సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. స్కూల్ ఫీజులు పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో 46ను కొనసాగిస్తూ జీవో 75ను ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది. ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, ప్రైవేట్ స్కూళ్లు తమ పంథా మార్చుకోకుండా అధిక ఫీజులు వసూలు చేయడంపై పదేపదే ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. దీనిలో భాగంగా స్కూల్ ఫీజులు పెంచొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని సూచించింది.
చదవండి: కేజీ టూ పీజీ.. జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులే: మంత్రి
బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment