
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు వచ్చిన కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.
చదవండి: (‘లిక్కర్ స్కామ్‌లో ‘కీ’ రోల్ కవితదే’.. కేసీఆర్ కూతురుకు బిగుస్తున్న ఉచ్చు?)
Comments
Please login to add a commentAdd a comment