
సాక్షి, మహబూబాబాద్: పట్టా కప్పుకొని అమ్మ పడుకుందంటే నిద్రపోతోందనే తెలుసు వారికి.. కానీ, అది శాశ్వతనిద్ర అని, ఇక ఎప్పటికీ లేవదని వారికేం తెలుసు.. తమ ఇంటికి ఎవరెవరో వచ్చిపోతుంటే బేలచూపులు చూస్తున్న ఈ ఇద్దరు చిన్నారులకు తాము అనాథలమయ్యామనే విషయం ఏం తెలుసు.. ‘నాన్న అమ్మను కొట్టి వెళ్లిపోయాడు. అమ్మ పట్టా కప్పుకొని పడుకుంది. మా అమ్మ మళ్లీ లేస్తుంది’ అని నాలుగేళ్ల కుమారుడు అంటుంటూ స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా రిపెడ మండలం ఆనకట్ట తండాలో చోటుచేసుకుంది. ఆనకట్టతండాకు చెందిన భూక్య రవీందర్, తేజావత్ మమత(28) దంపతులు. వీరికి నాలుగేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కుమార్తె ఉన్నారు. రవీందర్ ఇటీవల భార్యపై అనుమానం పెంచుకుని పలుమార్లు దాడికి పాల్పడగా, పెద్ద మనుషులు సర్దిచెప్పుకుంటూ వచ్చారు. అయినప్పటికీ అనుమానం వీడని రవీందర్ మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికాడు. కత్తితో గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక పరారయ్యాడు. – మరిపెడ రూరల్
Comments
Please login to add a commentAdd a comment