సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులోని ఎరసాని గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడినట్టు సమాచారం. దీంతో, వారిని నార్కట్‌పల్లి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఇద్దాక్(21), సమీర్(21), యాసిన్(18)గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 9 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, వీరందరు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా ఈ విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment