సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్‌లో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులతో కమిటీ వేసింది. తాజాగా బోర్డు కమిటీ విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించింది.
అయితే, విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను అందించారు అధికారులు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా, దీనిపై సాత్విక్ తల్లిదండ్రులు స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీచైతన్య కాలేజ్ పేరు మద అడ్మిషన్ చేశాం. శ్రీచైతన్య కాలేజ్ నార్సింగి క్యాంపస్‌లో జాయిన్ చేస్తామని చెప్పారు. శ్రీచైతన్యలోనే అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్ ఉన్నట్టు మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది. మాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment