నేరేడ్‌మెట్:కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ,బీపీసీ(జనరల్)లతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసిందని శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎం.కిషన్ పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉందన్నారు. వచ్చే నెల 29వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు తిరిగి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు.
చదవండి: ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా?
Comments
Please login to add a commentAdd a comment