సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఇటీవల ఓ ఉద్యోగి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్‌ఐ వైద్య కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ వెళ్లిన గవర్నర్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం సాయంత్రం 6.25 గంటలకు విశాఖ చేరుకున్నారు. ఆమెకు అధికారులు, బీజేపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా నగరంలో సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment