sathvik
-
Vaibhavam Movie: ఆకట్టుకుంటున్న ‘పల్లె వీధుల్లోన’ సాంగ్
రుత్విక్ - ఇక్రా ఇద్రిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైభవం’. సాత్విక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను విడుదల చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా... రితేష్ జి రావు ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. -
సాత్విక్‌ను బూతులు తిట్టి, చితకబాదారు: పోలీసులు రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది. ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతిచెందాడు. సాత్విక్‌ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్థుల ముందు కొట్టడం వల్ల హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపనికి గురయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్‌లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్‌కు చితకబాదారు. హాస్టల్లో సాత్విక్‌ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహ్యతపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
సాత్విక్: తప్పుల తడకగా అధికారులు రిపోర్ట్.. ఆవేదనలో పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్‌లో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులతో కమిటీ వేసింది. తాజాగా బోర్డు కమిటీ విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించింది. అయితే, విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను అందించారు అధికారులు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా, దీనిపై సాత్విక్ తల్లిదండ్రులు స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీచైతన్య కాలేజ్ పేరు మద అడ్మిషన్ చేశాం. శ్రీచైతన్య కాలేజ్ నార్సింగి క్యాంపస్‌లో జాయిన్ చేస్తామని చెప్పారు. శ్రీచైతన్యలోనే అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్ ఉన్నట్టు మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది. మాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైత్యన కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. తాజా రిపోర్టులో కూడా పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. అయితే, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. రిపోర్టులో భాగంగా సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై తాజాగా ఇంటర్ బోర్డ్ అధికారులు.. శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది. ఇక, విద్యార్థి సాత్విక్ మృతి నేపథ్యంలో డీఈవో ఆధ్వర్యంలో బోర్డు అధికారులు కాలేజీని విజిట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. కాగా, కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి అధికారులు.. కమిషనర్‌కు నివేదిక అందజేయనున్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అధికారులు.. విద్యార్థులు, పేరెంట్స్, మిగిలిన లెక్చరర్ల నుంచి కూడా సమాచారం తీసుకుని నివేదిక తయారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని నవీన్ మిట్టల్ తెలిపారు. -
బాధ్యులైన వారిని శిక్షిస్తాం : మంత్రి సబిత
-
సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా సీరియస్
-
మీ పేరు నిలబెడతాం.. థ్యాంక్స్ మామయ్య
-
హీరోగా మారిన 'బాహుబలి' బాలనటుడు
'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్. నేహా పఠాన్ హీరోయిన్గా కనిపించనుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంతో పాటు కాలేజీలో కుర్రాళ్ల కథే మా సినిమా అన్నారు శివ. మా సినిమాకు సంగీత దర్శకుడు కుంచె మరో హీరో అనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
విద్యార్థిని చితకబాదిన టీచర్
హైదరాబాద్: సరిగా చదవట్లేదని విద్యార్థిని టీచర్ చితకబాదిన సంఘటన మీర్‌పేటలో చోటు చేసుకుంది. స్థానిక నాగార్జున మాంటిస్సోరి ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్లో సాత్విక్(12) ఏడో తరగతి చదువుతున్నాడు. అతను సరిగా చదవటం లేదని తెలుగు టీచర్ శ్రీనివాస్ వీపుపై, భుజాలపై బెత్తంతో కొట్టాడు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.