
నర్సింహులపేట: భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారు అన్నస్వామి కుంటకు గండి పడింది. దీంతో బక్కతండా, పోట్యాతండా, బండమీదితండాకు చెందిన విద్యార్థులు గండి దాటి 5 కిలోమీటర్ల దూరంలోని నర్సింహులపేట, 2 కిలోమీటర్ల దూరంలోని జయపురం పాఠశాలలకు రావాలి.
దాదాపు 40 మంది విద్యార్థులు పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. ఇందులో బాలికలు ఎక్కువగా ఉన్నారు. కాగా, గండి లోతుగా పడటంతో వరద నీటిలో సైకిళ్లను ఎత్తుకొని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి గండి దాటిస్తున్నారు. గండిని త్వరగా పూడ్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment