
(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీల్లో రెండు అమలు అవుతున్నాయి మరో రెండు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్ ప్రయాణం వల్లే మేడారం జాతరకు మహిళా భక్తులు పోటెత్తారని అన్నారు. ఈయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం. ఉద్యోగులు గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో స్థానికతకు దూరంగా వెళ్లారు. జీవో 46, జీవో 317లను సమీక్షించేందుకు సబ్ కమిటీ వేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లా మొత్తం ఒక జోన్ ఉండేలా ఉంటే మంచిది.
ఉమ్మడి కరీంనగర్ 4 జోన్లుగా విభజించారు.దీంతో జూనియర్లు చేరిన చోట ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవు. సీనియర్లు అందరూ దగ్గరగా ఉండే చోటుకు వెళ్తే ఆ జోన్‌లో పదవీ విరమణ జరిగి ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే సవరణలు ఉంటాయి. ఏప్రిల్ చివరివారం లోపు కమిటీ నివేదిక ఇస్తే సంతోషం’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment