![Solipeta Rama linga reddy admitted in hospital - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/30/SOMA.jpg.webp?itok=S-FFDe07)
దుబ్బాకటౌన్: అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని బుధవారం మంత్రి టి.హరీశ్‌రావు పరామర్శించారు. రామలింగారెడ్డికి కిడ్నీ సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం మూడు రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. దీంతో మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, రామలింగారెడ్డి ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడిందని ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రి వర్గాలతో ఫోన్‌లో ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు అందుతున్న చికిత్స గురించి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని అడిగినట్లు సమాచారం. మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే మంత్రి కేటీఆర్ సైతం ఆస్పత్రి వర్గాలతో మాట్లాడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment