సాక్షి, సూర్యాపేట: గతేడాది గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన అమరత్వానికి ప్రతీకగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన 10 అడుగుల క్యాంస విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు.
ఈ కార్యక్రమంలో సంతోష్‌బాబు తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య యాదవ్‌లతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు. ఇక మంగళవారం సూర్యాపేటలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment