
హైదరాబాద్: కొత్త ఆలోచనలతో వ్యాపారాభివృద్ధికి బాటలు వేసే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించే దిశలో క్రియేటివ్ బిజినెస్ స్టార్టప్ ఐడియా పేరుతో స్టార్టప్ డెవలప్‌మెంట్ సెల్ రూ. లక్ష నగదు బహుమతితో పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు సీయో హబ్ వెబ్‌సైట్ లింక్‌లో తమ ఆలోచనలు, నైపుణ్యాలను షేర్ చేసుకోవచ్చు.
ఇందుకు సంబంధించి సియో కార్పొరేట్ ఎండీ వంశీ కూరపాటి మాట్లాడుతూ... మహిళలు తమ ప్రతిభను చాటుకునేందుకు, నైపుణ్యాలను ఆవిష్కరించుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీవోవో తనవి గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment