
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. తెలంగాణ గవర్నర్‌కు మరోసారి ఝలక్ ఇచ్చేందుకు సర్కార్ రెడీ అయ్యింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నాం 12 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(శాసన సభ, మండలి) నిర్వహించనున్నట్లు స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ వీ నరసింహాచార్యులు ఆ ప్రకటనలో తెలిపారు.
ఇక ఈసారి బడ్జెట్ 5వ తేదీన ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ తమిళిసైకు మరోసారి సర్కార్ ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని భావిస్తోంది. మూడువారాల పాటు ఈ సమావేశాలు జరగొచ్చు.