![Telangana: Bathukamma Celebrations At Gandhi Bhavan - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/10/bathukamma.jpg.webp?itok=JRxcL2bs)
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం బతుకమ్మలు పేర్చి మహిళలు ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ అందరి కుటుంబాల్లో సంతోషం నింపాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి తన సతీమణి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, కోఆర్డినేటర్ నీలం పద్మతో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment