీరనుంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ వాటిని అనుసంధానించాల్సిన మురుగు శుద్ధి కేంద్రం ట్యాంకుల నిర్మాణంలో జాప్యం ఏర్పడింది. దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఎస్టీపీల నిర్మాణానికి భూసేకరణ పూర్తయినా నిధులు మంజూరుకు ప్రభుత్వం మోకాలొడ్డిం ది. ఎన్నికలకు ముందే నిధులు మంజూరు కావాల్సి ఉన్నా అప్పటి సీఎం ఉద్దేశ్యపూర్వకంగానే నిధులు విడుదల చేయకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో ధ్వజమెత్తారు. అయితే కోమటిరెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఎస్టీపీ ట్యాంకుల నిర్మాణం కూడా ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణమే తొలి విడత కింద ఎస్టీపీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రాష్ర్టస్థాయి అధికారులతో స్వయంగా చర్చలు జరిపి నిధులు మంజూరుకు కృషి చేశారు. నల్లగొండ శివారు ప్రాంతంలోని శేషమ్మగూడెం వద్ద ఎస్టీపీ-1, వల్లభాపురం చెర్వువద్ద ఎస్టీపీ-2 ట్యాంకు లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.89.78 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ నుంచి జీఓ నం.60 జారీ అయింది. పనులకు సంబంధించి పది రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. నెల రోజుల్లో ఎస్టీపీ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి తెలిపారు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మిగతా హామీలను కూడా త్వరలో నెరవేరుస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు. -
సమస్యల గూడెం
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : జిల్లాలో వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధ చెందిన తాడేపల్లిగూడెం సమస్యల నిలయంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. పూర్తికాని భూగర్భ డ్రెయినేజీ పనులు.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నాయి. రెండో వేసవి జలాశయం, రెండో వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కలగా మారింది. నవాబుపాలెంలో వంతెన నిర్మాణం మూడేళ్లుగా సాగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులు జల్లు కురిపించారు. 2004 నుంచి 2009 వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయగా వైఎస్ మరణానంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మళ్లీ వైఎస్ లాంటి నాయకుడు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. పాలిటెక్నిక్ భవన నిర్మాణమెప్పుడో.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలిటెక్నిక్ విద్యను చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సమీపంలో కొంత భూమిని ప్రభుత్వ పాలిటెక్నిక్ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన స్థలంలో భవన నిర్మాణానికి ఇష్టంలేని మరో ప్రజాప్రతినిధి మరో ప్రాంతంలో నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు. కాలం గడుస్తున్నా భవన నిర్మాణం ఊసులేదు. ప్రస్తుతం పెంటపాడు డీఆర్ గోయంకా కళాశాలలోని ఓ శిథిల భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది. జూనియర్ కళాశాలకు భవనం లేదు విద్యాపరంగా ఎంతో విస్తరించిన తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేదు. పదేళ్ల కాలంగా ఇదిగో జూనియర్ కళాశాలకు పక్కా భవనం అంటూ ఊరింపే కాని, ఉద్దరింపులేదు. కళాశాల నిర్మాణం కోసం పలుచోట్ల వేసిన శిలాఫలకాలు అలానే ఉండిపోయాయి. ఫలితంగా జెడ్పీ హైస్కూల్లోనే విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువులు కొనసాగిస్తున్నారు. దాహం కేకలు తాడేపల్లిగూడెంలో రెండో వేసవి జలాశయం ఎపిసోడ్ ఎంతకు కొలిక్కిరాకపోవడంతో శివారు ప్రాంతాలలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఇది నిత్యనూతనమై పోయింది. గతేడాది మార్చిలో రూ.30 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ముందుకుసాగడంలేదు. జట్లపాలెం చెరువు నిండా గుర్రపుడెక్కతో నిండిపోయింది. గూడు కల్పిస్తే ఒట్టు తాడేపల్లిగూడెంలో ఇళ్లులేని పేదలు పదివేలకు పైగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు వీరి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ గృహకల్ప వద్ద 52 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి పూడికకు నిధులు విడుదల చేశారు. అయితే మహానేత మరణానంతరం ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేరు. ఇదే ప్రాంతం సమీపంలో 2009లో 20 వార్డులలో అర్హులైన 480 మంది పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 2013 నాటికి 240 ఇళ్లు కట్టి ఇవ్వగలిగారు. వాటిని ఆర్భాటంగా అప్పటి సీఎం కిరణ్ ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇక్కడ మౌలిక వసతుల సమస్య ఉంది. 2007లో 280 మంది పేదలకు వైఎస్ హయాంలో కట్టించి ఇచ్చిన రాజీవ్ గృహకల్పలో సౌకర్యాల సంగతిని నేతలు విస్మరించారు. అబ్బో...అక్విడెక్టు నందమూరు పాత అక్విడెక్టు సమస్య ఏళ్ల తరబడి అలానే ఉంది. ప్రతిఏటా ఎర్రకాలువ వేలాది ఎకరాలను మింగేస్తున్నా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. మహానేత వైఎస్ రా జశేఖరరెడ్డి హయాంలో స మస్య పరిష్కారానికి న్యా యపరమైన అభ్యంతరాలు తొలిగాయి. ఆ యన మరణానంతరం వీటిని పట్టించు కున్నది లేదు.