సుగంధాలు పరిమళించే పట్టు చీరను ఆవిష్కరిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు
సిరిసిల్లటౌన్/హైదరాబాద్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్ల విజయ్ తయారుచేసిన సిరిచందన పట్టుచీరను మంత్రులు కె.తారకరామారావు, హరీశ్‌రావు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిరిచందన’పట్టును ఆవిష్కరించిన మంత్రులు విజయ్‌ను అభినందించారు.
27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న ఆచీరకు విజయ్ విజ్ఞప్తి మేరకు మంత్రులు ‘సిరి చందన పట్టు’చీరగా నామకరణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పవర్‌లూం, టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment