సాక్షి, హైదరాబాద్: హిల్‌పోర్టు ప్యాలెస్ పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన కేసులో ఏం చర్యలు చేపడుతున్నారో నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది. ఈ కేసులో న్యాయస్థానం ఆదేశాల మేరకు నలుగురు ఐఏఎస్‌లు సీజే ధర్మాసనం ఎదుట హాజ రయ్యారు. గత విచారణ సందర్భంగా అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విష యం తెలిసిందే.
తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వ్యక్తిగతంగా హాజరై వివ రణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే శుక్రవారం విచార ణ సందర్భంగా సీఎస్‌ల మీటింగ్ ఉండటంతో తాను హాజరుకాలేకపోతున్నానని సోమేశ్‌కుమార్ కోర్టుకు తెలియజేశారు. హిల్‌పోర్టు ప్యాలెస్ పునరుద్ధరణ పను లు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్టు 2020, జనవరిలో హైకోర్టులో పిల్ దాఖ లు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచా రణ చేపట్టింది. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మి నిస్ట్రేషన్ అండ్ అర్భన్ డెవలప్ మెంట్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిష నర్ లోకేశ్‌కుమార్, పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పర్యాటక శాఖ ఇన్‌చార్జీ శ్రీనివాసరాజుతో పాటు ఇతర అధికారులు శ్రీదేవి, మనోహర్‌రావు, బాలకృష్ణ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.
పిటిషనర్ తరఫున ముద్దు విజయ్ వాదనలు వినిపించారు. హిల్‌పోర్టు ప్యాలెస్ సర్వే కోసం పలు ఏజెన్సీలను ప్రభుత్వం సంప్రదించిందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. 100 ఏళ్లకు పైబడిన ఈ భవనంపై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ట్రక్షన్‌తో పాటు పలువురు ఇంజ నీర్లు అధ్యయనం చేసి ఈ నెల 14న నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికను ఇంజనీర్ లాబోరేటరీకి అందజేసిందని, వారు పూర్తిగా పరిశీలన జరిపి వివరా లను అందించనుందని తెలిపారు.
వాదనలు విన్న ధర్మాససం.. తదుపరి విచారణలో సీఎస్ సోమేశ్, ఐఏఎస్‌లు అర్వింద్‌కుమార్, శ్రీనివాసరాజుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. మిగతా అధికారులంతా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. పునరుద్ధరణ చర్యలపై నివేదికను అందజేయా లని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment