Master Health Checkup
-
అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం.. మాసాబ్ ట్యాంక్‌లోని సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ప్రారంభించిన విషయం విదితమే. శ్రీరామ నవమి సందర్బంగా గురువారం సెలవు దినం కారణంగా ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదని, రేపు(శుక్రవారం) నుండి తిరిగి యథావిధిగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు (ఏప్రిల్ 3 వతేదీ ఆదివారం మినహా) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. చదవండి: నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..! ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
డాక్టర్.. తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఇటీవల ఓ ఉద్యోగి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్ఐ వైద్య కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ వెళ్లిన గవర్నర్ గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం సాయంత్రం 6.25 గంటలకు విశాఖ చేరుకున్నారు. ఆమెకు అధికారులు, బీజేపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా నగరంలో సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. -
నిమ్స్‌లో ఇకపై మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు
పంజగుట్ట: నిమ్స్ ఆస్పత్రిలో శనివారం నుంచి కొత్తగా మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు నిమ్స్ మెడికల్ డైరెక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిమ్స్‌లో ఆయన విలేకరులకు వాటి వివరాలు వెల్లడించారు. మాస్టర్ హెల్త్ చెకప్‌లో రూ.5 వేల ప్యాకేజీతో అన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలు చేస్తామన్నారు. ఇందులో మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. ఎక్స్లెంట్ హెల్త్ చెకప్ కింద ఎనిమిదివేలు చెల్లిస్తే 23 రకాల పరీక్షలు జరుపుతామన్నారు. లైఫ్ చెకప్ పరీక్షలు పురుషులకు రూ.15 వేలు, మహిళలకు రూ.16 వేలతో 29 రకాల పరీక్షలు చేస్తామన్నారు. మహిళలకు ఒక్క పరీక్ష అదనంగా ఉంటుందని అందుకే రూ.వెయ్యి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షల ద్వారా మనిషిలో ఏ వ్యాధి ఉన్నా నిర్ధారించవచ్చునన్నారు. ఈ సేవలతో పాటు ఆయుష్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వైద్యులు, రేడియాలజీ వైద్యులు, ఆయుష్ వైద్యులు ఈ ప్రత్యేక ప్యాకేజీ కేంద్రంలో ఉంటారన్నారు. నిమ్స్‌లోని పాత భవనంలో పాత కాథలాబ్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఈ సేవలు లభిస్తాయన్నారు.వివరాలకు 040–23489022 నంబరు, https://nims.edu.in, నిమ్స్ హెచ్ఎమ్ఐఎస్ తదితర యాప్‌లను సంప్రదించి ప్రత్యేక బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. ఇదే కేంద్రంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమ సేవలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యంత ఖరీదైన ఈ పరీక్షలు నిమ్స్‌లో తక్కువ ధరలకే నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని వినియోగించుకోవాలని కోరారు. -
మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్
ధర్మవరం అర్బన్ : మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ (ఎంఎంహెచ్‌సీ) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద 35 ఏళ్లు పైబడిన మహిళలందరికీ 14 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారు. 35 ఏళ్లు పైబడిన వారికే ఎందుకంటే.. ? మహిళా ఆరోగ్య సూచి 2015 ప్రకారం 35 ఏళ్లు పైబడిన వారు ఆరోగ్యపరంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. వారిలో శారీరకంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోషకాహార లోపం, ఎముకల బలహీనత, రుతుక్రమంలో వచ్చే మార్పులు, మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ఎక్కువ మంది ప్రాణాంతక కేన్సర్ వ్యాధిబారిన పడుతున్నారు. – జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 35 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో 40 శాతం మందికి రక్తహీనత సమస్య ఉంది. – 17.6 శాతం మంది స్థూలకాయం, 18.1శాతం మంది మధుమేహంతో, 10శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఉచిత పరీక్షలు ఇవే... : ఎంఎంహెచ్‌సీ కార్యక్రమం కింద 14 రకాల పరీక్షల్ని మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్నారు. – పోషకాహారస్థాయి, రక్తంలో చక్కెరస్థాయి, రక్తపోటు, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్ష, విటమిన్ డీ3, రక్తంలో కాల్షియం స్థాయి, రక్తహీనత, రక్తంలో కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు, సర్వైకల్ కేన్సర్, రొమ్ము కేన్సర్ పరీక్షలు, ఈసీజీ, దంత పరీక్షలు తదితర పరీక్షలు చేస్తారు. నెలలో రెండు వారాలు : – ఎంఎంహెచ్‌సీ అమలుపై క్లస్టర్ల అదనపు జిల్లా ఆరోగ్య వైద్యశాఖాధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతినెలా రెండో గురువారం, నాలుగో గురువారంలో ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నారు. ఆయా ఆస్పత్రులకు మహిళల్ని ఆరోగ్య కార్యకర్తలు తీసుకురావాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలే కాకుండా వ్యాధి నిర్ధారణయితే చికిత్స ప్రారంభిస్తారు. – మహిళల్లో కేన్సర్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని నిలువరించడంపైనే ప్రధాన శ్రద్ధ చూపిస్తారు. అన్ని రకాల కేన్సర్లకు వైద్య సేవలు అందించేలా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశారు. – 35 ఏళ్లు పైబడిన మహిళలు 100కు 30 మంది ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఒక్కో ఆరోగ్య కార్యకర్త ప్రతి వారం తమ పరిధిలోని గ్రామాల నుంచి నలుగురిని ఉచిత పరీక్షలకు తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. – వైద్య సేవలతోపాటు సదరు మహిళలకు వైద్యాధికారులు కౌన్సెలింగ్ ఇస్తారు. శారీరకంగా, మానసికంగా, ధృఢంగా ఉండేలా వారికి కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. -
పోలీసులకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’
ఆదిలాబాద్ క్రైం : జిల్లా పోలీసుల ఆరోగ్య సంరక్షణపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’ కార్యక్రమాన్ని ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రంలోని సాకేత్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఎస్పీ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. 40 సంవత్సరాలు నిండిన ప్రతీ పోలీసు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో హెల్త్ చెకప్ నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం జిల్లాలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అలాంటి సమస్యలు తలెత్తబోవని చెప్పారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారని తెలిపారు. అన్ని వైద్య పరీక్షలు ఆధునిక పరికరాలతో నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, సాకేత్ ఆస్పత్రి వైద్యుడు మనోహర్, ఏఆర్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, పోలీసు అసోసియేషన్ అధికార ప్రతినిధి తాజుద్దీన్, సీఐలు బుచ్చిరెడ్డి, రవీందర్, ప్రవీణ్‌రెడ్డి, ఎస్సైలు, వైద్యులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి కుంటాల : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. కుంటాల పోలీస్‌స్టేషన్‌ను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు గ్రామగ్రామాన పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం జిల్లాలో త్వరలో 40 మంది మహిళా కానిస్టేబుళ్లతోపాటు మహిళా హోంగార్డులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఆయా పోలీస్స్టేషన్లలో సిబ్బందికి క్వార్టర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. భైంసా డీఎస్పీ రావుల గిరిధర్, గ్రామీణ సీఐ ఎడ్ల మహేశ్, కుంటాల ఎస్సై ఎల్.రాజు, భైంసా రూరల్ ఎస్సై రవిప్రసాద్ పాల్గొన్నారు. -
మాస్టర్ హెల్త్ చెకప్‌లో ఏయేపరీక్షలు చేస్తారు?
చాలా సంస్థల్లో వాటి వాటి ప్యాకేజీలను బట్టి కొన్ని పరీక్షలు అదనంగా ఉండవచ్చు. మరికొన్ని ఉండకపోవచ్చు. ఇక్కడ పేర్కొన్నవి సాధారణంగా లభ్యమయ్యే ముఖ్య పరీక్షలు. బ్లడ్ షుగర్ ఫాస్టింగ్(పరగడుపున), పోస్ట్ లంచ్ (ఆహారం తీసుకున్న తర్వాత) హెమోగ్రామ్ బ్లడ్ గ్రూప్‌ను నిర్ధారించే పరీక్ష (ఆర్‌హెచ్ ఫ్యాక్టర్స్‌తో) లిపిడ్ ప్రొఫైల్ (డెరైక్ట్ ఎల్డిఎల్) బ్లడ్ యూరియా సీరమ్ క్రయోటనైన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ స్టడీ స్టూల్ రొటీన్ చెక్ టు డి ఎకో థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్) ఇ.సి.జి(ఎలక్ట్రో కార్డియోగ్రామ్) ఎక్స్-రే చెస్ట్ పిఎ వ్యూ అల్ట్రాసౌండ్ (హోల్ అబ్డామిన్) బాడీ మాస్ ఇండెక్స్ ఫిజీషియన్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం డైటీషియన్‌ను సంప్రదించి పాటించాల్సిన ఆహార నియమాలను తెలుసుకోవడం