40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఉత్తర్వులు విడుదల | Telangana Govt Announced To Celebrate Teachers Day 2022 | Sakshi
Sakshi News home page

40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఉత్తర్వులు విడుదల

Published Fri, Sep 2 2022 1:09 AM | Last Updated on Fri, Sep 2 2022 2:46 PM

Telangana Govt Announced To Celebrate Teachers Day 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుపూజ దినోత్సవాన్ని (సెప్టెంబర్‌ 5) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ, అంకితభావం గల వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరిలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్స్, పీజీటీలు 19 మంది, ఎస్‌జీటీ, టీజీటీలు 10 మంది, ఒక సీనియర్‌ లెక్చరర్‌... మొత్తం 40 మంది ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. 

గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు
ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల విభాగాల్లో చకినాల శ్రీనివాస్‌(సిరిసిల్ల), బూసా జమునాదేవి (జయశంకర్‌ భూపాలపల్లి), ఓ చంద్రశేఖర్‌ (జయశంకర్‌ భూపాల పల్లి), టి.మురళీకృష్ణమూర్తి (మేడ్చల్‌) ఎస్‌.సురేశ్‌ (నిజామాబాద్‌), వి.రాజేందర్‌(ఖమ్మం), వనుపల్లి నిరంజన్‌ (రంగారెడ్డి), సుర సతీశ్‌(భువనగిరి), గోపాలసింగ్‌ తిలావత్‌ (ఆదిలాబాద్‌), బి.చలపతిరావు(ఖమ్మం) ఎంపిక.

స్కూల్‌ అసిస్టెంట్లు
డి.సత్యప్రకాశ్‌ (స్టేషన్‌ ఘన్‌పూర్‌), జె.శ్రీనివాస్‌ (నిర్మల్‌), పి.ప్రవీణ్‌కుమార్‌ (కామారెడ్డి), తేజావత్‌ మోహన్‌బాబు (భద్రాద్రి కొత్తగూడెం), ఎ.వెంకన్న (సూర్యాపేట), కన్నం అరుణ(కరీంనగర్‌), సయ్యద్‌ షఫీ(ఖమ్మం), డాక్టర్‌ హజారే శ్రీనివాస్‌(నిజామాబాద్‌), కె.రామారావు (సూర్యాపేట), సీహెచ్‌ కృష్ణ (వరంగల్‌), కె.మధుకర్‌ (ఆసిఫాబాద్‌), ఎ.రాజశేఖర్‌ శర్మ (సిద్దిపేట), గొల్ల వెంకటేశ్‌ (జోగుళాంబ గద్వాల్‌), కె.ధనలక్ష్మి (వరంగల్‌), కంచర్ల రాజవర్ధన్‌  రెడ్డి (నల్లగొండ), జి.గిరిజమ్మ (నారాయణపేట), జె.ఎల్లస్వామి (గద్వాల్‌), సీహెచ్‌ భరణీకుమార్‌(యాదాద్రి భువనగిరి), అంబటి శంకర్‌(రాజన్న సిరిసిల్ల)

ఎస్‌జీటీలు
జి.చంద్రశేఖర్‌(నిర్మల్‌), ఎం.వెంకట్‌రెడ్డి( హైదరాబాద్‌), పశుల ప్రతాప్‌ (ఆదిలాబాద్‌), యు.లచ్చిరాం(నల్లగొండ), కె.ప్రవీణ్‌ (పెద్దపల్లి), అర్చ సుదర్శనం (హన్మకొండ), టి.ఓంకార్‌ రాధాకృష్ణ (సిద్దిపేట), కదరి అనిత (నల్లగొండ), బి.నర్సయ్య (నిజామాబాద్‌), సీహెచ్‌ రాజిరెడ్డి(జగిత్యాల). సీనియర్‌ లెక్చరర్‌... డాక్టర్‌ ఎం.రమాదేవి (ప్రభుత్వ లెక్చరర్, మాసబ్‌ట్యాంక్, హైదరాబాద్‌)

ప్రత్యేక విభాగం...
బి.శంకర్‌బాబు (సంగారెడ్డి), జె.శ్రీనివాసరెడ్డి(సిద్దిపేట), ఎం.రాంప్రసాద్‌ (సిద్దిపేట), టి.మధుసూదన్‌రావు (హైదరాబాద్‌), వరకల పరమేశ్వర్‌(రంగారెడ్డి), వై.లిల్లీమేరి (జనగాం), టి.సత్యనారాయణ(సూర్యాపేట), ఎం.వెంకటయ్య (సూర్యాపేట), సత్తులాల్‌(భద్రాద్రి కొత్తగూడెం), సముద్రాల శ్రీదేవి(సంగారెడ్డి).   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement