Silk saree
-
వెరైటీ ఇక్కత్ పట్టుచీర..
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన సాయిని భరత్ అనే యువ చేనేత కళాకారుడు (Weaver) రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్‌పట్టు చీరను (ikkat silk saree) నేసి ఔరా అనిపించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన మొదటి సారిగా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లు కలిగిన ఇక్కత్ దుపట్టాను మగ్గంపై తయారు చేశారు. ఎంతో కళాత్మకంగా దుపట్టాను రూపొందించినందుకు గాను 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ (National Merit Certificate) అందుకున్నారు.ఎంటెక్ చేసిన సాయిని భరత్.. అదే స్ఫూర్తితో ఇక్కత్ కీర్తిని ద్విగుణీకృతం చేయాలని రెండున్నర ఏళ్లు కష్టపడి, ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి ఒక చీరకు వేర్వేరు డిజైన్లు, రంగులు వచ్చేలా అభివృద్ధి చేశారు. అనంతరం టై అండ్ డై డిజైనింగ్, మగ్గంతో పాటు వీవింగ్‌లో సైతం ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని వినియోగించి 15 రోజులు మగ్గంపైనేసి రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, రంగులు కలిగిన ఉల్టా లేని పట్టు చీరను తయారు చేశారు.ప్రస్తుతం ఆయన కొత్త డిజైన్లతో 3 శాంపిల్ ఇక్కత్ పట్టుచీరలను రూపొందించారు. వీటికి పేటెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కత్లో సాధ్యం కాని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. పరిశ్రమకు కొత్త ఇమేజ్ తీసుకొస్తున్న భరత్ ప్రతిభను పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రశంసిస్తున్నారు. పట్టుచీరలే కాకుండా భవిష్యత్తులో ఫర్నిషింగ్ వస్త్రాలనూ (Furnishing Cloth) రూపొందించనున్నట్లు భరత్ తెలిపారు. చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం హైదరాబాద్: చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం చిక్కడపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత, జౌళి శాఖలను వేరు చేయాలని, చేనేతకు రెండు వేల కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు.చదవండి: ప్రాణం తీసిన చీర గొడవగత సంవత్సరం ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉపాధి లభించకపోవడంతో 27 మంది చేనేతే కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇ చ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్, సుదర్శన్, నాగమూర్తి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
పట్టు చీరలో అందమే అసూయపడేలా తేజస్విని గౌడ (ఫొటోలు)
-
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'సిల్క్ శారీ'. ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్‌పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. "సిల్క్ శారీ" సినిమా మే 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత కమలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'సిల్క్ శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్లోకి నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్‌పై రెగ్యులర్‌గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్‌లోకి వస్తున్న మా 'సిల్క్ శారీ' సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని ఆయన అన్నారు. -
సిల్క్ సారీ.. చేతులోన స్కాచ్ గ్లాస్
వాసుదేవ్ రావు హీరోగా, రీవా చౌదరి, ప్రతీ గోస్వామి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సిల్క్ సారీ’. చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లిరికల్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది డైరెక్టర్ కి మంచి కమర్షియల్ సినిమా రేంజ్ లో పాట హిట్ అవ్వాలని కోరుకుంటున్న . అలాగే కమలేష్ కుమార్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి .ఆయన మొదటి ప్రయత్నంగ చేసిన ఈ సిల్క్ సారీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అయి ఆయనకి మంచిపేరు రావాలని ఆశిస్తున్నాను’ అన్నారు. -
తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!
టాలీవుడ్ నటి తమన్నా ఎప్పటికప్పుడూ డిఫెరెంట్ లుక్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తన అభిమానుల ఆశ్చర్యపరుస్తుంటుంది. ఒకపక్క బాలీవుడ్ వెబ్ సీరిస్తో బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడూ డిఫరెంట్ స్టయిల్ డిజైనర్ డ్రెస్‌లు ధరిస్తూ..తన క్యూట్ లుక్‌తో ఉన్న పోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలానే ఈ మిల్కీ బ్యూటీ తాజగా ఓ తెల్లటి చీరలో పాలరాతి శిల్పంలో మెరిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. చూడటానికి దివి నుంచి భువికి వచ్చిన దేవతా మాదిరిగా అందంగా ఉంది. నిజానికి ఈ ఫోటో 2022 నాటిది. ఈ చీర సావన్ గాంధీ బ్రాండ్‌కి చెందిన సునేహ్రీ ఐవరీ పిట్టా కలెక్షన్స్‌కి సంబంధించిన డిజైనర్ శారీ. ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే..శారీ బోర్డర్ అంతటా గోల్డ్ గొట్టా పట్టీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. నెక్‌లైన్‌ని కలిగి ఉన్న మ్యాచింగ్ గోల్డ్ బ్లౌజ్ ఆ చీరకు చక్కగా మ్యాచ్ అయ్యింది. దీనికి తగ్గట్టు గ్లిట్జీ పెర్ల్ చెవిపోగులు, కుందన బ్యాంగిల్స్ చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే జుట్టుని చక్కగా ముడివేయడం మంచి అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ చీర ఆర్గాన్జా సిల్క్ ఫ్రాబ్రిక్ కావడంతో శరీరంపై చక్కగా జాలువారుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 1,28,000/-. ఈ బ్రాండ్ చీరలు డిజైన్వేర్కి తగ్గ రేంజ్లో కాస్టలీగా ఉంటాయి. ఇక తమన్నా ఇటీవలే తమిళ అరణ్మనై 4 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పచ్చని చీరలో తళుక్కుమంది. ఆ చీర పల్లు చుట్టూ కూడా ఇలానే బంగారు బోర్డర్ ఉంది. ఆ ఈవెంట్లో తమన్నా ఈ చీరలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!) -
చందనాల చీరకు వెండిపోగుల వందనం
సిరిసిల్ల: వెండిపోగులతో మెరిసిపోతోంది. పరిమళాలు వెదజల్లుతోంది. సిరిసిల్ల నేత కళాకారుడి చేయి మరో అద్భుతాన్ని సృష్టించింది.. వెండితో పరిమళించే సిరి చందనం పట్టుచీర సో యగాలొలుకుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నాలుగు దశాబ్దాల కిందటే నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్.. తాజాగా వెండిపోగులతో పరిమళించే పట్టుచీరను మగ్గంపై నేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తల్లి జ్యోతి వెండిపోగుల సిరిచందనం పట్టు చీరను ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు విజయ్‌కుమార్ నెల పది రోజులపాటు శ్రమించి 90 గ్రాముల వెండితో పోగులను సిద్ధం చేసి, 27 రకాల పరిమళాలతో కూడిన నూలు పోగులతో పట్టుచీరను నేశాడు. 600 గ్రాముల బరువుతో, 48 ఇంచీల వెడల్పుతో ఐదున్నర మీటర్ల పొడవైన వెండిపోగుల చీరను సిద్ధం చేశాడు. కట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ చీర తయారీకి రూ.45 వేలు ఖర్చయినట్లు నల్ల విజయ్‌కుమార్ తెలిపారు. చీరను కలెక్టర్ తల్లి జ్యోతికి అందజేస్తానని ఆయన గురువారం తెలిపారు. -
మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!
సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ దీనిని రూపొందించారు. పవర్లూమ్పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పట్టుపోగులకు సుగంధాలు అద్ది సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేందుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్‌కుమార్ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్‌కుమార్ చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్‌కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్‌కుమార్‌ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్‌కుమార్ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్: సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ) కొత్తగా ఏదైనా చేయాలని.. వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. – నల్ల విజయ్‌కుమార్, నేత కళాకారుడు -
విజయనగరం : వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
సుగంధాల ‘సిరిచందన పట్టు’చీర
సిరిసిల్లటౌన్/హైదరాబాద్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్ల విజయ్ తయారుచేసిన సిరిచందన పట్టుచీరను మంత్రులు కె.తారకరామారావు, హరీశ్‌రావు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిరిచందన’పట్టును ఆవిష్కరించిన మంత్రులు విజయ్ను అభినందించారు. 27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న ఆచీరకు విజయ్ విజ్ఞప్తి మేరకు మంత్రులు ‘సిరి చందన పట్టు’చీరగా నామకరణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పవర్‌లూం, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
27 రకాల సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీర
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ పరిమళించే పట్టు చీరను రూపొందించారు. విజయ్‌కుమార్ ఇప్పటికే తండ్రి పరంధాములు స్ఫూర్తితో అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి పవర్లూమ్పై పట్టు చీరను నేశాడు. సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచీల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. నాలుగు రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. (క్లిక్: డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి) -
పేట చేనేతకు వందేళ్ల చరిత్ర..
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది.. ఆ కళాకారులది. చేనేత కార్మికులు నైపుణ్యంతో దేశీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, రాజోళి, నారాయణపేట చీరల పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో అద్భుతమైన చీరలు తయారవుతున్నాయి. సాధారణ నూలుతోనే ఆకర్షించే చీరలు నేస్తూ..విభిన్నమైన చీరలు రూపుదిద్దడంలో తమకు తామే సాటని చాటుతున్నారు. మగ్గాలపై తమలోని తృష్ణను బయటకు తీసి, చీరలపై అందమైన డిజైన్లుగా మారుస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, మహబూబ్‌నగర్(నారాయణపేట) : పల్లె నుంచి పట్నం వరకు అడిగిమరి కొనే చీరల్లో నారాయణపేట పట్టు ఒకటి. ఇక్కడి చేనేతకు వందేళ్ల చరిత్ర ఉంది. అంతటి మన్నికైన.. అపురూపమైన డిజైన్ల చీరలను తయారు చేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభ. పేట చీరల చీరల తయారీకి పట్టణంతో పాటు జాజాపూర్, కోటకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఉన్నారు. 1900 సంవత్సరం నుంచే ఇక్కడ పట్టుచీరలు తయారుచేస్తున్నట్లు చరిత్ర చెప్తుంది. మగ్గాలపై చీరలు నేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించిన నారాయణపేట కార్మికులు నాలుగు సంవత్సరాల క్రితం జియోగ్రాఫికల్ నుంచి పెటెంట్హక్కును సాధించుకున్నారు. అగ్టిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు నారాయణపేట పట్టుచీరలు దేశ, విదేశాల్లో సైతం ఖ్యాతిని సంపాదించుకున్నాయి. పెద్ద, పెద్ద పట్టణాల్లో సైతం ఎంతో ఆదరణ ఉంది. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా చీరలు నేయడం ఇక్కడి ప్రత్యేకత. అగ్గిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి సైతం ఈ చీరలు కట్టుకుందంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోవడం పరిపాటి. పట్టులో రకాలు పట్టు చీరల్లో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి. టెంపల్ గర్భరేషన్, నిఖల్, పారాస్, పైటీనియా, సైటనీ, నీవాళి దనవతి, శివశంభు, నివాళి శివశంలలో కడ్డి మరియూ ప్లేన్ రకాలతో పాటు స్పెషల్ బార్డర్ వంటివి ప్రత్యేక ఆకర్శణగా ఉంటాయి. వీటికి తోడు కొత్తగా వస్తున్న మాడల్స్‌కు అనుగుణంగా తయారుచేస్తున్నారు. అర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకోవడం జరుగుతుంది. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరగడంతో చీరల ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో చీర నేయడానికి రెండు నుంచి మూడు రోజలు సమయం పడుతుంది. గల్లి నుంచి ఢిల్లీ వరకు విక్రయాలు ‘పేట’ నేత కార్మికుల కుటుంబాలు తయారు చేసిన పట్టు చీరలు ఢిల్లీ వరకు అమ్మకానికి వెళ్తుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా హైద్రాబాద్, వరంగల్, పూణె, ముంబాయి, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, రాయిచూర్, గుల్బర్గ, యాద్గీర్, బెంగుళూర్, విజయవాడ, విషాఖపట్నం దుకాణాల్లో ప్రత్యేకంగా అమ్ముతుంటారు. డిల్లీలో సైతం ‘పేట’ పట్టు చీరలు దొరకడం విశేషం. పెళ్లిలు, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తుంటారు. గద్వాల టౌన్: సంస్థానాధీశుల కాలం నుంచి నేటి తరం ఆధునిక మహిళల మనస్సును కట్టిపడేసే డిజైన్లను అద్దుకున్న గద్వాల చీర నేడు దేశ, విదేశీ వనితల ఆదరణ పొందుతూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. కాటన్ చీరకు జరీ అంచుతో డిజైన్ చేయబడిన నాటి తరం సంప్రదాయాన్ని కొనసాగిస్తునే నేటి అదునిక అవసరాలకు అనుగుణంగా సీకో(కాటన్, సిల్క్)లను కలిపి దారంతో సరికొత్త డిజైన్లతో మహిళలను మనస్సుకు నచ్చేలా గద్వాల ప్రాంత చేనేత కార్మికులు చీరల నేతలను కొనసాగిస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడిన నాలుగు వందల ఏళ్ల నాటి నుంచి గద్వాల చీరకు ప్రత్యేక కాలగుణంగా ప్రత్యేకత ఉండేలా చేనేతకు ప్రాణం పోస్తున్నారు. ఆదునిక సాంకేతకను జోడిస్తూ గద్వాల చీర ప్రత్యేకతను నిలబెట్టుకునేలా ఇక్కడి చేనేత వృత్తిని సగర్వంగా కాలంతో వస్తున్న పోటీలో నిలుస్తున్నారు. చీరల తయారీలో మాస్టర్ వీవర్స్, వీవర్స్ తమ వృత్తిలో నిల్చునేలా, గద్వాల చీరకు ప్రత్యేకత, గుర్తింపు, మహిళల ఆదరణ ఉండేలా ఎవరికి వారు పోటీ పడుతున్నారు. సంస్థానాధీశుల కాలంలో చేనేత కార్మికులు తమ చేనేత కళ ప్రతిభతో అగ్గిపెట్టెలో చీర ఇమిడేలా తయారు చేసేవారు. ఆ నాటి నుంచి తిరుమల శ్రీనివాసుడికి ఏటా జరిగే దసర బ్రహ్మోత్సవాలలో గద్వాలలో నిష్టగా తయారు చేసిన ఎరవాడ పంచెలను ధరింప చేస్తున్నారు. అంతటి ప్రత్యేక గద్వాల చీరలకు, చేనేత ప్రతిభకు ఉంది. రూ.1200 నుంచి రూ.40వేల విలువ వరకు... కాటన్ చీరకు అంచు, కొంగు బార్డర్లో గద్వాల వారసత్యంగా వస్తున్న డిజైన్లతో పాటు, నేటి ఆదునిక డిజైన్లను నేస్తున్నారు. జరీలో వెండి, రాగి, బంగారుతో తయారైన జరీ పోగులను బార్డర్, కొంగు, చీర మద్యలో డిజైన్, బుట్టాలకు తమ ప్రతిభతో అందాలను అద్దుతున్నారు. గద్వాల చీర రూ.12 వందల నుంచి రూ.40 వేల విలువ వరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతకు మించి డిజైన్‌ను మరింత ఖరీదుతో చేయాలంటే ముందస్తు ఆర్డర్‌ను ఇవ్వాల్సింటుంది. -
మీ పట్టుచీర భద్రమేనా..?
హిమాయత్‌నగర్: హిమాయత్‌నగర్‌కు చెందిన నీలిమారెడ్డి ఓ షాపింగ్ మాల్లో రూ.25వేలతో పట్టు చీర కొనుగోలు చేసింది. అయితే అది మూడు వారాలకే పట్టు కోల్పోయింది. బంజారాహిల్స్‌కు చెందిన మహాలక్ష్మి ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన ఎక్స్‌పోలో రూ.18వేలతో పట్టు చీర తీసుకుంది. అదికాస్త నెల రోజులకే దారాలు రావడంతో అవాక్కయింది. వీరిద్దరే కాదు... ఇలా ఎంతోమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అతివలు ఎంతో ఇష్టపడే పట్టు చీరలు పదిలంగా ఉండాలంటే ఎలా? నాణ్యమైన పట్టును గుర్తించి కొనుగోలు చేయడం, దాన్నితగిన జాగ్రత్తలతో భద్రపరచడమే దీనికి పరిష్కారం. ఇదీ అసలైన పట్టు... పట్టు దారాల్లో యానిమల్ ఫైబర్, ఫ్లాంట్ ఫైబర్, మ్యాన్‌మేడ్ ఫైబర్, మినరల్(ఆస్బెస్టాస్) ఫైబర్ తదితర రకాలు ఉంటాయి. ⇔ యానిమల్ ఫ్లాంట్ దారాలను నేచురల్ ఫైబర్‌గా, మిగిలిన వాటిని సింథటిక్ ఫైబర్‌గా పరిగణిస్తారు. ⇔ యానిమల్ ఫైబర్ జుట్టు, ఊలు మాదిరిగా ఉంటుంది. దీన్ని కాలిస్తే జట్టు కాలిన వాసన వస్తుంది. గుండ్రంగా పూసలా మారి పౌడర్లా తయారవుతుంది. చీర చివర్లోని పోగులను కాల్చి, ఈ పట్టును నిర్ధరించుకోవచ్చు. ⇔ పాలిస్టర్, నైలాన్, రేయాన్‌ల దారమైతే త్వరగా కాలిపోతుంది. ఈ దారం కాలిపోయిన తర్వాత పూసలా గట్టిగా తయారవుతుంది. ⇔ మల్బరిలో రీల్ మల్బరి, డూపియన్, స్పిన్, నాయిల్, మట్కా, త్రోస్టర్, ఫెసుదా తదితర రకాలు ఉంటాయి. టస్సార్లో రీల్డ్ బస్సార్, కరియా, చిచా, జరీ తదితర ఉన్నాయి. ⇔ పట్టు వస్త్రాల తయారీలో వినియోగించే దారాలు, రంగులు, డిజైన్స్‌ను బట్టి ధర నిర్ణయిస్తారు. ⇔ పట్టు వస్త్రాలు మరీ ఎక్కువగా, మరీ తక్కువగా మెరిస్తే నిశితంగా పరిశీలించాలి. అసలైన పట్టు బంగారంలా మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ దుస్తులపై ఎలాంటి గీతలు ఉండవు. శుభ్రత.. భద్రత ⇔ పట్టు వస్త్రాలు ఎక్కువగా నీటిని పీల్చుకొని, వదిలే గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువ సమయం నీటిలో ఉంచితే రంగు పోతుంది. ⇔ శుభ్రతకు గోరు వెచ్చని మంచినీరు మాత్రమే వినియోగించాలి. ⇔ సబ్బు, బేబీ షాంపూను వీలైనంత తక్కువగా వాడాలి. ⇔ రంగు చీరలు అయితే అంచును నీళ్లలో తడిపి, చేతితో రుద్ది రంగు పోతుందో లేదో పరిశీలించాలి. 10 చుక్కల నిమ్మకాయ రసం వేసి, దానిలో చీరను ఉంచి వెంటనే ఉతకాలి. ⇔ పట్టు వస్త్రాలను శుభ్రత తర్వాత గట్టిగా పిండకుండా, మలవకుండా నీడలో ఆరేయాలి. ⇔ తేమగా ఉన్నప్పుడు ఇస్త్రీ చేస్తే వేడి ప్రభావం దుస్తులపై పడదు. ⇔ మడతలను ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మార్చాలి. ⇔ బీరువాలో భద్రపరిచే సమయంలో కలరా గోళీలు కాకుండా గంధపు చెక్క ముక్కలు గుడ్డలో చుట్టి ఉంచాలి. మిరియాలను ఒక వస్త్రంలో చుట్టి చీరల మధ్యలో ఉంచినా మంచిదే. దీనివల్ల తేమ చెరకుండా ఉంటుంది. తొలుత ఇబ్బంది... పట్టు చీరలంటే నాకు చాలా ఇష్టం. అయితే తొలుత సాధారణ చీరలలాగే దానినీ వాష్ చేశాను. దాంతో కలర్ పోవడం, దారాలు రాలిపోవడం జరిగింది. ఆ తర్వాత పట్టు చీరల శుభ్రత, భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాను. – పావనీరెడ్డి, అత్తాపూర్ జాగ్రత్తలు అవసరం... పట్టు చీరల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. నేను కూడా మొదట్లో సమస్యను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత చేనేత రంగానికి చెందిన వాళ్లని అడిగి తెలుసుకున్నాను. వాళ్ల సలహాలు, సూచనలు పాటించాను. ఇప్పుడు నా దగ్గరున్న పట్టు చీరలు తళతళ మెరుస్తున్నాయి. – గ్రేస్, మియాపూర్ -
కాలర్ ఎగరేయండి
ఏం అమ్మాయిలు కాలరెగరేయలేరా! అబ్బాయిలకు దీటుగా చెలరేగలేరా! ఎం‘చొక్కా’ అదరగొట్టలేరా! ఇదిగో వచ్చారు చక్కనమ్మలు... ‘చొక్క’నమ్మలు. అమ్మ చీరలు చూసి, ఆన్లైన్ శారీస్ చూసి, అమ్మమ్మ పట్టు చీరల రంగులు చూసి ఎన్నిసార్లు మనసు పారేసుకుని ఉంటారు.. ఈ చీర కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా అని. కానీ, ఆ బ్లౌజ్, ఆ స్టైల్ అబ్బో.. ‘నా వల్ల కాదు’ అని ఆ చీరలను పక్కన పెట్టేసుంటే మాత్రం మీరు ఓ అద్భుతమైన ఇండోవెస్ట్రన్ లుక్‌కి దూరమైనట్టే. నవతరం అమ్మాయిల ఆలోచనకు తగ్గట్టు సంప్రదాయ చీరకట్టులోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. వాటిలో షర్ట్ స్టైల్ బ్లౌజ్ శారీ డ్రేపింగ్ అదరహో అంటోంది. శారీ ఏదైనా ఒకటే షర్ట్ ఏ చీర అయినా మీకు నచ్చినది ఎంపిక చేసుకోండి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న వైట్ షర్ట్‌తో జత చేయండి. ఎందుకంటే ఇప్పటి ఆధునిక దుస్తుల్లో అమ్మాయిలు చొక్కాలు వేసుకోవడం సాధారణమైపోయింది. అమ్మ కట్టుకున్న విధంగానే చీరకట్టు సెట్ చేయండి. దాని మీదకు వైట్ షర్ట్ బ్లౌజ్‌గా ధరించండి. కొంగొత్తగా ఉన్న స్టైల్‌ని అద్దంలో ఓ సారి లుక్కేయ్యండి. ఇక పార్టీలో వెలిగిపోండి. ఈ ఇండోవెస్ట్రన్ లుక్ ఏ వేడుకకైనా బాగా నప్పుతుంది. అదనపు అలంకారాలేవీ అవసరం లేదు. స్టోల్ ది షో కుర్తీ మీదకు స్టోల్ ధరిస్తారు కదా! అలా పవిటచెంగును స్టోల్లా మెడచుట్టూ తిప్పితే.. ఈ కాంబినేషన్ లుక్ సూపర్బ్ అంటారు. రాయల్ లుక్ ఎడమ భుజం మీదుగా పవిటను తీసి, మెడచుట్టూ తిప్పి కుడి భుజం నుంచి ఎడమ భుజానికి కొంగును తిప్పితే ఆ కట్టు రాయల్ లుక్‌తో మెరిసిపోతుంది. లెహెంగా లుక్ చీరకట్టు పూర్తయ్యాక పవిటను వెనుక నుంచి కుడి భుజం మీదుగా ముందుకు తీసి లెహెంగా స్టైల్ అవుతుంది. ఈ లుక్ చూసి ఒకే చీరను ఎన్ని వెరైటీ లుక్‌తో మెరిపించవచ్చో మీరే ఆశ్చర్యపోతారు. ధోతీ స్టైల్ చీరకట్టును ధోతీలా కట్టి, పవిటను మాత్రం ఎడమ భుజం మీదుగా వేసుకుంటే వండర్ఫుల్ స్టైల్ అని కితాబులు మీ సొంతం అవుతాయి. పట్టు చీర– షర్ట్ పట్టు చీర రెడీగా ఉంది కానీ, మ్యాచింగ్ బ్లౌజ్ లేదని దిగులుపడొద్దు. ఎంచక్కా ఓ తెల్లని చొక్కా ధరిస్తే చాలు. ఏ చీర అయినా వేడుకలో స్పెషల్ అట్రాక్షన్. కాటన్ శారీ.. షర్ట్ సింపుల్‌గా కాటన్ చీర కట్టుకోమన్నా ‘అబ్బో అమ్మమ్మలా కనిపిస్తాం’ అనే అమ్మాయిలు కూడా ఈ స్టైల్‌కి ‘లవ్లీ లుక్’ అని కితాబులిచ్చేస్తారు. -
పట్టు చీర... పసిబిడ్డతో సమానం
బ్యూటిప్స్ పట్టు చీరను కొనడం ఒక ఎత్తయితే, దానిని మెయిన్‌టెయిన్ చేయడం మరొక ఎత్తు. పట్టు చీరలను ఇంట్లో వాష్ చేయవచ్చా? తరతరాలుగా వేధిస్తున్న ప్రశ్న. పట్టు చీరను ఇంట్లోనే వాష్ చేయవచ్చు... ►మొదటి మూడు ఉతుకులకూ ఎటువంటి సబ్బులు వాడరాదు. చీరను చన్నీటిలో ముంచి తీసి ఆరవేయాలి. ఆ తర్వాత ఉతుకుల్లో కూడా గాఢతతో కూడిన రసాయనాల సబ్బులను వాడరాదు. మైల్డ్ డిటర్జెంట్స్ లేదా ప్రొటీన్ షాంపూలనే వాడాలి. ►చీర మెయిన్ కలర్, అంచు, పల్లు కాంట్రాస్ట్ కలర్స్ అయితే ఉతికేటప్పుడు చీరంతటినీ ఒకేసారి నీటిలో ముంచరాదు. అంచుల వరకు నీటిలో ముంచి ఆరేయాలి. తర్వాత పల్లును నీటిలో ముంచి ఆరేయాలి. ఆ తర్వాత అంచులను, పల్లును కట్టేసి, చీర బాడీని నీటిలో ముంచి ఆరవేయాలి. ఆరవేసేటప్పుడు నీరు పొడి ప్రదేశంలోకి జారకూడదు. అలా జారితే ఆ రంగు మరో రంగు మీద పడుతుంది. ►పట్టుచీరలను నేరుగా ఎండ తగిలేటట్లు ఆరవేయకూడదు. సూర్యరశ్మి వేడి తగులుతూ నేరుగా స్యూర్యకిరణాలు సోకని ప్రదేశాల్లో (వరండాల వంటి చోట) ఆరవేయాలి. ►పట్టు వస్త్రాలను బ్రష్‌తో రుద్దకూడదు. గట్టిగా పిండకూడదు, నీరుకారిపోవడానికి మెలితిప్పకూడదు. మెల్లగా చేత్తో నొక్కుతూ నీటిని పిండాలి. ►ఒక్కమాటలో చెప్పాలంటే పట్టు చీరను హ్యాండిల్ చేయడం, పసిబిడ్డను హ్యాండిల్ చేయడం ఒక్కటే. -
అంచు పట్టు
► కొమ్మ చివరనే విరిసే పువ్వులు...మాను చివరనే మామిడి పిందెలు ► చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అవి ఎలాగో... ► పట్టు చీరకే జరీ జిలుగులు... చీర అంచునే వెలుగుల రేకలు. ఇవీ అలాగ!! ఆకుపచ్చని చీరంతా బంగారు పువ్వుల కాంతి. రెండు అంచెలుగా ఆకట్టుకునే పెద్ద అంచు. ఆ అంచు మీద మాటలకుఅందని వైభవం ఈ చీర సింగారం.వంగపండు, ఆకుపచ్చ కాంబినేషన్లతో చూపు తిప్పుకోనివ్వని విధంగా రూపుదిద్దుకున్నది ఈ పట్టుచీర. పెద్ద అంచు మీద ఎరుపు రంగు డిజైన్లలో కనువిందు చేస్తున్న నెమళ్ల అందం వర్ణనాతీతం. చీరంతా వచ్చిన జరీ బుటా ప్రత్యేక ఆకర్షణ.వినీలాకాశానికి బంగారు రంగు అద్దితే వచ్చే అందం ఈ పట్టుచీర సొంతం. బంగారు జరీ జిలుగులతో చీరంతా బుటా, జరీ అంచుతో మెరిసి పోతున్న ఈ పట్టుచీర వేడుకలో ఓ ప్రత్యేక ఆకర్షణ. పర్పుల్ కలర్ చీరపై మామిడి పిందెల డిజైన్ కళ్లను కట్టిపడేస్తుంటే మరో వైపు పెద్దంచు జరీ మెరుపు అబ్బురపరుస్తుంది. నీలిరంగు పల్లూ ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంది.ఎరుపు రంగు పట్టు చీర వేడుకలో ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌గానే నిలుస్తుంది. చీరంతా బంగారువర్ణంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూనే గ్రాండ్లుక్తో వెలిగిపోతున్న పల్లూ, పెద్ద జరీ అంచు ఈ చీరకు అదనపు హంగుగా అమరాయి. -
మూడేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డా!
‘‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది ....దాని జిమ్మదీయ అందమంతా చీరలోనె ఉన్నది’’ అంటూ ‘బంగారు బాబు’ సినిమాలో ఏఎన్నార్, వాణిశ్రీని పొగుడుతూ ఓ పాట పాడేశారు. ఇలా చీరకున్న గొప్పదనాన్ని చాలా మంది కవులు తమ రచనల్లో వర్ణించేవారు. స్త్రీలు ఎన్ని దుస్తులు ధరించినా చీరకు సాటి రాదంటారు చాలా మంది. విద్యాబాలన్‌ది కూడా ఇదే మా(బా)ట. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ -‘‘నేను మూడేళ్ల వయసులోనే ఆరు గజాల చీర తో ప్రేమలో పడిపోయా. మా అమ్మ చీరలన్నీ కట్టుకుని ఫొటోలు కూడా దిగాను కూడా. ఇప్పటికీ ఆ ఆల్బమ్ నా దగ్గరే ఉంది. ఎన్ని గ్లామరస్ రోల్స్ చేసినా, నాకు చీర కట్టుకున్నప్పుడు ఉన్నంత కంఫర్ట్నెస్, కిక్కు ఎన్ని ఆధునిక దుస్తులు వేసుకున్నా రాదు’’ అని చెప్పారు. తన దగ్గర ఉన్న శారీ కలెక్షన్ గురించి విద్యాబాలన్ చెబుతూ -‘‘నా దగ్గర చాలా చీరలున్నాయి. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎప్పుడూ చీరలే బహుమతిగా ఇస్తూ ఉంటారు అమ్మా నాన్న ఇచ్చిన కాంచీవరం పట్టుచీర , నా భర్త ఇచ్చిన ఎర్ర రంగు బెనార స్ శారీ ఈ రెండూ నాకు బాగా స్పెషల్. నాకు బాగా నచ్చిన చీర కట్టుకోమంటే మా అమ్మ పట్టుచీరల్లో ఒకదాన్ని ఎంచుకుంటా’’ అని చెప్పారు.