సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే పలు షరతులు విధించింది. ‘భైంసాకు 3 కిలోమీటర్ల తర్వాతే సభ నిర్వహించాలి. సాయంత్రం 3 గం.కు సభ ప్రారంభించి 5 గం.కు ముగించాలి. పాద యాత్ర రూట్‌మ్యాప్‌ను ముందే పోలీసులకు అందజేయాలి. యాత్ర కూడా భైంసా నుంచి వెళ్లకూ డదు.
పిటిషన్ పార్టీ(బీజేపీ) నాయకులు, కార్యక ర్తలు మతపరమైన నినాదాలు చేకూడదు. అభ్యంతరకర ప్రసంగాలు కూడా చేయొద్దు. కర్రలాంటివి ధరించి యాత్ర సాగించొద్దు. ఒకవేళ ఉద్రిక్త పరి స్థితులు ఏర్పడితే ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు పోలీసులకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ప్రజల ఆస్తు లకు నష్టం వాటిల్లితే పిటిషనర్ పార్టీదే బాధ్యత. ప్రస్తుతం సభ జరుగుతున్న వై జంక్షన్ ప్రాంతం భైంసా నుంచి 3 కిలోమీటర్ల దూరం తర్వాత ఉంటేనే అనుమతివ్వాలి.
లేకుంటే పిటిషనర్ పార్టీ మరో ప్రాంతానికి వేదికను మార్చుకోవాలి. ఏదైనా కారణలతో ఈ రోజు సభ రద్దయి.. రేపు నిర్వహించినా ఇదే షరతులు వర్తిస్తాయి’అని న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సోమవారం కోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు. 10.30కు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు విన్నది.
ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి..
అత్యంత సమస్యాత్మక ప్రాంతమని చెప్పే చార్మి నార్ వద్దే బీజేపీ సభ పెట్టి ప్రశాంతంగా నిర్వహించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది రామచందర్‌రావు తెలిపారు. అలాంటిది బైంసాలో ఇబ్బందులు వస్తాయని పోలీసులు బండి పాదయాత్రను అడ్డుకోవడం అర్థం లేదన్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల ప్రజా సంగ్రామ యాత్ర పూర్త యిందని, ఎక్కడా మత ఘర్షణ అన్నదే జరగలేదని నివేదించారు.
ప్రశాంతంగా యాత్ర సాగిస్తున్నా రని, మత సామరస్యం చెడుతుందని పోలీసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాత్ర సందర్భంగా బందోబస్తు చేయడం పోలీ సుల విధి అని చెప్పారు. ఈ సందర్భంలో కలుగజేసుకున్న న్యాయమూర్తి.. సభా వేదికను వేరే ప్రాంతానికి మార్చుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రజలు కూడా తరలివస్తున్నారని రామచందర్‌రావు సమాధానమిచ్చారు. అసలు పోలీసులే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇచ్చారన్నారు. ఇప్పుడు మార్చమని చెప్పడం సరికాదన్నారు.
సంగ్రామం ఎవరి మీదో చెప్పాలి...
ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలని బీజేపీ పిటిషన్‌లో కోరిందని అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచంద్రరావు పేర్కొన్నారు. సంగ్రామ.. అంటేనే యుద్ధం అని అర్థమని, మరి వారి యుద్ధం ఎవరి మీదో చెప్పాలన్నారు. గతంలో భైంసాలో పలుమార్లు మత ఘర్షణలు చోటుచేసున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. దీని కారణంగా మళ్లీ మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. సున్నిత ప్రాంతం కావడంతో ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రజా సంగ్రామ యాత్రకు షరతులతో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment