నవతరం.. నైపుణ్యం.. | Project Inclusion In Women | Sakshi
Sakshi News home page

నవతరం.. నైపుణ్యం..

Mar 14 2025 12:58 PM | Updated on Mar 14 2025 12:58 PM

Project Inclusion In Women

ప్రాజెక్ట్‌ ఇన్‌క్లూజన్‌తో వృద్ధి సాధిస్తున్న వ్యాపారాలు

వీ హబ్‌ వేదికగా వివిధ జిల్లాల గ్రాడ్యుయేట్స్‌

హస్తకళలతో స్ఫూర్తి నింపిన మహిళలు  

స్వతహాగా మహిళల హస్తాలు సృజనాత్మకత, కళాత్మకతను నింపుకుని ఉంటాయనేది నానుడి. ఇలాంటి మహిళలకు, వారి కళకు, కష్టానికి, ఆసక్తికి ప్రోత్సాహమందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. దీనిని నిజం చేసింది విమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌కు మద్దతునిచ్చే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వీ హబ్‌. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన టియర్‌–2, టియర్‌–3 ప్రాంతాలకు చెందిన మహిళలను  వ్యాపారులుగా అభివృద్ధి చేసి, ఆదర్శ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలుగా మార్చాలనే లక్ష్యంతో వీ హబ్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ ఇన్‌ క్లూ్యజన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా మహిళా వ్యాపారాలకు మార్కెట్‌ అనుసంధానం, బిజినెస్‌ రిజి్రస్టేషన్స్, మెంటార్షిప్, ఆర్థిక స్వావలంబన మార్గాలను అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 31 మంది మహిళలను నగరంలోని వీ హబ్‌ వేదికగా అభినందించి, వారి ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ 31 మంది మహిళల కృషి, పట్టుదల భవిష్యత్తు తరం వనితలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
                   

మహిళలకున్న ఆలోచనలను స్థిరమైన వ్యాపారాలుగా మార్చుతోంది వీ హబ్‌. దీని కోసం ‘ప్రాజెక్ట్‌ ఇన్‌క్లూజన్‌’ను ప్రారంభించింది. ఈ వేదికగా సదరు మహిళల వ్యాపారాభివృద్ధికి తోడ్పాటునందించే ఇతర సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వారసత్వంగా కొనసాగిస్తున్న హస్తకళలు మొదలు అధునాతన జీవన శైలిని ప్రతిబింబించే గృహాలంకరణ ఉత్పత్తుల వరకూ అనువైన వేదికను రూపొందించారు. ఇందులో సహకారం పొందిన వారు సొంత బ్రాండ్‌ రూపొందించుకుని చేనేత వస్త్ర ఉత్పత్తులు, మోడ్రన్‌ ప్యాకింగ్‌తో చాక్లెట్ల తయారీ, హోమ్‌ ఫుడ్స్, కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్, గానుగ నూనె తయారీ వంటి విభిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకున్నారు. 

ఈ సందర్భంగా వీ హబ్‌ సీఈఓ సీతా పల్లబొల్లా మాట్లాడుతూ.. మహిళా వ్యాపారులకు వారి సామర్థ్యాన్ని చాటిచెప్పే ప్రణాళికను అనుసంధానించి కేవలం వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక స్వయం ప్రతిపత్తికి తోడ్పడుతున్నాం అన్నారు. సెపె్టంబర్‌ 2024లో ప్రారంభమైన ప్రాజెక్ట్‌ ఇన్‌క్లూ్యజన్‌ కోసం 117 దరఖాస్తులు అందగా, ఇందులో 35 మంది మహిళలను ఎంపిక చేశాం. వీరిలో 31 మంది విజయవంతంగా కోర్సును పూర్తి చేశారని అన్నారు. ఈ గ్రాడ్యుయేషన్‌ తర్వాత వీరికి నిరంతర మెంటార్‌íÙప్‌ మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే.. అర్హులైన వ్యాపారాలను అందించే వీ హబ్‌ ర్యాంప్‌ ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రామ్‌లో చేర్చుతామని పేర్కొన్నారు.

కళాత్మక జీవితం మంచి అనుభూతి.. 
జేఎస్‌ఎమ్‌ బ్రాండ్‌ పేరుతో జెల్‌ క్యాండిల్స్‌ తయారు చేస్తున్నాను. మార్కెట్‌లో లభించే ఒక ప్రత్యేకమైన జెల్‌ను కరిగించి వివిధ డిజైన్లలోని గాజు పాత్రల్లో నింపుతాను. వీటికి అదనపు ఆకర్షణగా జెల్‌లో పూలను, చిన్న మొక్కల కొమ్మలను అలంకరిస్తాను. క్యాండిల్‌ వెలిగించినప్పుడు మంచి సువాసన రావడానికి సుగంధ పరిమళాలను వినియోగిస్తాను. ఈ కళను ఒక కోర్సుగా నేర్చుకున్నాను. షాలిబండలో ఒక ప్రదర్శనలో నా స్టాల్‌ చూసిన వీ హబ్‌ బృందం ప్రాజెక్ట్‌ ఇన్‌క్లూ్యజన్‌లో నన్ను భాగం చేశారు. వీటిని ఆన్‌లైన్‌ వేదికగానూ అమ్ముతున్నాను. నచి్చన కళతో జీవితం ఎంతో సంతృప్తినిస్తోంది.  
– ఇమ్రానా నోషీన్, జేఎస్‌మ్‌ జెల్‌ క్యాండిల్స్‌

కుల వృత్తితో అద్భుతాలు.. 
వారసత్వంగా వచి్చన కుల వృత్తితో వెండి ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. దీనిని సిల్వర్‌ ఫిలిగ్రీ అంటారు. మా పూరీ్వకులు ప్రతిష్టాత్మక పెంబర్తి మెటల్‌ షీట్స్‌ తయారు చేసేవారు. వాటికి తోడుగా వినూత్నంగా ఈ వెండి సౌందర్య అలంకార ప్రతిమలను తయారు చేస్తున్నాను. కరీంనగర్‌ మెప్మా ద్వారా వీ హబ్‌కు చురుకున్నాను. ఈ వేదిక ద్వారా మార్కెటింగ్‌ ఎలా పెంచుకోవచ్చు, కస్టమర్లను ఎలా చేరుకోవచ్చు వంటి అంశాల్లో అవగాహన పెరిగింది. మా వద్ద రూ. వెయ్యి నుంచి లక్ష విలువ చేసే అందమైన, అరుదైన వస్తువులు లభిస్తాయి.  
– సరళ, కరీంనగర్‌.

డీహైడ్రేట్‌ పళ్లతో డ్రైఫ్రూట్‌ చాక్లెట్లు.. 
చాకో మిస్టా బ్రాండింగ్‌తో హోమ్‌మేడ్‌ చాక్లెట్స్‌ తయారు చేస్తున్నాను. స్ట్రాబెర్రీ, మామిడి, పైనాపిల్‌ వంటి పళ్లను డీహైడ్రేట్‌ చేసి, వీటికి డ్రై ఫూట్స్‌ కలిపి చాక్లెట్స్‌ తయారు చేస్తాను. నేను హార్టీకల్చర్‌ నుంచి వచ్చాను.. ఈ ప్రయాణంలోనే చాక్లెట్‌ తయారీ పైన ఆసక్తి పెరిగింది. వీ హబ్‌ ప్యాకేజింగ్, డాక్యుమెంటేషన్, లైసెన్స్‌ రిజి్రస్టేషన్‌ వంటి అంశాల్లో సహకారం అందించింది. చాక్లెట్లలో ప్రిజర్వేటివ్స్, రంగులు వాడను. స్వచ్ఛమైన కోకో బటర్, పౌడర్, మిల్క్‌ పౌడర్‌ వంటివి వినియోగిస్తాను. దీనిని భవిష్యత్తులో పెద్ద బ్రాండ్‌గా మార్చి ఎగుమతి చేయాలనుంది. 
– కావ్య శ్రీ, చాకో మిస్టా వ్యవస్థాపకురాలు

రూరల్‌ టెక్‌ ప్రాజెక్టు చేయాలనుంది.. 
మహిళలకు తోడ్పాటునందించే ప్రాజెక్ట్‌ ఇన్‌క్లూ్యజన్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. మా సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్నాం. ఇక్కడి మహిళ కళ, కృషి సంతృప్తితో పాటు స్ఫూర్తిని నింపింది. ఈ ఫలితాలు అందించిన ఆనందంలో రూరల్‌ టెక్‌ అనే మరొక ప్రాజెక్టు చేపట్టాలనే కోరిక మొదలైంది. ఇది కార్యరూపం దాల్చడానికి వీ హబ్‌తో కలిసి పనిచేస్తాం.  
– సుజీవ్‌ నాయర్, రీ సస్టెయినబులిటీ గ్లోబల్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌

మూలాల్లోంచి కళాకృతులు.. 
వారాహి హస్తకళ పేరుతో.. ఆదివాసీ ప్రాంతాల్లో లభించే ఎండిన సొరకాయలతో అందమైన ఇంటీరియర్‌ ఉత్పత్తులు తయారు చేస్తున్నాను. వీటిని గిరిజనులు సహజమైన మంచినీళ్ల బాటిల్‌గా వినియోగించేవారు. ఈ సొర బుర్రలపై వేడి చేసిన ఇనుపచువ్వలతో అందమైన డిజైన్లను రూపొందిస్తాను. దీని మధ్యలో లైట్‌ వెలుగుతుంది. గత మూలాలను ఈ తరానికి అందంగా మార్చి ఇస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. వీ హబ్‌ నా ప్రయత్నాన్ని, కళను గుర్తించింది. సామాజికంగా వివిధ రంగాల ప్రజలతో అనుసంధానం చేస్తుంది. ఇందులో భాగంగానే బీఐసీసీఐ ఆధ్వర్యంలోని గ్రీన్‌ ఉద్యమకర్త అవార్డును పొందాను. గ్రామీణ కళాకృతులను విదేశాల్లోని వారికి చేరడం సంతోషాన్నిచి్చంది. 
– సింధూ, మొలుగు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement