మెదక్: దాయరకాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... దాయర వీధికి చెందిన ఎర్రొల్ల రాజు(32) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సోమవారం రాత్రి భోజనంచేసి ఇంటి ముందు ఉన్న అరుగుమీద పడుకున్నాడు. దీంతో ఉదయం లేపడానికి ప్రయత్నించగా మృతి చెంది ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు శరీరం నలుపురంగులోకి మారడంతో ఏదైనా విషపురుగు కాటు వేయడంతో మృతి చెంది ఉంటాడని ఎస్‌ఐ పోచయ్య అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment