Hyderabad: 16 Suspected Terrorists Arrested By MP And Telangana Police - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్‌

Published Tue, May 9 2023 3:08 PM | Last Updated on Tue, May 9 2023 5:04 PM

HYD: 16 Suspected Terrorists Arrested By MP And Telangana Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మళ్లీ ఉగ్ర కదిలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఉగ్రదాడులకు కుట్రపన్నిన గ్యాంగ్‌ను యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ అరెస్ట్‌ చేసింది. మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురితోపాటు మధ్యప్రదేశ్‌ భోపాల్‌కు చెందిన 11 మందిని అరెస్ట్‌ చేసింది. కేంద్ర ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ, మధ్య ప్రదేశ్‌ పోలీసులు ఈ జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

నిందితులను హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నారు. వీరి నుంచి ఇస్లామిక్‌ జిహాదీ సాహిత్యంతో సహా కత్తులు, మొబైల్‌ ఫోన్లు, ట్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరంతా 18 నెలల నుంచి హైదరాబాద్‌లోనే  మకాం వేసి యవతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులను విచారిస్తే మరి కొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. వీరంతా ఏ ఉగ్రవాద సంస్థకు పనిచేస్తున్నారు. పాత కేసులతో సంబంధం ఉందా? లేదా గ్రూప్‌గా ఏర్పడి కుట్రలకు ప్లాన్‌ చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement