Private Schools fees
-
నాణ్యత లేని బోధనకు బ్రేక్..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లపై మరింత నిఘా పెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రతి ప్రైవేటు స్కూల్‌ను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించే పనిలో ఉంది. ప్రతి ప్రైవేటు పాఠశాల ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చూడాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చారు. అనుమతి పొందిన సెక్షన్లు, స్కూల్లో చదివే విద్యార్థుల సంఖ్య, ఎంతమంది ఉపాధ్యాయులు, ఏ సబ్జెక్టుకు ఎవరు టీచర్? వాళ్ళ అర్హతలేంటి? తీసుకునే ఫీజులెంత? ఇలాంటి అంశాలతో పోర్టల్‌ను రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఇది సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించని స్కూళ్లను గుర్తించడం దీనివల్ల సాధ్యమవుతుందని, నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ఫీజుల వసూలుకు కళ్లెం వేసేందుకు తోడ్పడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ పోర్టల్ రూపకల్పనపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ప్రైవేటు స్కూళ్ల సమాచారం ఇప్పటివరకు జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటోంది. ఇక మీదట విద్యార్థుల తల్లిదండ్రులూ వివరాలు తెలుసుకులా వెసులుబాటు కలి్పంచనున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) నివేదికలో రాష్ట్ర పాఠశాల విద్య 31వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ప్రమాణాలు పెంచేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ అవసరమని అధికారులు భావిస్తున్నారు. బోధనలో నాణ్యతపై దృష్టి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్లున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వీటిల్లో 1.75 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిజానికి డీఎడ్‌తో పాటు టెట్ ఉత్తీర్ణులైన వారినే టీచర్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా పాఠశాలల్లో డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) చేసిన వారితోనే బోధన సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అనేక స్కూళ్లల్లో ఎలాంటి అర్హతలు లేని ఉపాధ్యాయులు కూడా బోధిస్తున్నట్టు తేలింది. దీంతో విద్యలో నాణ్యత దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు స్కూళ్లు మాత్రం అన్ని అర్హతలున్న టీచర్లే బోధన చేస్టున్నట్టుగా రికార్డుల్లో పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఇంతకాలం సరైన పర్యవేక్షణ లేకపోవడం పాఠశాల విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల వివరాలు, వారి అర్హత పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు. అధిక ఫీజులకు కళ్లెం.. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఏటా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి స్కూళ్ళ వారీగా ఫీజుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు. కోవిడ్ తర్వాత ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. దాదాపు 40 శాతం మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. స్కూళ్లు సరిగా నడవకపోవడం, ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో వేతనాలు ఇవ్వకపోవడంతో, ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో టీచర్లు ప్రైవేటు స్కూళ్లల్లో పనిచేయడం మానేశారు. దీంతో అర్హతలేని వారితో బోధన చేయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే పోర్టల్ తెస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నాణ్యత పెరుగుతుంది ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ళ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రత్యేక పోర్టల్ తేవడం వల్ల వాస్తవికత తెలుస్తుంది. ఫలితంగా పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని మేం ఎన్నోసార్లు విద్యాశాఖ దృష్టికి తెచ్చాం. ఇప్పటికైనా అడుగులు పడటం సంతోషం. – పి.రాజాభానుచంద్ర ప్రకాశ్ (అధ్యక్షుడు, రాష్ట్ర హెచ్ఎంల సంఘం) -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్‌అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్‌లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. స్కూల్ ఫీజులు పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో 46ను కొనసాగిస్తూ జీవో 75ను ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది. ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, ప్రైవేట్ స్కూళ్లు తమ పంథా మార్చుకోకుండా అధిక ఫీజులు వసూలు చేయడంపై పదేపదే ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. దీనిలో భాగంగా స్కూల్ ఫీజులు పెంచొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని సూచించింది. చదవండి: కేజీ టూ పీజీ.. జూలై 1 నుంచి ఆన్లైన్ క్లాసులే: మంత్రి బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్ అసోసియేషన్ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు పాఠశాలలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ఆన్లైన్ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. వసూళ్ల కోసం స్కూళ్లు పంపించిన సందేశాలను, వాయిస్‌లను సాక్షాలుగా కోర్టుకు చూపించింది. దీంతో ఆన్లైన్ క్లాస్‌ల నిర్వాహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యూలర్ జారీ చేసిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా) హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే ఆన్లైన్ క్లాస్‌లను నిషేధించారని పేర్కొన్న హైకోర్టు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావద్దని ప్రభుత్వాలు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించింది. ఆన్లైన్ క్లాస్‌లపై యూనిఫామ్ పాలసీ తీసుకు రావాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించగా, జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్లైన్ క్లాస్‌లపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారే విషయం కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆన్లైన్ క్లాస్‌లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. (ఆన్లైన్ ‘దందా’) -
ఆన్లైన్ ‘దందా’
పాఠశాలలు తెరుచుకోలేదు.. తరగతులు నిర్వహించడం లేదు.. కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేదు. కానీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యవహరిస్తున్న తీరు కలవెరపెడుతోంది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీక్కుతింటున్నారు. ఫీజులు చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులకు లింక్ ఇస్తామని ఊదరగొడుతున్నారు. పొనీలే అని ఫీజులు చెల్లించగానే పుస్తకాలను అంటగడుతున్నారు. వీటితోపాటు ట్యూషన్, యూనిఫాం ఇలా ఇతరత్ర వాటికి కూడా డబ్బులు చెల్లించాలంటున్నారు. విద్యా సంవత్సరంమే ప్రారంభంకాని నేపథ్యంలో ఈ అదనపు వసూళ్లపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 'సాక్షి, కడప ఎడ్యుకేషన్: సాధారణంగా ప్రతి ఏటా విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం కావాలి. అయితే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల వారు నవంబర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభించి ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా చాలా స్కూళ్లలో ఫిబ్రవరికి ముందే అడ్మిషన్లు జరిగిపోయాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 25 శాతంకు పైగా ఫీజులు పెంచారు. ఇంకా మోడల్, ఇంటర్నేషనల్, ఒలంపియడ్ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజులను వసూలు చేస్తున్నారు. వీటితోపాటు బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం ఇలా వివిధ పేర్లతో ఒక జాబితాను తయారు చేసి విద్యార్థుల తల్లితండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులకు కూడా అవే ఫీజులు ప్రస్తుతం కరోనా కారణంగా విద్యా సంవతసరం ప్రారంభంకాలేదు. ఎప్పటి నుంచి తరగతులు ప్రారంభవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో కొన్ని పాఠశాలలు ఆన్లైన్, జూమ్ యాప్ ద్వారా తరగతులను నిర్వహిçస్తున్నారు. ఇందుకోసం కూడా ఏటా తీసుకునే విధంగా పీజులతో పాటు బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ పీజులను వసూళ్లు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని చెబుతున్నా ఇవేవి మాకు పట్టవన్నట్లు వారు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా.. జిల్లాలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు ఒకవైపు ఫీజుల దోపిడీ, మరోవైపు పుస్తకాలు దందా సాగిస్తున్నారు. ఫీజుల విషయాన్ని పక్కనపెడితే ప్రభుత్వ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలన్ని నిబంధనలను కూడా తుంగలో తొక్కుతున్నారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన సొంత సిలబస్ పిల్లలపై దిద్దుతున్నారు. ఫీజుల కోసం తరచూ ఫోన్లు కరోనా ముమ్మరంగా ఉండి బయటకు రాలేని పరిíస్థితుల్లో కూడా మా పాఠశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని నిత్యం ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. దీంతోపాటు ఒకొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తే మీ పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేయడంతోపాటు ఆన్లైన్ తరగతులకు లింగ్ ఇస్తామన్నారు. డబ్బులు చెల్లించిన తరువాత లింగ్ ఇచ్చి పుస్తకాలు తీసుకెళ్లాలని లింక్ పెట్టారు. చేసేదేమి లేక 7వ తరగతి వాడికి రూ. 7,250, 9వ తరగతి వారికి రూ. 8,650 చెల్లించి పుస్తకాలను తెచ్చుకున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. – ప్రసాద్‌రెడ్డి, పేరెంట్, కడప -
ఫీజుల పెంపుపై పునరాలోచించండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు తమ వార్షిక ఫీజుల పెంపుపై, మూడు నెలలకోసారి ఫీజులు వసూలు చేయడంపై పునరాలోచన చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ శుక్రవారం కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాల ఫీజుల పెంపుపై ఇప్పటికే కొన్ని సానుకూల చర్యలు చేపట్టాయనీ, ఇతరులు కూడా ఇదే మార్గం అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా పోరాటంలో అన్ని పాఠశాలలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా.. లాక్డౌన్ సమయంలో అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు పెంచరాదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు మళ్లీ తెరుచుకునేంత వరకూ ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఫీజులు చెల్లించాలంటూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని రాజస్తాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఆదేశించాయి. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి: సీబీఎస్ఈ దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉపాధ్యాయుల వేతనాలు, స్కూలు ఫీజుల చెల్లింపులపై అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం కోరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫీజుల అంశంపై తగిన పరిష్కారం కనుగొనాలని రాష్ట్రాలను కోరినట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ తెలిపారు. -
తల్లిదండ్రులను వణికిస్తోన్న ప్రైవేటు స్కూలు ఫీజులు
సాక్షి, తాడూరు(నాగర్ కర్నూలు): ఈనెల 12నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులకు టెన్షన్ ప్రారంభమైంది. పిల్లలను ఏ కళాశాలలో, ఏ పాఠశాలలో చేర్పించాలన్న తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలంటే వేలకు వేలు ఫీజులు ఉండడంతో తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. పాఠశాల అడ్మిషన్ ఫీజుతో పాటు వారికి కావాల్సిన ఇతర సామగ్రిని కలుపుకొని రెండింతలు కావడంతో అయోమయంలో పడిపోతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు సంసిద్ధం అవుతున్నారు. దీంతో స్టేషనరీ, జనరల్, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షల దుకాణాలు, విద్యా సంబంధిత వస్తు సామగ్రి దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇంగ్లిష్, తెలుగు మీడియం అయినా యూనిఫామ్ తప్పని సరి. పోటాపోటీగా ప్రచారం ప్రైవేట్ పాఠశాలలో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. పిల్లలను స్కూల్ చేర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అధికంగా ఉన్నా దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు విధిగా యాజమాన్యాలు నిర్దేశించిన యూనిఫామ్ ధరించాలి. దీనికి తోడు విద్యా సామాగ్రి, ధరలు అధికంగా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్, నోట్ పుస్తకాలు, విద్యా సామాగ్రి విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోలు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలలో చేర్పించే క్రమంలో నిమగ్నమయ్యారు. చిన్నారుల విద్య కోసం బడ్జెట్ వేసుకొని విద్యా సామాగ్రి కొనుగోలు చేసుకుంటున్నారు. ఫీజుల మోత ప్రైవేట్ పాఠశాలలో నర్సరీకి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి ఇలా తరగతుల వారిగా రూ.5వేల చొప్పున ఫీజులు పెరుగుతున్నాయి. దీనికి తోడు పుస్తకాలు, ఇతర వాహనాల చార్జీలు కలుపుకుంటే ఫీజులు కట్టడానికి మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పాఠ్య పుస్తకాలు, ఎమ్మార్సీ భవనానికి చేరుతున్నాయి. అనుమతి లేని విద్యాసంస్థలతో ఇబ్బందులు మండలంలో అనుమతులు లేని పాఠశాలలపై అధికారులు దృష్టి సారించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం, వారిని తిరిగి ఇతర పాఠశాలలో చేర్పించే సమయంలో రికార్డు సీట్స్, టీసీలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ఆడిండే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రైవేట్ యాజమాన్యాలను నియంత్రించే దిశలో అధికారులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధరలు పెరిగాయి పెరిగిన విద్యా సామగ్రి ధరలను తట్టుకోలేకపోతున్నాం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగించే తమకు విద్యా సామాగ్రి కొనుగోలు పిల్లల చదువు విషయంలో ప్రతి పైసా బేరీజు వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటాం. మాలాంటి కుటుంబాలకు చదువు భారంగా మారుతుంది. – శ్రీశైలం, గుంతకోడూరు ఫీజులు నియంత్రించాలి ప్రైవేట్ పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజలు వసూలు చేస్తున్నారు. వాటిని నియంత్రించాలి. ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేయాలి. అధికారులు సకాలంలో పాఠశాలలో మౌలిక వసతులపై స్పందించాలి. – కురుమూర్తి, తాడూరు -
పుస్తకాలు, యూనిఫామ్స్ తమ వద్దే
సాక్షి, సిటీబ్యూరో: జూన్ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుడుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలతో గడిపిన ఆనందం క్షణాల్లో ఆవిరవుతోంది. ఏటా భారీగా పెరుగుతున్న ఫీజులతో పేద, మధ్య తరగతి వర్గం చితికిపోతోంది. ట్యూషన్ ఫీజుల పేరుతో ఇప్పటికే భారీగా వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు... పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ సైతం తమ వద్దే కొనాలని కొత్తగా నిబంధనలు పెడుతుండడం, వాటి ధరలు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రెట్టింపు ఉండడంతో తల్లిదండ్రులకు పిల్లల చదువు భారమవుతోంది. విద్యార్థులకు మంగళవారంతో వేసవి సెలవులు ముగుస్తాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులను బడికి పంపే ఏర్పాట్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. పుస్తకాలు, డ్రెస్సులు, షూస్ కొనుగోళ్లపై దృష్టిసారించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉండడం, ఫీజు మొత్తం ప్రారంభంలోనే చెల్లించాల్సి వస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే.. అతి తక్కువ వేతనాలతో కాలం వెల్లదీస్తున్న సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితి మరింత దయానీయంగా మారింది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున 60,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇద్దరు/ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కసారిగా ఖర్చులన్నీ మీద పడడంతో సగటు మధ్య తరగతి కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. నిబంధనలకు నీళ్లు.. 1994 జీఓ నంబర్ 1 ప్రకారం పాఠశాలలు 5శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లోంచి 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాలకు 15 శాతం, పాఠశాల నిర్వహణకు, అభివృద్థికి 15 శాతం చొప్పున ఖర్చు చేయాలి. కేవలం 5 శాతం మాత్రమే యాజమాన్యం లాభంగా ఆశించాలి. కానీ 80 శాతం ఆదాయాన్ని లాభంగా తీసుకుంటూ, కేవలం 20 శాతం మాత్రమే ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారు. అంతేకాదు పాఠశాల ఆదాయ, వ్యయాలపై ప్రతి ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్‌లను ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఏ ఒక్క స్కూలు కూడా సమర్పించడం లేదు. ఒకవేళ ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్‌లను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న కచ్చితమైన నిబంధనలు పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయొచ్చు. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ–టెక్నో తదితర పేర్లు ఉండకూడదు. కేవలం పాఠశాల పేరు మాత్రమే పేర్కొనాలి. కానీ నగరంలో చాలా పాఠశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు టెక్నో, ఐఐటీ, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ–టెక్నోతో ప్రచారం చేసుకుంటున్నాయి. అజమాయిషీ కరువు... గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీ కొరవడుతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. విద్యాసంస్థ ఏర్పాటు నుంచి నిర్వహణ వరకు చాలా అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను చాలా విద్యాసంస్థలు పట్టించుకోకపోవడం గమనార్హం. వీటిపై కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో మిగతా విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వివరిస్తున్నారు. క్రీడా ప్రాంగణం, విశాలమైన తరగతులు, విద్యార్హతలున్న ఉపాధ్యాయుల భర్తీ, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటు చేయాలనే నిబంధనను చాలా విద్యాసంస్థలు అమలు చేయట్లేదనే ఆరోపణలున్నాయి. డిజిటల్ తరగతి గదులు, ఏసీ ప్రాంగణాల పేరుతో ఫీజులు భారీ స్థాయిలో వసూలు చేయడంపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నిర్ణయించిన ఫీజులను సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుం కలిపి వసూలు చేస్తున్నాయని పేర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్డూఅదుపు లేకుండా వసూళ్లు చేస్తున్న ఫీజులపైనా విద్యాశాఖ నియంత్రణ ఉండాలని కోరుతున్నారు. ఇంత ఫీజులు వసూళ్లు చేస్తున్న చాలా విద్యాసంస్థల్లోనూ కనీస వసతులు, క్రీడా మైదానాలు ఉండట్లేదని వివరిస్తున్నారు. ఖర్చులు ఇలా... (సుమారు) స్కూల్ ఫీజు రూ.40,000–60,000 పుస్తకాలకు రూ.4,500–6,500 ట్రాన్స్‌ఫోర్ట్ ఫీజు రూ.6,000–8,000 రెండు జతలయూనిఫామ్ రూ.3,500–4,000 రెండు జతల షూలు రూ.800–1200 టై, బెల్ట్స్ రూ.150–500 బ్యాగులు రూ.500–1500 ఇంటి అద్దె రూ.6,000–12,000 కిరాణ సామాను రూ.4,000–6,000 పాలు, కూరగాయాలు,ఇతర ఖర్చులు రూ.5,000 -
సామాన్యుడి నేస్తం
సాక్షి, శ్రీకాకుళం: సామాన్యుడికి సరైన నేస్తం దొరికాడు. కష్టం పంచుకుని, కన్నీరు తుడవగలిగే మనసున్న స్నేహితుడు లభించాడు. డబ్బు లేదని పిల్లాడి చదువు ఆగిపోతోందని తెలిసి స్కూల్‌కు పంపితే డబ్బులిస్తానని హామీ ఇచ్చాడు. చేతిలో సొమ్ము ఉంటే గానీ పేదల ప్రాణం నిలబడదని తెలుసుకుని ఎక్కడికైనా వెళ్లి చికిత్స చేయించుకోండి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది అని భరోసా ఇచ్చాడు. వైఎస్ జగన్ రూపంలో సగటు మనిషికి ఓ ధైర్యం దొరికింది. యూనివర్సల్ హెల్త్ స్కీమ్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కమిటీ ఆలోచనలతో జగన్ సామాన్యుడి మనసును ఎంతలా చదివారో అందరికీ అర్థమవుతోంది. ఈ పథకాలు అమలైతే దిగువ తరగతి జీవి మర్చిపోయిన నవ్వు మళ్లీ వారి పెదాలపై విరబూస్తుంది. దూరమైన సంక్షేమం వారింటికి తిరిగొస్తుంది. ఫీజులుంనకు కళ్లెం! ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్ల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తెలుగుదేశం హయాంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా కనీస నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలు అధికార పార్టీలోను, ప్రభుత్వంలోను కీలక భూమిక పోషిస్తుండడంతో కార్పొరేట్ విద్యా సంస్థల జులుంనకు ఎందరో విద్యార్థులు బలికావాల్సి వచ్చింది. విద్యా సంవత్సరం చివరిలో ఏకపక్ష నిర్ణయంతో ఫీజులను పెంచేసి దాన్ని కట్ట కుంటే హాల్ టిక్కెట్లను ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవే కాకుండా ఏటా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు తమ వద్దే కొనుగోలు చేయాలంటూ వేలాది రూపాయలను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేస్తూ వచ్చాయి. ఐఐటీ శిక్షణ, ఎంసెట్ శిక్షణ అంటూ అదనపు ఫీజులను వసూళ్లు చేసినా ప్రభుత్వం చోద్యం చూస్తూ వచ్చింది. ప్రస్తుతం నర్సరీ విద్యార్థి ఫీజు రూ. 20వేల వరకు ఉండగా పదో తరగతి విద్యార్థి ఫీజు రూ. 60వేలకు పైబడి ఉంది. జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల నుంచి రూ. 45 వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నా ప్రభుత్వం వారిని నియంత్రించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షణ కమిటీని నియమిస్తామని, ఆ కమిటీలపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుందని ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేలా పలు ప్రకటనలు చేయడంతో పేద వర్గాల నుంచి కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. పేదల ఆరోగ్యానికి భరోసా యూనివర్సల్ హెల్త్ కార్డు.. ఆరోగ్యశ్రీ పథకానికి 2.0 వెర్షన్ ఇది. రాజన్న ఆదర్శానికి జగన్ ఆలోచన కలగలిపితే రూపొందిన పథకమిది. రూ.5లక్షల్లోపు ఆదాయం గల కుటుంబాలకు ఈ కార్డుతో సకల వైద్య సదుపాయాలు అందిస్తారు. బడుగు జీవులు అధికంగా ఉండే శ్రీకాకుళం వంటి జిల్లాకు ఈ పథకం వరదాయినే. జిల్లాలో సుమారుగా 7.50 లక్షల కుటుంబాలకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలగనుంది. ప్రధానంగా ఈ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా దీర్ఘకాలిక రోగులు కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పింఛను కూడా అందిస్తామని చెప్పారు. వారికి వైద్యంతో పాటు పింఛన్ అందితే చాలా మంది బతుకులు బాగుపడతాయి. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వ్యక్తులకు ఏ చిన్న రోగం వచ్చినా, ప్రభుత్వం వైద్యం అందించే పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో లేదు. దీంతో ప్రతి రోగి ప్రైవేటు వైద్యంపైనే ఆధారపడుతున్నాడు. చిన్న చిన్న సమస్యలకు కూడా వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో ప్రభుత్వం పరంగా 82 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 కమ్యూనిటీ ఆస్పత్రులు, మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రాస్పత్రి, ఇంకా వీటితో పాటుగా ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్) ఉన్నా సామాన్యుడు మాత్రం ప్రైవేటు వైపే చూస్తున్నాడు. ఐదేళ్లుగా రిమ్స్‌ను పట్టించుకోవడమే మానేశారు. దాదాపు 350 వరకు ఉన్న ప్రైవేటు వైద్య శాలలు రోగుల నుంచి రక్తాన్ని ఫీజుల రూపంలో పిండేస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ కార్డు గనక అందితే పేదలకు ఇక వైద్యం గురించి దిగులే ఉండదు. కదిలించిన గాథ టెక్కలి: కోటబొమ్మాళికి చెందిన దాసరి శ్రీదేవి అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా కొత్తపేట సమీపంలో జగన్మోహన్రెడ్డిని 2018 డిసెంబర్ 19న కలిసి తన కష్టాన్ని విన్నవించుకున్నారు. ఆమె బాధ విని చలించిపోయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను ఆదుకోవడమే కాక.. తాను అధికారంలోకి రాగానే పేద, సామాన్య వర్గాలకు ఖరీదైన వైద్యం అందే విధంగా ప్రణాళిక రూపొందిస్తానని మాట ఇచ్చారు. ఇలాంటి ఎందరో బాధితుల కష్టాలు, కన్నీళ్లు చూసిన ప్రజా నేత ఈ రోజు యూనివర్సల్ హెల్త్ కార్డుల విప్లవానికి నాంది పలికారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికి అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా ప్రకటన చేశారు. హామీలివే.. (ఆరోగ్య శ్రీ పథకం) ♦ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తింపు. ♦ వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం ూ ఎంత ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచిత వైద్యం ♦ వైద్యం చేయించుకున్నా (హైదారాబాద్, బెంగూలూరు, చెన్నై తదితర) పథకం వర్తింపు ♦ అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్య శ్రీపరిధిలోకి ♦ ఆపరేషన్, జబ్బుచేసిన వ్యక్తి చికిత్స తర్వాత ఆ కుటుంబానికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. ♦ కిడ్నీ వ్యాధి తలసేమియా, ఇంకా ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రత్యేకంగా రూ. 10 వేలు పింఛను. అన్ని రకాల వైద్యసేవలు గతంలో రాజశేఖరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వందలాది జబ్బులకు ఉచితంగా వైద్యం చేయించారు. టీడీపీలో అది పూర్తి నాశనమైంది. యూనివర్సల్ హెల్త్‌కార్డు ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందడం పేదల పాలిట వరం. నాటి ఆరోగ్యశ్రీ రాజన్న మానస పుత్రిక అయితే నేటి ఈ పథకం జగనన్న మానస పుత్రిక. – వాన నాగేశ్వరరావు, టీ.లింగాలుపాడు, జలుమూరు తండ్రి కంటే రెట్టింపు సంక్షేమం జగన్ ప్రవేశ పెట్టిన హెల్త్‌కార్డు వైఎస్సార్ కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి కనీసం సరైన వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు ఆసరాగా ఈ పథకం నిలబడుతుంది. – సనపల సురేష్‌కుమార్, ప్రైవేటు ఉద్యోగి, ఆమదాలవలస రూ.లక్షల్లోనే ఖర్చు ప్రస్తుత రోజుల్లో పిల్లలను చదివించుకోవాలంటే రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఫీజుల విషయంలో పాఠశాల యాజమాన్యాలు కనికరం చూపడం లేదు. తల్లిదండ్రులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాం టి పరిస్థితుల్లో ఫీజుల నియంత్రణ అత్యవసరం. – పడాల శాంతరావు, తీమర గ్రామం, పాతపట్నం ప్రైవేటు దోపిడీ ఆపాలి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై ఫీజుల విషయంలో పట్టించుకోకపోవడంతో అవి ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నాయి. ఈ దోపిడీ వ్యవస్థపై జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. – అమర్ రామారావు, కొరసవాడ గ్రామం, పాతపట్నం -
విద్య.. విక్రయాలయాలు
పైన మీరు చదివింది నిజమే.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలను మనం ఇప్పుడు ఇలానే అనాలేమో. ఎందుకంటే ప్రస్తుతం ఇవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. సామాన్యులను భయపెట్టేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే మామూళ్ల మత్తులో విద్యాశాఖజోగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమంటే విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామంటున్నాయని, ఏ పాఠశాల ఎంత ఫీజు వసూలు చేస్తుందన్న విషయం వారికి తెలియదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరుఎడ్యుకేషన్: జిల్లాలోని కొన్ని ప్రైవేటు వి ద్యాసంస్థలు ఏటా ఇష్టానుసారం ఫీజులు పెంచు తూ వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఎల్కేజీ, యూకేజీ చదువులకే రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో పాటు, యూని ఫామ్, టై, బెల్డు, షూ, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలంటూ అందిన కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 894 ప్రైవేటు, 150 కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో ఎల్కేజీకి రూ.8 వేలు నుంచి రూ.12 వేల వరకు, పదోతరగతికి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నాయి. అక్కడితో సరిపెట్టుకోక అడ్మిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల అభివృద్ధి, పరీక్ష రుసుములు పేరిట రూ.వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అ యితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు మాత్రం లేవు. విద్యా వ్యాపారం ప్రభుత్వం ముద్రించిన ఇంగ్లిషు మీడియం పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆరో తరగతి నుంచి ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలే వాడాలని నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. ఐఐటీ, ఒలింపియాడ్, ఇతర కారణాలు చెబుతూ కొన్ని యాజమాన్యాలు ఇతర పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఇలా ఒక్కో తరగతి పుస్తకాల సెట్‌కు రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇవే కాకుండా నోటుపుస్తకాలు, షూస్, టై, బెల్ట్ ఇలా అన్ని పాఠశాలల్లో కొనాల్సిందే. కనిపించని పేరెంట్స్ కమిటీలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి పాఠశాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీ లించడానికి పేరెంట్స్ కమిటీని విధిగా ఏర్పాటు చేయాల్సిఉంది. కానీ ఎక్కడా పేరెంట్స్ కమిటీలు కనిపించడం లేదు. ఊసే లేని ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజుల నియంత్రణకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీఈఓ, జెడ్పీ సీఈఓ ,సభ్యులుగా సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల అధికారులు వ్యవహరించాలి. అయితే జిల్లాలో ఈ కమిటీ నియామకం జరగలేదని తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ప్రభుత్వం 2014లో జీఓ నంబర్ 91ని తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. ఎక్కడా ఈ జీఓ అమలు చేయలేదు. కార్పొరేట్ రూటే సపరేట్ కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు పిల్లలకు ఫీజు రూ.15 వేలు ఉండగా, రెండు జతల యూనిఫామ్ రూ.2 వేలు, టై, బెల్ట్, బ్యాడ్జ్‌లకు రూ.500, రెండు రకాల షూలకు రూ.850, నోటు పుస్తకాలకు రూ.500, బ్యాగ్ రూ.500, లంచ్‌బాక్స్ రూ.300, తదితర ఖర్చులు కలుపుకుని సుమారు రూ.5 వేలు అవుతోంది. ఇది కేవలం నర్సరీ నుంచి యూకేజీ విద్యార్థికే. ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఏ స్థాయిలో ఫీజులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంఈఓలకు ఆదేశించాం అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠశాలల్లో నోటుపుస్తకాలు, స్టేషనరీ అమ్మడం చట్టరీత్యానేరం. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చే యాలని ఎంఈఓలను ఆదేశించాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సబం«ధిత పాఠశాలపై చర్యలు తీసుకుంటాం. – పాండురంగస్వామి, డీఈఓ -
నేటి నుంచి మూడు రోజులు స్కూళ్లు బంద్
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50 శాతం ఫీజులు తగ్గించాలనే డిమాండ్‌తో రిజర్వేషన్ల విద్యార్థి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) బుధవారం నుంచి మూడు రోజుల పాటు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధిచిన వాల్‌పోస్టర్లను మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.నాగరాజు మాట్లాడుతూ, కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయా స్కూళ్లలో 50 శాతం ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. స్కూళ్ల బంద్‌కు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్వీఎఫ్ జి.ఓబులేసు, ఆర్పీఎస్ సుధాకర్‌యాదవ్, జీవీఎస్ మల్లికార్జుననాయక్, ఆర్వీఎస్ సీమకృష్ణ, నిరుద్యోగ ఐక్య వేదిక రామన్న, టీఎస్ఎఫ్ రవి, రాధాకృష్ణ, ఎస్వీఎస్ఎఫ్ అశ్వర్థ, ఆర్వీఎఫ్ అశోక్, విద్యార్థి సత్తా అమర్‌యాదవ్, ఆర్పీఎస్ అశోక్, గణేష్, సుబ్బరాయుడు, బోనాల రఫీ, బాబా, యశ్వంత్ పాల్గొన్నారు. -
స్కూల్ ఫీజుల దందాపై పోరుకు కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీపై ఉద్యమించేందుకు బృహత్ కార్యాచరణ సిద్ధమైంది. విచ్చలవిడిగా ఫీజులు లాగుతున్న తీరుపై ఇప్పటివరకు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) ఒంటరిగా ఆందోళనలు చేస్తూ వచ్చింది. అడపాదడపా కొన్ని సంఘాలు విడిగా ఫీజులపై పోరాటాలు సాగించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో స్కూళ్లు ఫీజులు తగ్గించకపోగా.. పెంచాయి. పైగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు స్కూళ్లలో చేపట్టిన తనిఖీల నివేదికను ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. తనిఖీలు ముగిసి 6 నెలలైనా.. నాన్చుడు ధోరణే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల పోరుకు పదును పెట్టాలని హెచ్ఎస్పీఏ నిర్ణయించింది. ఎంవీఎఫ్, టీపీఈఆర్‌ఎం, సీఆర్పీఎఫ్, ఏపీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ తదితర ప్రజా, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరిపి ‘స్కూల్ ఫీజుల నియంత్రణ సాధనకు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ-ఎస్ఎఫ్ఆర్)’ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఏర్పాటైన జేఏసీ - ఎస్ఎఫ్ఆర్ ప్రతినిధులు తమ కార్యాచరణను వివరించారు. 9న రాజకీయ పార్టీలతో సమావేశం అధిక ఫీజులపై పోరాడేందుకు రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9న నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్కూల్ అధిక ఫీజుల విషయంలో దేశంలోని అన్ని నగరాలన్నింటిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కమిటీ కార్యవర్గమిదే.. జేఏసీ-ఎస్ఎఫ్ఆర్ చైర్‌పర్సన్‌గా అరవింద జటా, జనరల్ సెక్రటరీగా ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నాగటి నారాయణ, వైస్ చైర్పర్సన్లుగా కె. విమల, శారదా గౌడ్, హెచ్ఎస్పీఏ అధ్యక్షులు విక్రాంత్, జాయింట్ సెక్రటరీలుగా డి. ప్రకాశ్, ప్రతాప్, ఆశిష్, సుబ్రహ్మణ్యం, ట్రెజ రర్‌గా శ్రీనివాస్‌రెడ్డి, అడ్వైజరీ బోర్డ్ చీఫ్‌గా ఆర్. వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. -
తల్లిదండ్రులపై ఫీజుల మోత!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తన పాపను నర్సరీలో చేర్పించేందుకు కొద్దిగా పేరున్న స్కూలుకు వెళ్లాడు. కానీ అక్కడ వారు చెప్పిన లెక్క విని కంగుతిన్నాడు. ఫీజు కింద రూ.28 వేలు, డొనేషన్ పేరిట సుమారు రూ. 40 వేలు, యూనిఫాం, టై, బెల్ట్, బూట్లకు రూ. 5 వేలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌కు రూ. 3 వేలు, రవాణాకు రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో అవాక్కయ్యాడు. ఈ ఒక్క స్కూల్లోనే కాదు... రాష్ట్రంలో పేరొందిన ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలోనూ ఫీజుల వ్యాపారం ఇదే స్థాయిలో సాగుతోంది. 25 శాతం పెంచేసిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ♦ ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టని సర్కారు ♦ కోర్టు తీర్పు పేరిట పక్కకు పెట్టిన విద్యాశాఖ ♦ అమలుకు నోచుకోని 25 శాతం ఉచిత సీట్లు ♦ నేటి నుంచే బడులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా హడలెత్తించనుంది! ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఈసారి సాధారణ ప్రైవేటు పాఠశాలలు 25 శాతం మేర ఫీజులను పెంచి వసూలు చేయనున్నాయి. మరోవైపు కొత్త రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా అవి అమల్లోకి రాలేదు. ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 31 లక్షల వుంది విద్యార్థులు చదువు తుండగా ఆయూ స్కూళ్లలో ఫీజుల నియుంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టలేకపోతోంది. గతంలో ఫీజుల నియుంత్రణకు ఉత్తర్వులు జారీ చేసినా వాటిని పక్కాగా అమలు చేయడంలో విఫలమైంది. దీనికితోడు ఫీజుల నియుంత్రణకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనల ప్రకారం లేవంటూ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సవాల్ చేయకపోవడంతో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై నియుంత్రణ కొరవడింది. 25 శాతం సీట్లలో ఉచిత ప్రవేశాలు ఈసారైనా అమలయ్యేనా? విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లలో ఉచిత ప్రవేశాలు (ప్రభుత్వ రీయింబర్స్మెంట్ ద్వారా) అమలు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా వూరింది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వమే రీయిం బర్స్మెంట్ చేస్తూ ప్రైవేటు స్కూళ్లలోని ప్రారంభ తరగతిలో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించి ఉచిత విద్యను అందించ డంలో ముందున్నాయి. చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 2015- 16 విద్యా సంవత్సరంలో ఉచిత ప్రవేశాల అమలుకు విద్యాశాఖ సర్క్యులర్ (ఆర్సీ నం బరు 45/పీఎస్-3/2015) జారీ చేసి చేతులు దులుపుకుందే తప్ప పక్కా చర్యలు చేపట్టలేకపోయింది.