సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిపోయిందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందన్నారు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, . భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు.
దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయి. గతంలో మీకు పరిపాలన చేతకాదని ఎద్దేవా చేశారు. కరెంట్ ఉండదు. అంతా చీకటే అన్నారు. ఒక సీఎం అయితే కట్టెతో మ్యాప్‌లో చూపించారు. అప్పుడు అలా చూపించిన వాళ్ల రాష్ట్రంలో కరెంట్ లేదు. మన దగ్గర 24 గంటల కరెంట్ ఉంది. హైదరాబాద్-వరంగల్ కారిడార్ అద్భుతంగా డెవలప్ అవుతోంది. భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూఊహించలేదు. యాదాద్రి పూర్తయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది.’ అని పేర్కొన్నారు.
చదవండి: ఫైటర్ పైలట్ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment