
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. 'ఆదివారం ప్రారంభించబోయేది 6వ వందేభారత్ ట్రైన్. మొత్తంగా 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించాము. ప్రతి ట్రైన్‌ని ప్రధాని మోదీనే ప్రారంభిస్తారు. అటల్ బిహార్ వాజ్‌పేయ్ కలలను ప్రధాని సాకారం చేస్తున్నారు. మోదీ తక్కువ ధరలకు మెడిసిన్, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.60వేల కోట్లను స్వచ్ఛ భారత్‌కి ఖర్చు చేస్తుంది. ప్రజల వద్దకే వైద్యం లక్ష్యంగా లక్షా యాభై వేల వెల్‌నెస్ సెంటర్స్‌ను కేంద్రం స్థాపించింది.
కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. ప్రతి నెలా మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తాం. ఇప్పటికే లక్ష యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2023 ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
చదవండి: (కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ)
Comments
Please login to add a commentAdd a comment