రహ్మత్‌బేగ్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం పార్టీకి చెందిన మీర్జా రహ్మత్‌బేగ్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.ప్రియాంక.. మీర్జా రహ్మత్‌బేగ్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ ఎన్నికకు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి మహ్మద్ రహీంఖాన్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో బరిలో మిగిలిన ఏకైక అభ్యర్థి మీర్జా రహ్మత్‌బేగ్ గెలిచినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment