సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ నగర్‌లో 330 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దశలవారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పీవీ మార్గ్‌లోని అంబేద్కర్ నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ , జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలని సూచించారు.
వర్షపు చుక్కలకు అంబేద్కర్ నగర్ వనికి పోయేదని, కోటిన్నర విలువ చేసే డబుల్ బెడ్‌రూం ఇల్లు పేదలకు ఉచితంగా అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇళ్లు, పేదలకు పెళ్లి ఖర్చు కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. పేదలకు ఇంత పెద్దగా ఇళ్లు కట్టిస్తున్ననగరం ఏదీ లేదన్నారు. ఇక్కడే ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 శాతం గ్రీనరీ పెరిగిందని, ఈ శాతాన్ని ఇంకా పెంచాలన్నారు. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలు వేయకుండా చూసుకోవాలని అధికారును ఆదేశించారు.
‘హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలి. 10 లిఫ్టులు ఉన్నాయి. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 560 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్‌కు 8 లక్షల 50 రూపాయల ఖర్చు చేసింది. జీహెచ్‌ఎంసీ అద్వర్యంలో 9 వేల కోట్ల పై చిలుకు రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. హుస్సేన్ సాగర్ తీరాన , లేక్ వ్యూ దగ్గర ఒక్క డబుల్ బెడ్‌రూం విలువ కోటిన్నర రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఫ్రీ గా ఇస్తుంది. హుస్సేన్ సాగర్ కు పూర్వ వైభవం తెస్తున్నాం’. అని అన్నారు.
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ నగర్‌లో ఇరుకు గదుల్లో ఉంటున్న వారి ఇబ్బందులను చూసి చలించిపోయి హుస్సేన్ సాగర్ తీరాన మంచి డబుల్ బెడ్‌రూం ఇళ్ళు కేసీఆర్ కట్టించారన్నారు. ఇక్కడ డబుల్ బెడ్‌రూం ఇల్లు విలువు కోటి 50 లక్షల రూపాయలు ఉంటుందన్నారు.
ఇక్కడ ఒక్కో డబుల్ బెడ్‌రూం విలువ కోటిన్నర: కేటీఆర్
Published Sat, Jun 26 2021 11:48 AM | Last Updated on Sat, Jun 26 2021 3:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment