సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్ చేశారు.
అందులో భాగంగా గురువారం.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Revanth Reddy House Arrest: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..
Published Thu, Apr 7 2022 9:34 AM | Last Updated on Thu, Apr 7 2022 1:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment