సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు చెప్పారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తరువాత కార్యకర్తలను కలుస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment