
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ గ్రాంట్‌ను 2020–21 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 28,645 పాఠశాలలకు రూ. 19,11,50,000 విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. కాగా, 15మందిలోపు విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్య ఈసారి(2019–20) పెరిగింది. గతం (2018–19)లో 3,500 వరకు ఉండగా.. ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత కేటగిరీలో 4,178, ఉన్నత పాఠశాలల కేటగిరీలో 23 స్కూళ్లు ఉన్నాయి. ఇక 1,000 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ స్కూళ్లు రాష్ట్రంలో 38 ఉన్నట్లు విద్యా శాఖ లెక్కలు వేసింది. స్కూల్ గ్రాంట్ విడుదల కోసం విద్యాశాఖ ఈ లెక్కలను ప్రాజెక్టు అప్రూవల్ బోర్డుకు పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment