మెదక్: అనారోగ్యంతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య కుమార్తె వైష్ణవి (14) స్థానిక మోడల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల వైష్ణవికి జ్వరం రావడంతో నారాయణఖేడ్ ఆస్పత్రిలో చికిత్సచేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో 29న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. సోమవారం వైష్ణవి మృతి చెందింది. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు గ్రామానికి వెళ్లి వైష్ణవిని చూసి బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment