సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కుమారుడు కేటీ ఆర్‌తో పాటు ఆమె ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ధాన్యం సేకరణ, నీటి వాటాలపై కేం ద్రంతో చర్చించేందుకు సీఎం కూడా ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. కోవిడ్–19 మహమ్మారి బారినపడిన తర్వాత శోభ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. కేసీఆర్ సైతం తన సతీమణితో కలిసి ఆస్పత్రికి వెళ్లనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment