అంబేడ్కర్ విగ్రహం ఎదుట వాల్‌పోస్టర్లు విడుదల చేస్తున్న దృశ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50 శాతం ఫీజులు తగ్గించాలనే డిమాండ్‌తో రిజర్వేషన్ల విద్యార్థి ఫెడరేషన్ (ఆర్‌వీఎఫ్) బుధవారం నుంచి మూడు రోజుల పాటు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధిచిన వాల్‌పోస్టర్లను మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.నాగరాజు మాట్లాడుతూ, కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయా స్కూళ్లలో 50 శాతం ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
స్కూళ్ల బంద్‌కు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్‌వీఎఫ్ జి.ఓబులేసు, ఆర్‌పీఎస్ సుధాకర్‌యాదవ్, జీవీఎస్ మల్లికార్జుననాయక్, ఆర్‌వీఎస్ సీమకృష్ణ, నిరుద్యోగ ఐక్య వేదిక రామన్న, టీఎస్‌ఎఫ్ రవి, రాధాకృష్ణ, ఎస్‌వీఎస్‌ఎఫ్ అశ్వర్థ, ఆర్‌వీఎఫ్ అశోక్, విద్యార్థి సత్తా అమర్‌యాదవ్, ఆర్‌పీఎస్ అశోక్, గణేష్, సుబ్బరాయుడు, బోనాల రఫీ, బాబా, యశ్వంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment