సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది మధ్య ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్నట్లు పేర్కొంది.
దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ, మంగళ వారాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment