
కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న పార్వతి
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు పిల్లలను పోషించేందుకు వేరే గత్యంతరం లేక ఫుట్‌పాత్‌పై టీకొట్టు పెట్టుకొని బతుకు నెట్టుకొస్తున్న పార్వతి అనే మహిళ డబ్బాను తొలగించిన వైనంపై ‘నేనెట్టా బతకాలి సారూ’ అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమై కథనం పట్ల వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి స్పందించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆస్పత్రి సమీపంలో టీకొట్టు నిర్వహిస్తున్న ఆమె వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమె డబ్బాను తిరిగి పెట్టించారు.
జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి ఆమెకు వీధి వ్యాపారుల కార్డు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆమెను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఈ సందర్భంగా అధికారులను కోరారు. దీంతో బాధితురాలు పార్వతి కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: ‘నాతో రాకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా’
Comments
Please login to add a commentAdd a comment