తెలంగాణ ఎన్నికల పోలింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections 2023 Polling Live Updates, Highlights In Telugu | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Thu, Nov 30 2023 6:35 AM | Last Updated on Thu, Nov 30 2023 7:19 PM

Telangana Assembly Elections 2023 Polling Live Updates, Highlights In Telugu - Sakshi

జంగ్‌ తెలంగాణ.. పోలింగ్‌ సమాచారం ఎప్పటికప్పుడు..

సాక్షి న్యూస్‌తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • 90 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా
  • నల్లగొండ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది
  • ఎర్రబెల్లి ఓటమి ఖాయం
  • కాంగ్రెస్ మ్యానిఫెస్టో పై ప్రజలకు నమ్మకం కుదిరింది
  • కార్యకర్తల పోరాటం వృధా కాలేదు.
  • డిసెంబర్ 9 న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.
  • ఎన్టీఆర్ లాంటి వారే ఓడారు.. కేసీఆర్ ఓ లెక్కా..
  • కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారు..
  • ప్రజలు ఆశీర్వదించారు.. కాంగ్రెస్ మార్క్ పాలన చూపిస్తాం.

గెలుపుపై బండి సంజయ్‌ ధీమా
కరీంనగర్ జిల్లా:

  • భారీ మెజారిటీతో గెలుస్తానన్న విశ్వాసం మాకుంది..
  • కార్యకర్తలదే ఈ గెలుపు కాబోతోంది..
  • వాళ్లంతా బీజేపీ గెలుపు కోసం కృషి చేశారు..
  • ప్రజలందరికీ, కరీంనగర్ నియోజకవర్గ ఓటర్స్ అందరికీ కృతజ్ఞతలు..
  • మోడీని, బీజేపీని గెలిపించాలన్న కసితో ప్రజలంతా ఏకమయ్యారు..
  • పోలింగ్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, మీడియా సిబ్బందికి హృదయ పూర్వక ధన్యవాదాలు..
  • కొంతమంది రెచ్చగొట్టే యత్నం చేసినా మా వాళ్ళు సంయమనం పాటించారు..
  • అలాగే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకూ ధన్యవాదాలు..
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జైట్ పోల్స్ ను ఇప్పుడే విశ్వాసంలోకి తీసుకోలేం..
  • చాలాసార్లు అంచనాలు తప్పాయి..
  • హాంగ్ వస్తే తీసుకోవాల్సిన నిర్ణయం అధిష్ఠానం చేతిలో ఉంటుంది..
  • మాది ఏక్ నిరంజన్ పార్టీ కాదు
     

కామారెడ్డి:

మీడియాతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

  • 10 ఏళ్లుగా నియంతృత్వ ధోరణితో ఉన్న కేసీఆర్‌ను ఓడగొట్టిన కామారెడ్డి ప్రజలకు ధన్యవాదములు
  • కేసీఆర్ శాశ్వతంగా అధికారంలో ఉంటామని కలలు కన్నారు
  • శ్రీకాంతాచారి త్యాగానికి నివాళులు
  • డిసెంబర్ 3న శ్రీకాంతాచారి చనిపోయారు.. అదే రోజు కేసీఆర్ పీడ పోతుంది 
  • అది ప్రకృతి దైవ నిర్ణయం
  • ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నట్టు చెబుతున్నాయి
  • తెలంగాణ సమాజం చైతన్యం మరోసారి బయట పడింది
  • ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ ప్రతీసారీ కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడే  వారు 
  • చంద్రుని మబ్బులు కమ్ముకున్నాయి

ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత మీడియాతో మంత్రి కేటీఆర్‌

  • ఇప్పుడు వచ్చిన exit poll గతంలో కూడా చూశాం
  • మాకున్న అంచనా ప్రకారం 70 పైగా స్థానాల్లో మేమే గెలుస్తున్నాం
  • డిసెంబర్ 3న మీరే చూస్తారు, ఇప్పుడు వచ్చిన exit poll తప్పు అని అర్థం చేసుకుంటారు
  • ఇదే నేషనల్ మీడియా గతంలో ఇలాంటి ఫలితాలే ఇచ్చింది
  • ఇవాళ ఇచ్చిన exit poll పోల్ తప్పని ఇవాళ ఇచ్చిన పలితాలు తప్పని డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా?
  • మళ్ళీ కేసిఆర్ సీఎం కాబోతున్నారు
  • ఫైనల్ పోలింగ్ శాతం అనేది రేపు ఉదయం వస్తుంది
  • ఆ తర్వత అనాలసిస్ చేయండి

  •  తెలంగాణలో ఓటింగ్‌ శాతం 64. 94
  • అత్యధికంగా  జనగాం, మెదక్‌ జిల్లాల్లో 80:28 శాతం
  • అత్యల్పంగా హైదరాబాద్‌ 39.97శాతం పోలింగ్‌ నమోదు


ఓటేయడానికి  ముఖం చాటేసిన భాగ్యనగర వాసులు

  • గ్రేటర్ హైదరాబాద్ లో 40 శాతం కూడా నమోదు కాని పోలింగ్
  • పోలింగ్ డే ను సెలవు రోజుగానే చూస్తున్న చదువుకున్న ఓటర్లు
  • గతంలానే ఓటేసేందుకు ముఖం చాటేసిన హైదరాబాదీలు
  • ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసిన సెలబ్రిటీలు
  • ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరగని ఓటింగ్

బీజేపీ ఫైట్ ఎవరికి లాభం ? ఎవరికీ నష్టం?

  • బీఅర్ఎస్, కాంగ్రెస్లకు గుబులు పుట్టించిన బీజేపీ
  • బీసీ సీఎం, మోదీ రోడ్ షో అగ్ర నేతల పర్యటనలు కలిసి వస్తాయని కాషాయ పార్టీ నేతల అంచనా 
  • మేనిఫెస్టో అంశాలు సైతం తమకే అనుకూలం అంటున్న కమలం పార్టీ   
  • పోలింగ్పై బీజేపి భారీ అంచనాలు
  • ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారతమని కమలనాథుల ఆశలు 
  • 2018 లో 14 లక్షల ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ 
  • ఈసారి ఓట్లు సీట్లు పెరుగుతాయని కాషాయ శ్రేణులు ధీమా 
  • పోలింగ్ కేంద్రాల్లో యువత ఎక్కువ కనిపించిందని .. యువత ఓటు తమ వైపే ఉందని బీజేపీ నేతల అంచనాలు 
  • దళితుల్లో మెజారిటీ వర్గమైన మాదిగల ఓట్లు తమకే  పోల్ అయినట్లు లెక్కలు వేసుకుంటున్నారు
  • పసుపు బోర్డ్ అంశంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్లలో లబ్ది చేకురుందని బీజేపి నేతల భావన

తెలంగాణలో ముగిసిన ఓటింగ్‌

  • చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ ప్రశాంతం
  • చాలాచోట్ల బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల కొట్లాట
  • పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి
  • వరంగల్‌, నల్లగొండలో ఇంకా భారీగా క్యూ లైన్లలో ఓటర్లు
  • క్యూ లైన్‌లలో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్‌కు అనుమతి


వరంగల్‌ ఈస్ట్‌ పెరకవాడలో ఉద్రిక్తత

  • పోలింగ్‌ సమయం ముగిసేముందు భారీగా తరలివచ్చిన ఓటర్లు
  • సమయం ముగిసిందంటూ.. పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించని పోలీసులు
  • పోలీసులు ఓటర్లకు మధ్య తోపులాట
  • ఇద్దరికీ గాయాలు
     

పినపాకలో రేగాకు నిరసన సెగ

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఏడుళ్ల బయ్యారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • పోలింగ్ కేంద్రం సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు
  • రేగాకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఏడుల బయ్యారం గ్రామస్తులు
  • సహనం కోల్పోయిన రేగా కాంతారావు.. తీవ్ర ఆగ్రహం
  • బూటు చూపించడంతో కోపోద్రిక్తులైన రేగా మీదకు దూసుకొచ్చిన గ్రామస్తులు
  • లాఠీఛార్జి చేసిన పోలీసులు

ఓటేసిన కస్తూరమ్మ

  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లోని మల్లాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న 102 ఏళ్ల కస్తూరమ్మ
  • ప్రతి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెబుతున్న అవ్వ

ఫిర్యాదు.. దాడి.. టెన్షన్‌ 

  • మహబూబ్ నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రెడ్డి పై దాడి చేశారంటూ పోలింగ్ బూత్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు
  • పోలింగ్ బూత్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగడం తో టెన్షన్ వాతావరణం
  • పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
  • శ్రీనివాస కాలని లో రిగ్గింగ్ జరుగుతుంది అని ఎన్నికల అధికారికి పిర్యాదు చేసిన రాజేందర్ రెడ్డి
  • ఫిర్యాదు చేసినందుకే తనపై దాడి అంటున్న రాజేందర్
  • దాడి చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులపై పోలీస్‌ ఫిర్యాదుకు సిద్ధమైన కాంగ్రెస్‌ నేతలు 

కాగజ్‌నగర్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద నిరసనలు

  • కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని 90 నంబర్ పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించిన బీజేపీ, బీఎస్పీ నాయకులు
  • అధికార పార్టీకి చెందిన ఏజెంట్లు ఏకపక్షంగా ఓట్లు వెయిస్తున్నారని ఆరోపణ
  • అధికారులు సైతం సహకరిస్తున్నారని ఆరోపణలతో నిరసన నినాదాలు

మళ్లీ మొరాయిస్తున్న ఈవీఎంలు

  • మరికాసేపట్లో ముగియనున్న తెలంగాణ ఓటింగ్‌ ప్రక్రియ
  • ముగింపు ముందర మళ్లీ మొరాయిస్తున్న ఈవీఎంలు
  • సరి చేస్తున్న అధికారులు
  • భారీగా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు
     
  •  ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


ఓటర్‌లారా.. పదండి

  • మరో గంటలో మగియనున్న తెలంగాణ ఎన్నికల  పోలింగ్‌
  • త్వరపడాలని చాటింపు వేయిస్తున్న ఎన్నికల సంఘం
     

ప్చ్‌.. హైదరాబాదీలు

  • గ్రేటర్ హైదరాబాద్ లో 40 శాతం కూడా నమోదు కాని పోలింగ్ 
  • పోలింగ్ డే ను సెలవు రోజుగానే చూస్తున్న చదువుకున్న ఓటర్లు
  • గతంలానే ఓటేసేందుకు ముఖం చాటేసిన హైదరాబాదీలు
  • ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసిన సెలబ్రిటీలు
  • ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరగని ఓటింగ్

  • సంగారెడ్డిలో ఇంకా ఓటు వేయని కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి

జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూంకు వికాస్‌ రాజ్‌

  • హైదరాబాద్ జిల్లా జీహెచ్‌ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం కు సీఈఓ వికాస్ రాజ్
  • హైదరాబాద్ పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పరిశీలన
  • వెబ్ కాస్టింగ్ ను పరిశీలించిన సీఈఓ వికాస్ రాజ్
  • హైదరాబాద్ పరిధిలో 1800 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
  • నాంపల్లి, గోషామహల్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎలక్షన్ కమిషన్

మంథనిలో ఈవీఎంల తరలింపు

  • పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ 
  • మంథని సమస్యాత్మక ప్రాంతం గా గుర్తించడం తో సాయంత్రం 4 గంటలకే ముగిసిన పోలింగ్ 
  • సాయంత్రం నాలుగు గంటల లోపు పోలింగ్ బూత్ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి 
  • మంథని లో మొత్తం 288 పోలింగ్ స్టేషన్స్ 
  • మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,442 
  • మంథని నియోజకవర్గం లో 10 మండలాలు 
  • అందులో 5 తీవ్ర సంయాత్మక మండలాలుగా గుర్తింపు 
  • మావోయిస్టుల ప్రభావం ఉండటం తో భారీ బలగాల మోహరింపు నడుమ పోలింగ్ 
  • పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని జేఎన్‌టీయూ కాలేజీ లో స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం లను భద్రపరచనున్నారు 
  • మూడు గంటల వరకు 65.15% గా నమోదైన పోలింగ్ 
  • మంథనిలో 82 శాతం  పోలింగ్ నమోదు
  • గత 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం 85.14%
  • బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పుట్ట మధు 
  • కాంగ్రెస్ నుండి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
  • బీజేపీ నుండి చండ్రుపట్ల సునీల్ రెడ్డి 
  • బీఎస్పీ నుండి చల్ల నారాయణ రెడ్డి 
  • మొత్తం 21 మంది బరిలో ఉన్నారు

గజ్వేల్‌లో ఈటల పరిశీలన

  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌  
  • జగదేవ్ పూర్ మండల కేంద్రంలో పలు పోలింగ్ బూత్ లను పరిశీలించిన బీజేపీ అభ్యర్థి ఈటల 
  • బీఆర్ఎస్ ఎన్ని బెదిరింపులకు దిగిన గజ్వేల్ ప్రజలు సైలెంట్ గా ఓటు వేస్తున్నారు. 
  • సీఎం మీద ఎంత కోపం ఉందో ఓటు రూపంలో చెప్పారు. మూడవ తేదీన అది బయటపడుతుంది. 
  • గజ్వేల్ రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ. ఈ నిరంకుశ్షత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు.

  • మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఐదు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌

సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో పూర్తైన పోలింగ్‌

  • నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే ముగిసిన పోలింగ్‌ 
  • 3341 పోలింగ్ కేంద్రాల్లో.. పోలింగ్‌ ప్రక్రియను ముగించిన ఎన్నికల అధికారులు 
  • ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌,
  • ఉమ్మడి కరీంనగర్‌లో మంథని
  • ఉమ్మడి వరంగల్‌లో భూపాలపల్లి, ములుగు,
  • ఉమ్మడి ఖమ్మంలో.. పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు సమస్యాత్మక సెగ్మెంట్లుగా గుర్తింపు
  • ఈవీఎంలను స్ట్రాంగ్   రూమ్ లకు తరలించనున్న అధికారులు

పెద్దపెల్లి జిల్లా మంథనిలో పూర్తైన పోలింగ్ ప్రక్రియ..

  • సమస్యాత్మక ప్రాంతం కావడంతో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కు అనుమతి..
  • ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్
  • మంథనిలో 82 శాతం  పోలింగ్ నమోదు

  • పోలింగ్‌ టైం ముగుస్తున్న తరుణంలో.. పెరుగుతున్న ఓటింగ్‌ శాతం
  • తెలంగాణలో పలు చోట్ల పెరుగుతున్న ఓటర్ల క్యూ
  • సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్‌

అక్కడ బారులు తీరిన ఓటర్లు

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాసేపట్లో ముగియనున్న పోలింగ్‌
  • సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, మంచిర్యాల. , బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో బారులు తీరిన ఓటర్లు
  • పోలింగ్‌ కేంద్రాల్లో అప్పటికీ లైన్‌లో ఉంటే.. ఓటు వేయడానికి అవకాశం
  • ఉమ్మడి ఖమ్మం మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలోనూ నాలుగు గంటలకే పోలింగ్‌ క్లోజ్‌ 
  • ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట,కొత్తగూడెంలో కాసేపట్లో ముగియనున్న పోలింగ్‌
  • ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 58.26 శాతం పోలింగ్ నమోదు
  • ఇల్లందులో మూడు గంటల వరకు  56 శాతం పోలింగ్ నమోదు
  • అశ్వారావుపేటలో 3గంటల వరకు 63.75 శాతం పోలింగ్ నమోదు
  • కొత్తగూడెం లో 49 శాతం,భద్రాచలం లో 63 శాతం,
  • పినపాక లో 63 శాతం పోలింగ్ నమోదు
  • పోలింగ్ ముగిసిన వెంటనే స్ట్రాంగ్   రూమ్ లను ఈవీఎంలకు తరలించనున్న  అధికారులు

  • కుటుంబంతో సహా ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు రాజశేఖర్‌

ఆ ప్రాంతాల్లో 4గం.కే ముగియనున్న పోలింగ్‌

  • మరికాసేపట్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ముగియనున్న పోలింగ్‌
  • 13  నియోజకవర్గాల్లో 4గంటలకే పోలింగ్‌ ముగింపు
  • అప్పటికే లైన్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్‌కు అనుమతి

 

ఇప్పటిదాకా ఓటేసింది ఎంతమంది అంటే..

  • తెలంగాణలో మధ్యాహ్నాం 3 గంటల కల్లా.. 52(51.89) శాతం
  • అత్యధికంగా మెదక్‌లో 69.33 శాతం పోలింగ్‌
  • అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం
  • ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకన్న కోటి 60 లక్షల మంది
  • మొత్తం ఓటర్లు 3.26 కోట్ల మంది
  • కిందటి ఎన్నికల్లో ఇదే సమయానికి 62 శాతం పోలింగ్‌

నియోజకవర్గాల వారీగా శాతంలో.. 
ఆదిలాబాద్ 62.3
భద్రాద్రి 58.3
హనుమకొండ 49
హైద్రాబాద్31.1
జగిత్యాల58.6
జనగాం62.2
భూపాలపల్లి64.3
గద్వాల్ 64.4
కామరెడ్డి 59
కరీంనగర్ 56
ఖమ్మం 63.6
ఆసిఫాబాద్ 59.6
మహబూబాబాద్ 65
మహబూబ్‌ నగర్‌ 58.8
మంచిర్యాల 59.1
మెదక్ 69.3
మేడ్చల్ 38.2
ములుగు 67.8
నాగర్‌ కర్నూల్ 57.5
నల్గొండ 59.9
నారాయణపేట 57.1
నిర్మల్ 60.3
నిజామాబాద్ 56.5
పెద్దపల్లి 59.2
సిరిసిల్ల 56.6
రంగారెడ్డి 42.4
సంగారెడ్డి 56.2
సిద్దిపేట 64.9
సూర్యాపేట 62
వికారాబాద్ 57.6
వనపర్తి 60
వరంగల్ 52.2
యాదాద్రి 64

ఎంత బిజీగా ఉన్నా వెళ్లి ఓటేయండి
ఓటు హక్క వినియోగించుకున్న సీఎంవో అధికారిణి  స్మితా సభర్వాల్‌
‘ఎంత బిజీగా వున్నా సరే.. వెళ్లి ఓటేయండి.. ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉంది’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు


ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి

  • ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు మృతి
  • మావలకు చెందిన తోకల గంగమ్మ (78) ఓటు వేయడానికి వచ్చి ఫిట్స్‌కు గురైంది
  • రిమ్స్‌కు తరలించే లోపే గంగమ్మ మృతి
  • భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) ఓటు వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డాడు.
  • కళ్లు తిరిగి పడిపోవడంతో రిమ్స్‌కు తరలింపు.. చికిత్స పొందుతూ మృతి 

తెలంగాణాలో కొనసాగుతున్న పోలింగ్…

  • మూడు గంటల సమయానికి తెలంగాణలో 52 శాతం పోలింగ్‌ నమోదు 
  • గ్రామీణ ప్రాంతాల్లో పోటెత్తుతున్న ఓటర్లు
  • పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌పై మిశ్రమ స్పందన
  • ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరగని ఓటింగ్!
  • జిల్లాల్లో పలుచోట్ల పరస్పర దాడులకు దిగిన కాంగ్రెస్ –బీఆర్ఎస్
  • ఎమ్మెల్యేలు, అభ్యర్ధులపై పలు చోట్ల దాడి ఘటనలు

నగర, పట్టణ ఓటర్లకు పిలుపు

  • పోలింగ్‌ రోజును సెలవు దినంగా భావించొద్దని ప్రముఖుల విజ్ఞప్తి 
  • అందరూ బాధ్యతగా ఓటెయ్యాలని పిలుపు
  • ఓటింగ్‌కు దూరంగా హైదరాబాదీలు
  • నగరంలో మందకొడిగా సాగుతున్న ఓటింగ్‌

పలు చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

  • ఒక్కో ఓటు వేయడానికి పది సెకండ్ల టైం పడుతోందని ఫిర్యాదులు
  • డీఈవోలతో తెలంగాణ సీఈవో కో-ఆర్డినేషన్‌
  • ఈవీఎంల మొరాయింపులపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
  • రెక్టిఫై లేదంటే.. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సమయం పెంచాలని కాంగ్రెస్‌ విజ్ఞప్తి

కామారెడ్డిలో ఘర్షణ వాతావరణం

  • రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
  • కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • ఉపాసనతో కలిసి ఓటేసిన నటుడు రాంచరణ్‌
  • ఎర్రబెల్లికి నిరసన సెగ
  • మైలారంలో పోలింగ్‌ బూత్‌ పరిశీలన వెళ్లిన ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తోపులాట
  • పోలీసుల లాఠీ ఛార్జ్‌.. ఇద్దరికి గాయాలు
  • ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తార మహేష్‌ బాబు..  సతీమణి నమ్రతా శిరోద్కర్‌ కూడా

మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ ఇలా..
నల్లగొండ..

  • దేవరకొండ.. 55శాతం
  • నాగార్జునసాగర్‌.. 61 శాతం
  • మిర్యాలగూడ.. 59.12 శాతం
  • మునుగోడు.. 62 శాతం
  • నకిరేకల్‌.. 61 శాతం
  • హజూర్‌నగర్‌ 67 శాతం
  • కామారెడ్డి  34 శాతం
  • హూజూరాబాద్‌ 55 శాతం
  • మధిరలో 41 శాతం
  • కరీంనగర్‌ 53 శాతం
  • మానకొండూరు 62 శాతం
  • చొప్పదండి 54 శాతం
  • మంథని 68 శాతం
  • ఆసిఫాబాద్‌ 62 శాతం
  • బోథ్‌ 61 శాతం
  • ఖానాపూర్‌ 58 శాతం
  • పెద్దపల్లి 55 శాతం
  • రామగుండం 49 శాతం
  • మెదక్‌ 69 శాతం
  • నర్సాపూర్‌ 69 శాతం
  • దబ్బాక 70 శాతం
  • గజ్వేల్‌ 62 శాతం

వికారాబాద్‌:

  • రేగడిమైలారం వద్ద బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • పోలింగ్‌ కేంద్రానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి రావడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం
  • నరేందర్‌రెడ్డి వెళ్లిపోయాక ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు
  • ప్రధాన రహదారిపై ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
     

యాదాద్రి..

  • ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత
  • బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత భర్త కారుపై రాళ్ల దాడి. 
  • కాంగ్రెస్‌ కార్యకర్తలే దాడి చేశారని బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణ.
     

ఓటు హక్కు వినియోగించుకున్న బాబు మోహన్‌

  • సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ ఆఫీస్ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించున్న బీజేపీ అభ్యర్థి పల్లి బాబుమోహన్
  • అందోల్ లో మద్యాన్ని డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేశారు
  • నేను గెలిస్తే అందోల్ ప్రజలు నా పక్షనే ఉన్నట్టు!
  • నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధికె నాకు బ్రహ్మరథం పడుతున్నారు
  • మద్యం డబ్బులతో గెలిచే వ్యక్తులు నాకు సరితూగరు

  • ఓటు హక్కు వినియోగించుకున్న సింగర్‌ సునీత, నిర్మాత అల్లు అరవింద్‌


చెన్నూర్‌లో కాంగ్రెస్‌ గో బ్యాక్‌ నినాదాలు

  • మంచిర్యాల చెన్నూర్‌ నియోజకవర్గంలో ఘర్షణ
  • ఏజెంట్‌ పాస్‌తో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లబోయిన గడ్డం వివేక్‌ తనయుడు
  • అడ్డుకుని కాంగ్రెస్‌ గో బ్యాక్‌ నినాదాలు చేసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు


కొడంగల్‌లో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

  • రేగడి మైలారంలో పోలింగ్‌ బూత్‌కి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి
  • నరేందర్‌ వెళ్లాక నినాదాలు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు
  • గొడవకు దిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
  • పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసుల రంగప్రవేశం

ఓటు వేయడానికి అవు ఎక్కి వచ్చిoడు..!

  • తెలంగాణ ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేయడానికి వినూత్నంగా వచ్చిన వ్యక్తి
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో
  • సదరు వ్యక్తి నిర్మల్‌ జిల్లా తానూరు మండలం మహలింగి గ్రామస్తుడిగా ప్రచారం
  • సొంతూరిలో ఓటు హక్కు ఉండడంతో.. ఆవుపై వచ్చినట్లు వైరల్‌

  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి భర్త మహేందర్ రెడ్డి కండువా వేసుకుని పోలింగ్ బూత్‌కి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అత్యంతరం
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట
  • మహేందర్ రెడ్డి కారుపై రాళ్లతో దాడి

ఎన్టీఆర్ జిల్లా:

  • తిరువూరులోని ఆంధ్రా - తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఏసిపి ఎం.రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు 
  • తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లో పోలింగ్‌ ఇలా.. 

  • నగరంలో మందకొడిగా సాగుతున్న పోలింగ్‌
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. 21 శాతం మాత్రమే 
  • కూకట్ పల్లి నియోజకవర్గంలో 22%
  • రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 23.5%
  • మేడ్చల్‌లో 28.25 % ఓటింగ్ 

  • సీఈవోకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఫిర్యాదు
  • ఓటర్లను ప్రలోభపెట్టేలా రేవంత్‌రెడ్డి మాట్లాడారంటూ కంప్లయింట్‌
     

మూడు గంటలుగా.. ఓటర్ల ఇబ్బంది

  • వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం తుంకిమెట్లలో మొరాయించిన ఈవీఎంలు
  • పోలింగ్ కేంద్రం 194లో ఈవీఎంలో మూడుసార్లు సాంకేతిక లోపం
  • నాలుగో ఈవీఎంను అందుబాటులోకి తీసుకొచ్చిన సిబ్బంది
  • పోలింగ్ కేంద్రం వద్ద మూడు గంటలుగా బారులు తీరిన ఓటర్లు 
  • పోలింగ్ నిలిచిపోవడంతో ఇబ్బందిపడుతున్న వృద్ధులు, వికలాంగులు

కేంద్ర ఎన్నికల కమిషన్ కి కిషన్ రెడ్డి ఫిర్యాదు

  • బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు 
  • కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫిర్యాదు
  • నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమిగూడుతున్నారు 
  • బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు 
  • జనగామలో జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా ఫిర్యాదులో పేర్కొన్న కిషన్ రెడ్డి 
  • చాలా నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌ నేతలకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నారు అంటూ ఆరోపణ 
  • అంబర్ పేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి తనయుడు డబ్బులు పంచిన ఆయనపై చర్యలు తీసుకోవడంలో విఫలం అంటూ కంప్లైంట్

  • తెలంగాణలో మధ్యాహ్నాం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు
  • అధికంగా మెదక్‌లో 51 శాతం.. అత్యల్ఫంగా హైదరాబాద్‌లో 20 శాతం పోలింగ్‌ నమోదు

వికారాబాద్‌: పోలింగ్‌ నిలిపివేత!

  • వికారాబాద్ జిల్లా తాండూర్ పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో పోలింగ్ నిలిపివేత
  •  బ్యాలెట్ బాక్స్ ను తిరగేసి పెట్టారని ఆరోపణలు
  •  ఓటు వేసిన గ్రామస్తులు నాయకులకు చెప్పడంతో పోలింగ్‌ను అడ్డుకున్న నాయకులు

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి

మళ్లీ ‘పల్లా’ రగడ

  • జనగామ శామీర్‌పేట పోలింగ్‌ కేంద్రం ఉద్రిక్తత
  • పార్టీ కండువా వేసుకుని బూత్‌లోకి ప్రవేశించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • పల్లాను అడ్డకున్న కాంగ్రెస్‌ నాయకులు
  • అదే సమయంలో ప్రతాప్‌రెడ్డి వెళ్లడం ఉద్రిక్తత
  • సర్దిచెప్పే ప్రయత్నంలో పోలీసులు

కొందరికే డబ్బులిస్తారా?

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఓటర్ల ఆందోళన
  • పట్టణంలో పలు వార్డులలో కొందరికే బీఆర్ఎస్ వాళ్లు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపణ
  • తమకు ఇవ్వాలంటూ  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కొందరు ఓటర్లు
  • సంగారెడ్డి జిల్లా కాల్హేర్ మండలం ఖానాపూర్ (కె) లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి

ఈవీఎంలు పని చేయట్లేదా?.. అయితే ఛలో..

  • కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మొరాయిస్తున్న ఈవీఎంలు 
  • ద్వారకానగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్ వద్ద గల‌ పోలింగ్ బూత్ నెంబర్ 63 లో గత రెండు గంటలుగా మొరాయిస్తున్న ఏవీఎం
  • పోలింగ్‌ బూత్ నుండి ఓట్లు వేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్న ఓటర్లు

పాతబస్తీలో ఉద్రిక్తత . . 

  • యాకుత్‌పురాలో ఎంబీటీ, ఎంఐఎం నేతల మధ్య గొడవ
  • ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఆరోపణలు
  • యాసిన్‌ అరఫత్‌, ఆంజాద్‌ అల్లాహ్‌ ఖాన్‌ లను అరెస్ట్‌ చేసిన పోలీసులు
  • పాతబస్తీలో ఉద్రిక్తత


పరిస్థితిపై డీజీపీ ఆరా

  • రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియపై డీజీపీ అంజనీ కుమార్ ఆరా 
  • జిల్లా ఎస్పీలతో పోలింగ్ పై వీడియో కాన్ఫరెన్స్
  •  సమస్యాత్మకమైన ప్రాంతాలపై నిఘా ఉండాలంటూ జిల్లా ఎస్పీలకు, కమిషనర్లకు డిజిపి ఆదేశం 
  • డీజీపీ కార్యాలయం నుండి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీజీపీ అంజనీకుమార్‌
  •  డీజీపీ కార్యాలయంలో రిజర్వ్ ఫోర్స్ 
  • ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు ఫోర్సును దింపిన అధికారులు

మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ఇలా.. 

  • పెద్దపల్లి జిల్లా మంథనిలో 51.4 %
  • సంగారెడ్డిలో 37.85%
  • సంగారెడ్డి నారాయణఖేడ్‌లో 45.43%
  • నిర్మల్ జిల్లా ముధోల్ నియోజవర్గంలో  43.70%
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 42.73 %
  • నల్లగొండ దేవరకొండ 33%
  • నాగార్జున సాగర్‌ 40%
  • మిర్యాలగూడ 39%
  • నల్గొండ 41%
  • మునుగోడు 42%
  • నకిరేకల్‌ 39%
  • సిద్దిపేట 44%
  • దుబ్బాక 48%
  • గజ్వేల్‌ 42%
  • మెదక్‌ 51 %
  • సూర్యాపేట 36%
  • ఆలేరు 47%
  • తుంగతుర్తి 52%
  • కోదాడ 38%
  • ముథోల్‌ 43%
  • బోథ్‌ 48 %
  • పటాన్‌చెరు 44 %
  • ఖానాపూర్‌ 43 %
  • మానకొండూరు 44 %
  • సిరిసిల్ల 42 %
  • వేములవాడ 35 %
  • కొరుట్ల 44 %
  • జగిత్యాల 46
  • ధర్మపురి 45 %
  • ఆసిఫాబాద్‌ 40 %
  • సంగారెడ్డి 42 %
  • బెల్లంపల్లి 46 %
  • గద్వాల 49 శాతం
  • హైదరాబాద్‌లో 21 శాతం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో.. 39.66%

  • ఆర్మూర్ - 35.60%
  • బోధన్ - 36.41%
  • బాన్సు వాడ -53.20%
  • నిజామాబాద్ అర్బన్ - 33.41%
  • నిజామాబాద్ రూరల్ - 43.38%
  • బాల్కొండ - 38.90%
  • కామారెడ్డి జిల్లా 41.15%
  • కామారెడ్డి - 34.62%
  • ఎల్లారెడ్డి -45.61%
  • జుక్కల్ - 43.24%

  • ఓటు హక్కు వినియోగించుకున్న జగపతి బాబు

ఓట్ల కోసం.. రహదారులపైనా క్యూ

  • హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు పోటెత్తుతున్న ఓటర్లు
  • హైదరాబాద్‌ - నల్గొండ, హైదరాబాద్‌ - వరంగల్‌.. రెండు హైవేల్లో కిక్కిరిసిపోయిన ట్రాఫిక్‌
  • హైదరాబాద్‌-కరీంనగర్‌ను కలిపే రాజీవ్‌ రహదారిపై నెమ్మదిగా నడుస్తోన్న వాహనాలు
  • నేషనల్‌ హైవే 7, హైదరాబాద్‌ - అదిలాబాద్‌ రూట్‌లో కూడా వీపరీతంగా వాహనాలు

కవిత వ్యాఖ్యల పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు: తెలంగాణ సీఈవో 

  • తెలంగాణ ఎన్నికల సరళిపై మీడియాతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది.
  • ఈవీఎం సమస్యలు వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము
  • రూరల్ లో పోలింగ్ శాతం బాగానే ఉంది
  • అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి
  • అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి
  • జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈవోలను రిపోర్ట్ అడిగాం
  • కవిత, రేవంత్ వ్యాఖ్యల కంప్లైంట్స్ వచ్చాయి
  • డీఈవో రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు
  • 11గంటల వరకు 20.64శాతం నమోదు అయింది
  • ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల పై కంప్లయింట్ వచ్చింది
  • కవిత వ్యాఖ్యల పై డీఈవోకు ఆదేశాలిచ్చా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది

  • హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చలర్ సెంటర్ లో ఓటు వేసిన మంచు మనోజ్, విశ్వక్ సేన్
  • ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల 

ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

  • ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం 
  • సాయంత్రం 5.30గం. కే ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ఈసీ

  • మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క 
  • సుందరయ్య నగరంలో మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటేసిన మల్లు భట్టి 
  • రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది
  •  కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం
  •  ప్రజల సంపదను ప్రజలకే పంచుతాం

ఎట్లయినా ఓటేయాలె!

సికింద్రాబాద్ నుండి నారాయణఖేడ్ ఓట్ల కోసం బస్ టాప్ పై ఇలా ప్రయాణికులు

  • ఓటేసేందుకు ఓటర్ల అగచాట్లు
  • ఎలాగైనా ఓటేయాలనే తాపత్రయం
  • బస్సు టాప్‌లపైనా ప్రయాణిస్తున్న దృశ్యాలు
  • ఏర్పాట్లలో టీఎస్‌ ఆర్టీసీ విఫలం?


 

ఓటింగ్‌ ఇప్పటి నుంచి పెరగొచ్చు: వికాస్‌రాజ్‌

  • తెలంగాణ ఓటింగ్‌ శైలిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్‌రాజ్‌ స్పందన
  • రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల దాకా 20 శాతం పైగా ఓటింగ్‌ నమోదు అయ్యింది
  • ఇప్పటి నుంచి ఓటింగ్‌ శాతం పెరుగుతుందని భావిస్తున్నాం
  • అర్బన్‌ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంది
  • యాప్‌ ద్వారా పోలింగ్‌ బూత్‌ తెలుసుకోవచ్చని.. ఓటర్లు తరలి రావాలని సీఈవో పిలుపు

చింతమడకలో ఆసక్తికరంగా.. 

  • భారీగా క్యూ లైన్‌లో ఓటర్లు
  • ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రానికి రాని ఓటర్లు
  • కేసీఆర్‌ వచ్చే టైంలోనే ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన వైనం
     

  • సిద్దిపేట జిల్లా చింతమడక ఓటు వేసిన కేసీఆర్‌ దంపతులు

  • హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి రాంనగర్ దేవి హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు

  • కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

మణికొండలో ఇరు పార్టీల మద్య ఘర్షణ!

  • పోలీంగ్‌బూత్‌ సమీపంలో డబ్బులు పంచుతున్నారంటూ గొడవకు దిగిన నేతలు
  • నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట.. దుర్భాషలాడుతూ గొడవ.. టేబుళ్లు, కుర్చీలు ధ్వంసం

హ్యాట్సాఫ్‌ శేషయ్య

  • లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న శేషయ్య(75) 
  • ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కి 
  • గచ్చిబౌలి, GPRA క్వార్టర్స్ పోలింగ్ స్టేషన్ వద్ద దృశ్యం
  • ఓటు మన కర్తవ్యం: శేషయ్య
  • 1966 నుంచి తప్పకుండా ఓటు వేస్తున్నా: శేషయ్య
  • ప్రాణం ఉన్నంతదాకా ఓటు వేస్తూనే ఉంటా: శేషయ్య

ఓ అన్నా.. ఓ అక్కా.. ఓటు వేయండే

  • ఓటు హక్కును గుర్తు చేస్తున్న కొందరు
  • ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల్లో క్యూ కట్టి ఓట్లేస్తున్న వృద్ధులు
  • దివ్యాంగ ఓటర్లు సైతం ఓటు వేసేందుకు తరలి వస్తున్న వైనం
  • ఓటేయాలంటూ.. తోటి ఓటర్లకు సందేశం 
     

ఇది మంచిది కాదు: అక్కినేని నాగార్జున

  • హైదరాబాద్‌లో పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టని ఓటర్లు
  • కదలిరావాలని రాజకీయ నేతలు, ప్రముఖుల పిలుపు
  • ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్న సినీ నటుడు అక్కినేని నాగార్జున 
  • కుటుంబంతో సహా ఓటు హక్కు వినియోగించిన నాగార్జున
  • పట్టణ ఓటర్లు.. ముఖ్యంగా యువత తరలి రావాలని పిలుపు

హైదరాబాద్‌లో తక్కువ.. తక్కువే 

  • హైదరాబాద్‌ జిల్లాలో ఉదయం 11గం. వరకు 12.39 శాతం పోలింగ్‌
  • నాంపల్లిలో అత్యల్పంగా 5 శాతం 
  • ముషీరాబాద్‌, ఎల్బీనగర్‌లో 10 శాతం
  • చార్మినార్‌లో 10 శాతం పోలింగ్‌
     

ఓటు కోసం బయల్దేరిన కేసీఆర్‌

  • చింతమడక బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌
  • బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చింతమడకకు

రేవంత్‌రెడ్డి సోదరుడిపై ఫిర్యాదు?

  • రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు?
  • కామారెడ్డిలో ప్రచారంలో తిరుగుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపణ
     

ఓటర్లకు బ్రహ్మీ మార్క్‌ పిలుపు

  • ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్‌ నటుడు బ్రహ్మానందం
  • పోలింగ్‌ కేంద్రం బయట నవ్వులు పూయించిన బ్రహ్మీ
  • ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వెరైటీ పిలుపు
  • ఓటు హక్కు వినియోగించుకోని వాళ్లను ఏమంటారని ప్రశ్నించిన మీడియా
  • ఓటు హక్కు వినియోగించుకోనివాళ్లు అంటారంటూ బ్రహ్మీ బదులు
  • బాధ్యతగా ఓటేసి కావాల్సిన వాళ్లను గెలిపించుకోవాలంటూ ఓటర్లకు పిలుపు

పోలీసుల ముందే తన్నుకున్నారు

  • వికారాబాద్‌ చౌడపూర్‌లో ఉద్రిక్తత
  • బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ
  • పోలీసుల ముందే తన్నుకున్న కార్యకర్తలు
  • చెదరగొట్టిన పోలీసులు

  • ఓటేసిన విజయశాంతి, వైఎస్‌ షర్మిల,  బండ్ల గణేష్‌, సుధీర్‌బాబు, దర్శకుడు సుకుమార్‌ తదితర సెలబ్రిటీలు

  • ఓటు వేసిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌
  • కమలాపూర్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్ లో ఓటుహక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్, జమున దంపతులు

  • ముషీరాబాద్‌ చిక్కడపల్లిలో ఓటు వేసిన బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌


ఉదయం 11 గంటల దాకా పోలింగ్‌ ఇలా..

తెలంగాణ వ్యాప్తంగా 11గం. దాకా మొత్తంగా 20.64 శాతం పోలింగ్‌ నమోదు.. ఓటర్లలో 65 లక్షల మంది ఓటు వినియోగం

  • అత్యధికంగా 30.65 శాతం
  • అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం
  • కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజక వర్గంలో 26.74 శాతం
  • ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21%
  • మంథని 31.6 %
  • ధర్మపురిలో 21.3 శాతం
  • హుజురాబాద్‌లో 18 శాతం 
  • నారాయణపేట మక్తల్‌లో 14.5 శాతం
  • సూర్యాపేట 23 శాతం
  • ఆలేరు 25 శాతం
  • సిద్దిపేట 30 శాతం
  • దుబ్బాక 29 శాతం
  • హుస్నాబాద్‌ 27
  • గజ్వేల్‌ 25 శాతం
  • నర్సాపూర్‌ 30 శాతం
  • జహీరాబాద్‌ 23 శాతం
  • నారాయణఖేడ్‌ 26 శాతం
  • రామగుండం 17 శాతం
  • పెద్దపల్లి 21 శాతం
  • భువనగిరి 23 శాతం
  • సిరిసిల్ల 23 శాతం
  • వేములవాడ 21 శాతం
  • మెదక్‌ 30 శాతం
  • నర్సాపూర్‌ 30 శాతం
  • కొరుట్ల 23 శాతం
  • జగిత్యాల 23.15 శాతం
  • ధర్మపురి 21 శాతం
  • కంటోన్మెంట్‌ 16 శాతం

  • నల్గొండ పట్టణ కేంద్రంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎస్పీ అపూర్వ రావు

ఘర్షణలను ఉపేక్షించొద్దు.. సీఈవో ఆదేశం

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు
  • జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరు, ఇబ్రహీంపట్నం.. మరికొన్ని చోట్ల ఘటనలు
  • ఆయా ప్రాంతాల ఘటనల పై సీఈఓ వికాస్ రాజ్ ఆరా
  • ఘర్షణలు అదుపు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు, పోలీస్ అధికారులకు సీఈఓ ఆదేశం

పటాన్‌చెరు పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం

  • సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం (248) పోలింగ్ బూత్ వద్ద విషాదం 
  • ఎన్నికల విధుల్లో ఉన్న సుధాకర్ అనే వ్యక్తికి గుండెపోటుతో మృతి
  • గతరాత్రి గుండెపోటు రాగా.. సీపీఆర్ చేసిన తోటి సిబ్బంది 
  • మృతిచెందిన సుధాకర్
  • సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో వెటర్నరీ విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్న సుధాకర్
  • ఈ ఉదయం బంధువుల్ని సుధాకర్ మృతదేహాన్ని వారికి అప్పజెప్పిన ఎన్నికల అధికారులు అధికారులు

కామారెడ్డిలో ఉద్రిక్తత

  • కామారెడ్డి పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
  • బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట.. వాగ్వాదం
  • సముదాయించిన పోలీసులు

  • కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లైన్‌లో నిల్చుకున్న అక్కినేని నాగార్జున

  • కోదాడలో ఓటు వేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి
     

డబ్బిస్తేనే ఓటేస్తాం!

  • మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం ఓటర్ల మొండిపట్టు
  • బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలో పరిస్థితి 
  • సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్ల డిమాండ్‌
  • డబ్బులు ఇస్తానే ఓటు వేస్తాం అంటూ తేల్చిసిన ఓటర్లు
  • ఓటుకు రావాలంటూ బతిమాలుతున్న ఆధికారులు

  • కరీంనగర్ జిల్లా.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఓటు వేసిన  జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి

కదిలిన యువతరం

  • తెలంగాణలో తొలిసారిగా దాదాపు 10 లక్షల కొత్త.. యువ ఓటర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా  ఓటు హక్కును వినియోగించుకుంటున్న వైనం
  • ఉదయాన్నే ఓటింగ్‌ కేంద్రాలకు క్యూ కడుతున్న దృశ్యాలు

ఓటేసిన హరీష్‌రావు

  • సిద్దిపేట అంబిటస్ స్కూల్ 114  పోలింగ్ స్టేషన్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు ను వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ ఓట్ జరుగుతుంది
  • గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది
  • పట్టణంలో మంద కోడిగా జరుగుతుంది అందరూ ఓటు హక్కను వినియోగించుకివాలి.
  • ఎవరి చేతిలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందో చూసి వేయాలి..
  • విద్యావంతులు, ప్రజలు అందరూ వేయాలి.
  • నాగార్జున సాగర్‌ వివాదంపై పోలింగ్‌ ముగిశాకే మాట్లాడతానన్న హరీష్‌రావు

పోలింగ్‌ ఎఫెక్ట్‌.. భారీగా ట్రాఫిక్‌ జాం

  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జాం
  • విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
  • హయత్ నగర్ నుంచి అబ్లుల్లాపూర్ , కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ జాం
  • ఓటేసేందుకు తరలిపోతున్న పౌరులు
  • నల్లగొండ, సూర్యాపేట,  ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల వైపు ఓటర్‌ ప్రవాహం
  • భారీ గా ఔటర్ వైపు చేరుకుంటున్న వాహనాలు

ఓటేయండి.. సెల్ఫీ పంపండి.. 

  • తెలంగాణ ఓటర్లకు సాక్షి డాట్‌ కామ్‌ విజ‍్క్షప్తి
  • ఓటేసి.. ఇంక్‌ మార్క్‌ వేలితో సెల్ఫీ దిగి 9182729310 నెంబర్‌కు వాట్సాప్‌ చేయండి
  • మీ ఫొటోను వెబ్‌సైట్‌ గ్యాలరీలో ప్రచురిస్తాం
     

ఓటేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌

  • నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శక్కర్ నగర్ లో బూత్ నెం. 89 లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్

ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్‌

  •  ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌
  • సెవెంత్ పేస్ బాస్కెట్బాల్ గ్రౌండ్ లోని పోలింగ్ బూత్ 342కు కుటుంబ సమేతంగా రాక

జగిత్యాలలో స్వల్ప ఉద్రిక్తత

  • జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి లో బీఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వివాదం

  • బీజేపీ కొరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ వెంట ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చారని బీఆర్‌ఎస్‌ ఆరోపణ

ఓటేసిన బండి సంజయ్‌

  • కరీంనగర్ సాధన స్కూల్ పోలింగ్ సెంటర్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న బండి సంజయ్.
  • అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • ప్రజాస్వామ్యయుతంగా గెలవాలి గానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు
  • టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది..?
  • తెలంగాణా, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చి కేసీఆర్ అండ్ టీమ్ రెచ్చగొట్టే యత్నం చేస్తోంది
  • నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకొచ్చింది?
  • తెరవెనుక ఎవరున్నారు..?
  • కేసీఆర్ వి ఫాల్స్ రాజకీయాలు.

  • ములుగులో సొంతూరు జగన్నపేటలో ఓటేసిన సీతక్క(అనసూయ)

ఓటేసిన రాజమౌళి

  • ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు.
  • షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలిసి ఓటు హక్కు వినియోగం

ఓటర్లు లేక వెలవెలబోతున్న వరిపేట

  • తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామ ఓటర్లు 
  • పోలింగ్‌కు దూరంగా గ్రామ ప్రజలు
  • ఉదయం 9.30గంటల వరకూ కేవలం 12 ఓట్లు 

కవితపై కాంగ్రెస్‌ ఫిర్యాదు

  • హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉదయమే ఓటేసిన కల్వకుంట్ల కవిత
  • బీఆర్‌ఎస్‌ ఓటేయాలని చెప్పారంటూ ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
  • దర్యాప్తునకు ఆదేశించిన ఈసీ
  • స్పందించిన కేటీఆర్‌
  • కవిత ఏం మాట్లాడిందో.. కాంగ్రెస్‌ ఏం ఫిర్యాదు చేసిందో తెలియదన్న కేటీఆర్‌

జోగులాంబ గద్వాల జిల్లా ఎం. ఎ.ఎల్. డి ప్రభుత్వ జూనియర్ కాలేజి ఓటేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే.అరుణ

పాలేరులో తీవ్ర ఉద్రిక్తత

  • ఖమ్మం కూసుమంచిలో ఉద్రిక్తత
  • పాలేరు నాయకన్‌గూడెం ఘర్షణ 
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
     

ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్‌రెడ్డి

  • కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్‌రెడ్డి
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని పిలుపు
  • నాగార్జున సాగర్‌ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలని రేవంత్‌ విజ్ఞప్తి
  • ఈ వివాదం ఎవరు.. ఎందుకు సృష్టించారో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ వ్యాఖ్య
     

రాహుల్‌ గాంధీ సందేశం

  • తెలంగాణ ఓటర్లకు రాహుల్‌ గాంధీ సందేశం
  • నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి..
  • అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి.
  • బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి


ఓటేసిన కేటీఆర్‌

  • బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్‌
  • తెలంగాణ పౌరుడిగా నా బాధ్యతను నెరవేర్చా
  • రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశా
  • ఓటర్లు తరలిరావాలని పిలుపు

ఓటు హక్కు వినియోగించుకున్న కోదండరాం

  • ఓటేసిన ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం ఇలా.. 

  • తొలి రెండుగంటల్లో నగరంలో 4.57 శాతం పోలింగ్‌
  • అత్యల్పంగా నాంపల్లిలో.. 0.5 శాతం
  • రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 15 శాతం
  • సనత్‌ నగర్‌ 1.2, కూకట్‌ పల్లిలో 1.9శాతం
  • మేడ్చల్‌ 2, గోషామహల్‌లో 2, చార్మినార్‌ 3, ముషీరాబాద్‌ 4 శాతం
  • ఎప్పటిలాగే తక్కువ నమోదు అవుతుందా? అనే సందేహాలు



 

  • ఫిల్మ్‌ నగర్‌ క్లబ్‌లో ఓటేసిన సినీ నటుడు నితిన్‌

జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

  • జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
  • బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ 
  • టిఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు
  • పరస్పరం ఒకరిపై ఒకరు దాడి
  • లాటీలు ఝుళిపించి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

  • కరీంనగర్‌లో..  ప్రస్తుతం ఓటింగ్ శాతం 12.2 పూర్తి

9 గంటలకు పోలింగ్‌ శాతం ఇలా.. 

  • తెలంగాణలో మొత్తంగా 8.52 శాతం పోలింగ్‌ నమోదు
  • ఆదిలాబాద్ లో  8శాతం    
  • బోథ్ 10 శాతం
  • సంగారెడ్డి జిల్లా  పటాన్‌చెరు నియోజకవర్గంలో 6.23 %
  • మెదక్‌లో 9.9 %
  • నారాయణ ఖేడ్‌లో 10.35%
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 6% 
  • నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో 14.29% పోలింగ్
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 12.67%
  • హుజురాబాద్‌లో 5.63%
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజక వర్గానికి సంబందించి 9 గంటల వరకు 10.65 శాతం పోలింగ్ నమోదు..
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో ఉదయం 9గంటలకు 7.43%శాతం ఓటు నమోదు
  • నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 14.29% పోలింగ్ నమోదు
  • నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఉదయం 9గంటలకు 7.2%శాతం ఓటు నమోదు.
  • సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 11.34 శాతం పోలింగ్ నమోదు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 9.8 శాతం పోలింగ్ నమోదు
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఇప్పటివరకు12.45 శాతం పోలింగ్ నమోదు.
  • నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 9 గంటలవరకు పోల్ శాతం 9.80%.
  • సిద్దిపేట జిల్లా సిద్దిపేట - 11.50%,  దుబ్బాక - 10.06%
  • నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు పోలైన ఓటింగ్ శాతం11.1

  • ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

  • శేరిలింగంపల్లి కొండాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

పలుచోట్ల ఘర్షణ వాతావరణం

  • జనగామలో రైల్వే స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత
  • కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో టెన్షన్‌
  • కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ కార్యకర్తల బాహాబాహీ
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • మహబూబ్ నగర్ పద్మావతీ కాలనీలోని 100వ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో ఓటేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

వికారాబాద్‌లో నగదు కలకలం..

  • తాండూర్‌ మండలం కరన్‌కట్‌లో నగదు కలకలం.
  • కోటవీధిలోని పోలింగ్‌ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ. 
  • పోలీసుల రాకతో డబ్బును వదిలేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు. 
  • రూ. 7.45లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. 

సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌

  • సూర్యాపేటలోని మఠంపల్లిలో ఉద్రిక్తత.
  • ఓటేసేందుకు వెళ్లిన వ్యక్తిని చితకబాదిన బీఆర్‌ఎస్‌ నాయకులు
  • కాంగ్రెస్‌ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులు.

ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత..

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.
  • ఖానాపూర్‌ మున్సిపాలిటీ దగ్గర కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య గొడవ. 
  • లాఠీఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు 

అధికారులపై ఓటర్ల అసహనం..

  • ప్రశాంతంగా జరుగుతున్న తెలంగాణ పోలింగ్‌
  • పలు చోట్ల ఈవీఎం మొరాయింపులు.. 
  • కొన్నిచోట్ల ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్‌
  • అధికారులపై ఓటర్ల అసహనం

ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌

  • ఖమ్మంలో ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్‌ నమోదు.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరున ఓటర్లు
  • పలుచోట్ల ఉద్రిక్తత

నాగార్జునసాగర్ అంశంపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

  • నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలపై స్పందించిన రేవంత్‌
  • నాగార్జున సాగర్‌ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలి. 
  • కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు. 
  • ఎవరు, ఎందుకు, ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. 
  • సాగర్‌ డ్యామ్‌ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు. 
  • ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. 
  • ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపవు. 

ఓటేసిన బర్రెలక్క

  • ఓటు హక్కు వినియోగించుకున్న కర్నె శిరీషా అలియాస్‌  బర్రెలక్క
  • నాగర్‌కర్నూల్‌ కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో

ఇంకా ప్రారంభంకాని పోలింగ్‌

  • సుల్తాన్‌బాద్‌ప్రభుత్వ పాఠశాల బూత్‌నెంబర్‌ 204లో ఇంకా ప్రారంభంకాని పోలింగ్‌
  • బారులు తీరిన ఓటర్లు
  • జగిత్యాల, పెద్దపల్లిలో ఆలస్యంగా పోలింగ్‌
  • ఇంకా చాలాచోట్ల ఈవీఎంల సమస్యలు.. పరిష్కరిస్తున్న అధికారులు
  • కొన్నిచోట్ల ఈవీఎంల మార్పులు

నేతలెవరూ నిబంధనలు అతిక్రమించొద్దు: సీఈవో వికాస్‌రాజ్‌

  • తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్‌ జరుగుతోంది
  • ఓటర్లే కాదు.. నేతలెవరూ నిబంధనలు అతిక్రమించొద్దు
  • తొందరపడి వ్యాఖ్యలు చేయ్దొదు
  • ఈసారి ఓటింగ్‌ కచ్చితంగా పెరుగుతుంది
  • యువత ఓటేసేందుకు తరలి రావాలి
  • ఈవీఎంల సమస్యలు తలెత్తిన చోట యంత్రాంగం పరిష్కారం చేస్తోంది 

సారీ సార్‌.. ఓటేయం

  • ఖమ్మం సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామస్తుల పోలింగ్‌ బహిష్కరణ
  • అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని నిరసనగా ఓటేయమని మొండిపట్టు 
  • ఓటేయాలని బతిమాలుతున్న అధికారులు.. వెనక్కి తగ్గమన్న గ్రామస్తులు


ఓటేసిన రాజకీయ ప్రముఖులు

  • ఎల్బీనగర్‌లో సుధీర్‌రెడ్డి
  • మంథని దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు
  • వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • హనుమకొండ టీచర్స్ కాలనీ కమిటీ హాల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి

ఓటేసిన ప్రముఖులు

  • మణికొండలో ఓటేసిన హీరో వెంకటేష్‌
  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి

  • జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సభ్యులు
  • తల్లి, భార్యతో వెళ్లి ఓటేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌

పలు చోట్ల ప్రారంభం కాని ఓటింగ్‌.. బారులు తీరిన ఓటర్లు

  • కోదాడలో వరుసగా మొరాయిస్తున్న ఈవీఎంలు
  • పలుచోట్ల ఇంకా ప్రారంభంకాని ఓటింగ్‌
  • చిలుకూరు, మునగాలలో ఓటర్ల ఇక్కట్లు
  • సనత్‌నగర్‌లో నేతాజీనగర్‌లో ఈవీఎంల మొరాయింపు
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో, రామగుండంలో ఈవీఎంల మొరాయింపు 
  • శంషాబాద్‌ మండలం తుఫ్రాన్‌లో ఈవీఎంల మొరాయింపు
     

ఓటేసిన జగదీశ్‌రెడ్డి

  • సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో బూతు నెంబర్ 95 లో ఓటు వేసిన సూర్యాపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి, కుటుంబ సభ్యులు

  • జగిత్యాల కొరుట్లలో మొరాయించిన ఈవీఎంలు
  • ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌

తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోదీ సందేశం

  • తెలంగాణ పోలింగ్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ సందేశం
  • రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపు
  • యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని

ఓటేసి మంచి నాయకత్వం ఎన్నుకోండి: డీజీపీ అంజనీ కుమార్‌

  • తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్న డీజీపీ అంజనీ కుమార్
  • సతీసమేతంగా ఓటు హక్కు వినియోగం
  • ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామఇనవెల్లడి 
  • ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని ఓటర్లకు పిలుపు


మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీరుపై అభ్యంతరం

  • నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లిలో ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • పార్టీ కండువాలో పోలింగ్‌బూత్‌లోకి
  • బయటకు వచ్చాక ఫొటోలకు ఫోజు
  • ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఇలా వెళ్లడం నిషేధం
  • ఫిర్యాదుకు సిద్ధమైన కాంగ్రెస్‌?

  • ఎర్రమంజిల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ అజారుద్దీన్‌

ఓటర్లకు అలర్ట్‌

  • పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు
  • సెల్‌ఫోన్లతో పాటు ఇతర గాడ్జెట్లకు కూడా నో పర్మిషన్‌
  • సెల్‌ఫోన్లతో పలువురి పోలింగ్‌ సెంటర్లకు.. ఇబ్బందులు పడుతున్న వైనం
  • దయచేసి సెల్‌ఫోన్లు పోలింగ్‌ కేంద్రాల్లోకి తీసుకెళ్లొద్దని ఈసీ విజ్ఞప్తి
  • ఓటేసే సమయంలోనూ సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు తీయడం నిషేధం
  • ఈసీ మార్గదర్శకాలకు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు
  • ఓటు హక్కు రద్దుతో పాటు జైలుకు పంపే అవకాశం


తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న ఈవీఎంల మొరాయింపు

మొరాయిస్తున్న ఈవీఎంలను సరి చేస్తున్న అధికారులు
ఈవీఎంల మొరాయింపులపై మానిటరింగ్‌ చేస్తున్న జాయింట్‌ సీఈవో
టెక్నికల్‌ టీంల ఏర్పాటుతో పర్యవేక్షణ
తెలంగాణ వ్యాప్తంగా 400 మంది టెక్నికల్‌ టీం


క్యూ కడుతున్న ఓటర్లు

  • ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
  • సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా క్యూలో నిల్చుని ఓటింగ్‌కు.. 
  • ఈవీఎంల మొరాయింపుతో క్యూ లైన్‌లో 

తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న ఈవీఎంల మొరాయింపు

  • మొరాయిస్తున్న ఈవీఎంలను సరి చేస్తున్న అధికారులు
  • ఈవీఎంల మొరాయింపులపై మానిటరింగ్‌ చేస్తున్న జాయింట్‌ సీఈవో
  • టెక్నికల్‌ టీంల ఏర్పాటుతో పర్యవేక్షణ
  • తెలంగాణ వ్యాప్తంగా 400 మంది టెక్నికల్‌ టీం

  • ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
  • సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా క్యూలో నిల్చుని ఓటింగ్‌కు.. 

  • సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
  • ఓటు బాధ్యతను పూర్తి చేయాలంటూ ఓటర్లకు పిలుపు

  • ఈవీఎం సమస్యలతో.. ఓటర్ల ఇబ్బందులు 
  • జూబ్లీహిల్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌లో ఎట్టకేలకు ఓటేసిన అల్లు అర్జున్‌

  • హుస్నాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పొన్నం ప్రబాకర్‌
  • ఓటేసే ముందు గ్యాస్‌ బండకు పూజలు
  • వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

  • బోయినపల్లిలో ఓటేసిన మంత్రి మల్లారెడ్డి

పలుచోట్ల ప్రారంభం కానీ పోలింగ్
సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో ఆలస్యం
పోలింగ్ బూత్ లో చీకటి ఇబ్బందులు పడుతున్న ఓటర్లు

  • కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌

  • మెదక్‌ జిల్లా ఎల్లాపురంలో ఇంకా ప్రారంభంకాని ఓటింగ్‌

ఓటేసిన కిషన్‌రెడ్డి

  • అంబర్‌పేట బర్కత్‌పురలో  ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  • ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని పిలుపు 
  • ఓటు హక్కు విలువైంది.. పవిత్రమైంది
     

పలు చోట్ల ప్రారంభంకాని పోలింగ్‌

  • హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు చోట్ల ప్రారంభంకాని పోలింగ్‌
  • ఈవీఎంల మొరాయింపుతో పాటు ఇతరత్రా సమస్యలు
  • సమస్యలు పరిష్కరిస్తున్న సిబ్బంది
  • ఈవీఎం సమస్యతో.. సామాన్య ఓటర్ల ఇబ్బంది 
  • సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా
  • జూబ్లీహిల్స్‌లో లైన్‌లోనే ఇంకా సినీ నటుడు అల్లు అర్జున్‌ 

ఈయన ఓటేశారు.. మరి మీరో

  • 92 సంవత్సరాల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించడం యువత ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పిన వృద్ధుడు
  • పవిత్రమైన ఓటును పవిత్రంగా వినియోగించుకోవాలని పిలుపు

  • ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

తరలిన తెలంగాణ ఓటర్లు

  • ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్న ఓటర్లు
  • ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ ఎత్తున్న క్యూ కడుతున్న వైనం
  • ఈసారి ఎక్కువ ఓటింగ్‌ నమోదు అవుతుందని ఈసీ ఆశాభావం

  • ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌

  • కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న శేర్లింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ

  • హనుమకొండ జిల్లా పరకాల పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

  • ఓబుల్ రెడ్డి స్కూల్ లో తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యులు
  • నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లిలో ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • కరీంనగర్ లోని ముఖరంపూర్ ఉర్దూ మీడియం స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ బి. వినోద్‌ 

పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు

  • రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
  • సరి చేస్తున్న అధికారులు.. పోలింగ్‌ ప్రక్రియకు విఘాతం
  • నల్గొండ జిల్లా  నాగార్జునసాగర్ 103 పోలింగ్ బూత్ వద్ద మొరాయిస్తున్న ఈవీఎం ఇంకా మొదలవని పోలింగ్
  • హైదరాబాద్‌లోనూ పలు చోట్ల పని చేయని ఈవీఎంలు.. సరిచేస్తున్న అధికారులు
  • పలుచోట్ల కొత్త ఈవీఎంల ఏర్పాటు
  • యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలంలోని నిదానపల్లి  గ్రామంలో బూతు నెంబర్ 20లో మొరాయించిన ఈవీఎం. 30 నిమిషాలు ఆలస్యంగా మొదలైన ఓటింగ్.
  • జోగులాంబ గద్వాల జిల్లా ఎం. ఏ.ఎల్. డి డిగ్రీ కాలేజీ లోని పోలింగ్ కేంద్రం లో మోరాయించిన ఈ.వి.ఎం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సిబ్బంది

  • సిరిసిల్ల ప్రజా పరిషత్‌ పాఠశాలలో మొరాయిస్తున్న ఈవీఎంలు

  • ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

  • బంజారాహిల్స్‌లో ఓటేసిన ఎమ్మెల్సీ కవిత
  • పట్టణాల ఓటర్లు తరలిరావాలని పిలుపు ఇచ్చిన కవిత
  • దేశ ప్రగతికి యువత ఓటు అవసరమని వ్యాఖ్య
  • బంజారాహిల్స్ లో నా ఓటు హక్కు వినియోగించుకున్నను
  • మహిళలు ఈ ఎన్నికలలో ఎక్కువ శాతం ప్రభావం చూపుతారు
  • యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  •  ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీ కే పోతారు.
  •  ఇక్కడ గెలిచేది మేమే
  • కేసీఆర్‌ అభివృద్ధి చూడండి అంటూ ఓటర్లకు పిలుపు

  • జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు అల్లు అర్జున్‌

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

  • ఓటు హక్కు వినియోగించుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రాస్‌
  • ఓటు హక్కు ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలి
     
  • ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ 250 వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్

  • హైదరాబాద్‌లో ఓటేసిన నటుడు సుమంత్‌

పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు

  • జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్‌
  • పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు
  • సరిచేసి పోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు
  • పలుచోట్ల రకరకాల కారణాలతోనూ పోలింగ్‌ ఐదారు నిమిషాలు ఆలస్యం

నిజామాబాద్‌లో పవర్‌ సప్లై లేక పోలింగ్‌ కాస్త ఆలస్యం

  • జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం
  • నిజామాబాద్ లో ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రంలో పవర్ సప్లై లేక కాస్త ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.
  • పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు

  • కూకట్ పల్లి బూత్ నంబర్ 12లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు

ప్రారంభమైన తెలంగాణ ఎన్నికల పోలింగ్‌

  • తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
  • సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • 13 నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో 4గంటల వరకే
  • రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు
  • ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు

మరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

  • 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటేయనున్న 3.26 కోట్ల ఓటర్లు
  • ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు  
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

అత్యధిక ఓటర్లు ఇక్కడే..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు 
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638 పోలింగ్‌ కేంద్రాలు
అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో 1,48,713 మంది ఓటర్లు
 అతితక్కువగా భద్రాచలంలో 176 పోలింగ్‌ సెంటర్లు

ప్రధాన పార్టీల అభ్యర్థులు

  • రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ
  • బీఆర్‌ఎస్‌ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌
  • 119లో 118లో కాంగ్రెస్‌.. పొత్తులో ఒక చోట సీపీఐ
  • 119లో 111 చోట్ల బీజేపీ.. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన
  • 119లో 19 నియోజకవర్గాల్లో సీపీఎం
  • 119లో 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ
  • రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్సీలు సహా బరిలో.. 
  • ఎల్బీనగర్‌లో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీలో..  
  • అతి తక్కువగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ
  • పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌, 54 స్థానాల్లో రెండు, పది నియోజకవర్గాల్లో మూడు చొప్పున వినియోగం.

హైదరాబాద్‌ కోసం పోల్‌ క్యూ రూట్‌..

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హైదరాబాద్‌ ఓటర్లకు ప్రత్యేక పోర్టల్‌
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూ లైన్‌ వివరాలు తెలుసుకునేందుకు ‘పోల్‌ క్యూ రూట్‌’
  • ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్‌
  • జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌/యాప్‌ ద్వారా ఈ పోర్టల్‌ సేవలు 
  • జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లేదంటే యాప్‌ ఓపెన్‌ చేసి అందులో పోల్‌ క్యూ లైన్‌ పోర్టల్‌ సెలెక్ట్ చేయాలి
  • తర్వాత నియోకవర్గం, పోలింగ్ స్టేషన్‌ను వివరాలను నమోదు చేసి సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
  • అప్పుడు.. లైన్‌లో వేచి ఉండాల్సిన సమయాన్ని చూపిస్తుంది.
  • ఈ వివరాలను సంబంధిత అధికారి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు 
  • హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్లకు మాత్రమే ఈ పోర్టల్‌ సేవలు అందుబాటులో 

గట్టి భద్రత నడుమ..

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బంది
  • పోలింగ్‌ నిర్వహణకు సుమారు 75 వేల మంది పోలీసు బలగాలు 
  • రాష్ట్రంలోని 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15 వేల మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల మోహరింపు 
  • తీవ్రవాద ప్రభావితమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,311 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఈసీ గుర్తింపు.. ప్రత్యేక బందోబస్తు
  • సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు సమస్యాత్మక సెగ్మెంట్లుగా గుర్తింపు
  • సమస్యాత్మక ప్రాంతాల్లో.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ 
  • రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకుగాను 27,051 చోట్ల ఓటింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా.. 
  • ఒకటికి మించి పోలింగ్‌ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు
  • పర్యవేక్షణకు 3,800 మంది సెక్టార్‌ ఆఫీసర్లను, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకుల నియామకం

మహిళా ఓటర్లే ఎక్కువ

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థులు 
  • భవితవ్యాన్ని తేల్చనున్న 3.26 కోట్ల మంది ఓటర్లు
  • రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువ

కొనసాగుతున్న మాక్‌ పోలింగ్‌

  • సుమారు 68 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించనున్న మహిళా ఓటర్లు  
  • తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న మాక్‌పోలింగ్‌
  • పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న బుధవారం సాయంత్రమే సిబ్బంది
  • పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తైన ఏర్పాట్లు

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. అప్పటికే క్యూ లైన్‌లో ఉన్నవారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement